- Home
- Entertainment
- సూపర్ స్టార్ కృష్ణ కొడుకు, రామారావు మనవడితో మల్టీస్టారర్ ప్లాన్.. మహేష్ బ్లండర్ మిస్టేక్ వల్ల అంతా పోయింది
సూపర్ స్టార్ కృష్ణ కొడుకు, రామారావు మనవడితో మల్టీస్టారర్ ప్లాన్.. మహేష్ బ్లండర్ మిస్టేక్ వల్ల అంతా పోయింది
సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఓ మల్టీస్టారర్ చిత్రం మిస్ అయింది. అదే విధంగా మహేష్ ఒక బ్లాక్ బస్టర్ చిత్రాన్ని కూడా రిజెక్ట్ చేశారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

కృష్ణ, ఎన్టీఆర్ కాంబినేషన్
సూపర్ స్టార్ కృష్ణ, ఎన్టీ రామారావు అనేక చిత్రాల్లో కలిసి నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో దేవుడు చేసిన మనుషులు, విచిత్ర కుటుంబం లాంటి అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణం రాజు, శోభన్ బాబు అనేక మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. కానీ ఇటీవల కాలంలో టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీస్ బాగా తగ్గిపోయాయి.
నిర్మాత చంటి అడ్డాల
ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల ఒక క్రేజీ మల్టీస్టారర్ చిత్రం కోసం ప్రయత్నించారట. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. చంటి అడ్డాల.. అల్లరి రాముడు, అడవి రాముడు, బాచి, కృష్ణ బాబు, అల్లరి నరేష్ యముడికి మొగుడు లాంటి చిత్రాలని నిర్మించారు. గతంలో ఆయన మహేష్ బాబుతో ఓ సినిమా నిర్మించాలని చాలా ప్రయత్నించారట.
మహేష్ బాబు, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ మూవీ
చంటి అడ్డాల మాట్లాడుతూ.. ఎన్టీఆర్, కృష్ణ మల్టీస్టారర్ చిత్రం దేవుడు చేసిన మనుషులు మూవీ నాకు చాలా ఇష్టం. ఆ చిత్రానికి రీమేక్ తెరకెక్కించాలనే కోరిక ఉండేది. సూపర్ స్టార్ కృష్ణ తనయుడు మహేష్ బాబు, ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల ఆ కాంబినేషన్ సెట్ చేయలేకపోయాం. కానీ మహేష్ బాబుతో సినిమా చేయాలని చాలా ట్రై చేశా.
ఇడియట్ సినిమాని రిజెక్ట్ చేసిన మహేష్
పూరి జగన్నాధ్ దర్శకుడిగా ఇండియట్ సినిమాని ముందుగా మహేష్ తోనే అనుకున్నాం. చాలా చర్చలు జరిగాయి. కానీ మహేష్ బాబు ఆ కథకి కనెక్ట్ కాలేకపోతున్నారు. దీనితో పూరి జగన్నాధ్ తనకి బాగా ఆలస్యం అవుతోందని కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో సినిమా ప్రారంభించారు. ఆ తర్వాత ఆయన వేరే నిర్మాతలతో, రవితేజ హీరోగా ఇడియట్ సినిమా చేశారు.
రవితేజ కెరీర్ నే మార్చేసిన మూవీ
ఆ సినిమా రవితేజ కెరీర్ నే మార్చేసింది. మహేష్ బాబు రిజెక్ట్ చేసిన ఆ కథ అద్భుతం చేసింది అని చంటి అడ్డాల తెలిపారు. చూశారా.. ఒకరికి నచ్చని కథ మరొకరికి నచ్చితే ఏం జరిగిందో అని చంటి అడ్డాల తెలిపారు. మహేష్ బాబు ఇడియట్ సినిమాని కోల్పోవడంతో పాటు.. తన తండ్రి కృష్ణ, ఎన్టీఆర్ నటించిన ఐకానిక్ మూవీ దేవుడు చేసిన మనుషులు రీమేక్ ని కూడా మిస్ అయ్యారు. ఇడియట్ సినిమాని కోల్పోవడం పూర్తిగా మహేష్ చేసిన మిస్టేక్ అనే చెప్పాలి.

