- Home
- Entertainment
- Bigg Boss 9 Telugu :మొదటి వారమే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుట్.. శ్రేష్టి వర్మ రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Bigg Boss 9 Telugu :మొదటి వారమే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అవుట్.. శ్రేష్టి వర్మ రెమ్యూనరేషన్ ఎంతంటే..?
Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు 9 మొదటి వారం ఓటింగ్ రేసులో శ్రేష్టి వర్మలు డేంజర్ జోన్‌లో నిలిచారు. చివరికి తక్కువ ఓట్లు పొందిన శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. అయితే.. ఆమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనేది హాట్ టాపిక్ గామారింది.

కొత్త కాన్సెప్ట్ తో
బుల్లితెర ప్రేక్షకుల మోస్ట్ పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్‌గా ఆరంభమైంది. సెలబ్రిటీలు, కామనర్స్ మిక్స్‌తో ఈసారి హౌస్‌లో ఎన్నో కొత్త ఫేసెస్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సారి హౌస్‌లో 15 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. సెలబ్రెటీలను టెనెంట్స్ గా, కామనర్స్ ఓనర్స్ గా విభజించారు. కేవలం మొదటి వారంలోనే హౌస్‌లో పోటీ ఎంత కఠినంగా ఉందో తెలుస్తోంది. కంటెస్టెంట్స్ గొడవలు, ట్విస్టులు, కాంట్రవర్సీలతో బిగ్ బాస్ హౌస్ వార్ రూమ్ గా మారిపోయింది. కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది.
నామినేషన్స్ లో నిలిచిందెవరు?
బిగ్ బాస్ సీజన్ 9 లోకి కామనర్స్‌గా మనీష్, హరీష్, శ్రీజ దమ్ము, ప్రియా, సోల్జర్ కల్యాణ్, డీమోన్ పవన్ ఉండగా, సెలబ్రిటీ కేటగిరీలో రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్, సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, తనూజ గౌడ, శ్రేష్టి వర్మ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి ఉన్నారు. మొదటి వారంలో తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. సెలబ్రెటీల్లో భరణి తప్ప మిగితా వారందరూ నామినేషన్స్ లో నిలువగా, ఇక కామనర్స్ నుంచి డిమోన్ పవన్ నామినేషన్స్ లో నిలిచారు. అయితే.. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా? అనే ఉత్కంఠతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
ఎలిమినేట్ ఎవరు?
బిగ్ బాస్ విజయవంతం మొదటి వారం పూర్తి చేసుకుంది. అయితే.. ఎప్పటిలాగే హౌస్‌లో ఉన్న వారిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అనే ఉత్కంఠతో ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మొదటి వారంలో తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. ఓటింగ్ రేసులో ఫ్లోరా సైనీ, శ్రేష్టి వర్మలు డేంజర్ జోన్‌లో నిలిచారు. చివరికి కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మకు తక్కువ ఓట్లు రావడంతో ఆమె ఈ సీజన్ తొలి ఎలిమినేట్‌గా బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.
శ్రేష్టి వర్మ రెమ్యునరేషన్
బిగ్ బాస్ 9 తెలుగు నుంచి బయటకు వచ్చిన తర్వాత శ్రేష్టి వర్మ పారితోషికం హాట్ టాపిక్‌గా మారింది. సమాచారం ప్రకారం, ఆమె రోజుకు దాదాపు రూ. 28,571 రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ విధంగా చూస్తే.. ఆమె వారం రోజులు హౌస్‌లో ఉండటం వల్ల దాదాపు రూ. 2 లక్షలు సంపాదించుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఇతర కంటెస్టెంట్లతో పోలిస్తే తక్కువగానే భావిస్తున్నారు. మొదటి వారమే హౌస్‌లో పోటీ ఎంత కఠినంగా ఉందో తెలుస్తోంది. మిగిలిన కంటెస్టెంట్స్ మధ్య వచ్చే వారాల్లో ఏ విధమైన ట్విస్టులు, కాంట్రవర్సీలు జరుగుతాయో చూడాలి. ప్రేక్షకులు మాత్రం ఎప్పటిలాగే బిగ్ బాస్ హౌస్‌లో ఎలిమినేషన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎలిమినేషన్ కారణాలు
శ్రేష్టి వర్మ పేరు గతంలో పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తూ మీడియా ముందుకు రావడంతో ఆమె హాట్ టాపిక్ అయ్యింది. అయితే, బిగ్ బాస్ 9 తెలుగు వేదిక ద్వారా ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. మొదటి వారంలోనే ఎలిమినేట్ కావడంతో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు.
ఆమె ఓటింగ్ ప్రారంభమైన దగ్గర నుంచే శ్రష్టి వర్మ తక్కువ ఓట్లు పొందిందన్న టాక్ వినిపించింది. మొదటి వారం ఆమె పెద్దగా హైలైట్ కాలేదు. హౌస్‌మేట్స్‌తో సరైన ఇంటరాక్షన్ లేకపోవడం, గేమ్‌లో పట్టు చూపించకపోవడంతో ఆమె ఓటింగ్‌లో వెనుకబడింది. ఫలితంగా తొలిగానే బిగ్ బాస్ హౌస్‌ను వీడాల్సి వచ్చింది.
ఈ సీజన్ ఆరంభం నుంచే మంచి హైప్ క్రియేట్ అయింది. నాగార్జున హోస్ట్‌గా తన స్టైల్‌తో ఆకట్టుకుంటున్నారు. మొదటి వారం నుంచే వివాదాలు, టాస్కులు, భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. ఆశ్చర్యకరంగా ఈ వారం సంజనా గల్రానీ కి కెప్టెన్సీ అవకాశం వచ్చింది. మొదట ఆమె ఎలిమినేట్ అవుతుందన్న ప్రచారం నడిచినా, ఇప్పుడు కెప్టెన్ కావడంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా శ్రష్టి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్లిపోతున్నదని టాక్.
నోట్ .. సోషల్ మీడియా పోస్టులు ఆధారంగా ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. అధికార ప్రకటన కోసం మరికొన్ని గంటలు వేచి ఉండాల్సిందే.