హోరాహోరీగా రెండో వారం నామినేషన్స్.. అందరి టార్గెట్ ఆ కంటెస్టెంట్ పైనే..
Bigg Boss 9 Telugu nominations: బిగ్‌బాస్ తెలుగు 9 షో తొలి వారాన్ని విజయవంతంగా కంప్లీట్ చేసుకుని, రెండో వారంలోకి అడుగుపెట్టింది. అయితే.. రెండో వారం నామినేషన్స్ లోని ఎవరు నిలిచారు? సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ కానున్నారు? అనేది ఆసక్తిగా మారింది.

హోరాహోరీగా బిగ్ బాస్ పోరు
బుల్లితెర ప్రేక్షకుల మనసు దోచుకున్న బిగ్‌బాస్ తెలుగు 9 రసవత్తరంగా సాగుతోంది. విజయవంతంగా మొదటి వారం పూర్తి చేసుకుని రెండోవారంలో కి అడుగుపెట్టింది. అయితే.. ఫస్ట్ ఎలిమినేషన్ లో ఊహించని విధంగా కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయ్యింది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ సడెన్ గా కావడంతో ప్రేక్షకులు షాక్ అయ్యారు. దీంతో హౌస్‌లో ప్రస్తుతం 14 మంది కంటెస్టెంట్లు మిగిలారు. ఇక రెండో వారం నామినేషన్స్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఎవరు ఎవరిని టార్గెట్ చేశారు? ఎవరు ఎవరి పేరు చెప్పారనే విషయంలో పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
శ్రేష్టి వర్మ ఎలిమినేట్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 9లో 9 మంది సెలబ్రెటీలు, ఆరుగురు కామనర్స్ తో కలిసి మొత్తం 15 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైంది. సెలబ్రెటీ లిస్ట్ లో తనూజా పుట్టస్వామి, సంజన గల్రానీ, ఆశా షైనీ, రీతూ చౌదరి, భరణి శంకర్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, రాము రాథోడ్, సుమన్ శెట్టి, శ్రష్టీ వర్మ ఉండగా, బిగ్‌బాస్ అగ్నిపరీక్షలో ద్వారా హరిత హరీష్, మర్యాద మనీష్, డిమోన్ పవన్, పడాల పవన్ కళ్యాణ్, ప్రియా శెట్టి, దమ్ము శ్రీజలు కామనర్స్‌గా బిగ్‌బాస్‌లో అడుగుపెట్టారు. ఇందులో తొలివారం శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోయింది. ఇక ఓటింగ్ టాస్క్ లో గెలిచి భరణి బిగ్ బాస్ ఓనర్ ప్రమోట్ అయ్యారు.
అందరి టార్గెట్ మాస్క్ మ్యానే
బిగ్ బాస్ షోలో అత్యంత ఆసక్తికర, ఉత్కంఠభరితమైన భాగం నామినేషన్ల పర్వం. ఈ నేపథ్యంలో రెండో వారం నామినేషన్స్ లో బలి అయ్యేందెవరు? ఎవరి టార్గెట్ ఎవరిపై అనేది ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం అందరి టార్గెట్ మాస్క్ మ్యాన్ పైనే. తొలివారం హౌస్‌లో హంగామా చేసిన వ్యక్తి హరిత హరీష్. మొదటి రోజే తనూజాతో గొడవ పెడుతున్నారు. ఆ తరువాత ఇమ్మాన్యుయేల్, భరణి శంకర్‌లతో ఘర్షణలకు దిగాడు. "రెడ్ ఫ్లవర్", "ఆడింగోళ్లు" అంటూ వాడిన పదజాలం కారణంగా హౌస్‌లో అందరి దృష్టి తనపై పడింది. దీంతో రెండో వారం నామినేషన్స్‌లో ఎక్కవ మంది మాస్క్ మ్యానే టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది.
ప్రతీకారం తీర్చుకునే సమయం
లెటెస్ట్ ప్రోమో ప్రకారం.. ఇక సెలబ్రెటీలు, కామనర్స్ మధ్య టెన్షన్ కూడా పెరుగుతోంది. గత వారం కామనర్స్ తమను నామినేట్ చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవాలని సెలబ్రెటీలు ఈ వారం రివెంజ్ నామినేషన్స్ చేసేలా ఉన్నారు. అందువల్ల నామినేషన్ ప్రక్రియ మరింత ఆసక్తికరంగా, హోరాహోరీగా మారింది. రెండో వారం నామినేషన్స్‌లో మర్యాద మనీష్, హరిత హరీష్, తనూజ పుట్టస్వామి, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, భరణి శంకర్, ఫ్లోరా షైనీ నామినేషన్ అయినట్టు తెలుస్తోంది. వీరిలో ఎవరు వాస్తవంగా నామినేట్ అయ్యారో, ఎవరి గేమ్‌ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో తెలుసుకోవాలంటే అధికారిక ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.