- Home
- Entertainment
- సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే
బిగ్ బాస్ తెలుగు 9 షోలో భాగంగా 95వ రోజు సుమన్ శెట్టి, పవన్ లకు ఊహించని షాక్ తప్పలేదు. లీడర్ బోర్డులో తక్కువ పాయింట్స్ తో ఉండడంతో వాళ్లిద్దరూ గేమ్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

బిగ్ బాస్ తెలుగు 9
బిగ్ బాస్ హౌస్ లో 95వ రోజు ఎమోషనల్ గా ప్రారంభమైంది. లీడర్ బోర్డులో సుమన్ శెట్టి అతి తక్కువ స్కోర్ తో బాటమ్ లో ఉన్నారు. కాబట్టి సుమన్ శెట్టి తదుపరి టాస్క్ లలో పాల్గొనలేరు అని బిగ్ బాస్ తెలిపారు. కాబట్టి సుమన్ శెట్టి తన స్కోర్ లో సగం ఇతర సభ్యులకు ఇవ్వాలి అని తెలిపారు. దీనితో సుమన్ తన స్కోర్ ని భరణికి ఇవ్వాలని అనుకున్నారు. ఎందుకంటే ఈ హౌస్ లో తనకు అండగా నిలబడింది మీరే అంటూ భరణి వద్ద సుమన్ శెట్టి ఎమోషనల్ అయ్యాడు.
భరణి ఎమోషనల్
భరణి కూడా కంటతడి పెట్టుకున్నారు. కానీ స్కోర్ తనకి వద్దని.. ఎవరికి ఇస్తే ఉపయోగపడుతుందో వాళ్ళకే ఇవ్వాలని భరణి కోరారు. దీనితో సుమన్ శెట్టి.. సంజనకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. దీనితో ఈ పోటీ నుంచి సుమన్ శెట్టి తప్పుకోవాల్సి వచ్చింది.
పవన్ కి షాక్
తదుపరి యుద్ధంలో భరణిని తప్పించాలని ఇంటి సభ్యులు డిసైడ్ అయ్యారు. దీనితో భరణికి గేమ్ ఆడే అవకాశం రాలేదు. బాల్స్ ని జోకర్ బొమ్మపై విసిరే గేమ్ లో ఇమ్మాన్యుయేల్, సంజన విజయం సాధించారు. ఈ గేమ్ తర్వాత లీడర్ బోర్డు లో పవన్ బాటమ్ లోకి వెళ్లారు. దీనితో తదుపరి గేమ్ లో ఆడే అవకాశాన్ని పవన్ కోల్పోయాడు.
భరణికి కళ్యాణ్ వెన్నుపోటు
దీనితో పవన్ తన పాయింట్స్ ని తనూజకి ఇచ్చేశాడు. ఆ తర్వాత మరొకరిని గేమ్ తదుపరి యుద్ధం నుంచి తప్పించాలని బిగ్ బాస్ అడిగారు. భరణికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. కళ్యాణ్ కూడా భరణి తప్పుకోవాలని ఓట్ వేశాడు. దీనితో భరణి యుద్ధం నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తాను కళ్యాణ్ కి ఎన్నిసార్లు సపోర్ట్ చేసినా.. కళ్యాణ్ మాత్రం తనకి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు అని భరణి మనస్తాపానికి గురయ్యారు.
తనూజ ఏడుపు ఫేక్
తాను సపోర్ట్ చేసినందుకు ఒక్కసారైనా కళ్యాణ్ తిరిగి సపోర్ట్ చేసి ఉంటే న్యాయంగా ఉండేది అని భరణి అన్నారు. మీరు ప్రతి సారి రాంగ్ ప్లేస్ లో ఉంటున్నారు. కాబట్టి నాకు తప్పడం లేదు. మిమ్మల్ని బలి చేయాలనే ఉద్దేశం నాకు లేదు అని కళ్యాణ్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి కళ్యాణ్ వెన్నుపోటుకు భరణి గురయ్యారు. ఆ తర్వాత జరిగిన గేమ్ లో ఇమ్మాన్యుయేల్ విజయం సాధించాడు. ఆ తర్వాత తనూజకి అభిమానుల వద్ద ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశం వచ్చింది. ఓ అభిమాని తనూజని ముఖం మీదే సంచలన ప్రశ్న అడిగారు. మీరు ఎప్పుడూ ఏడుస్తూ ఉంటారు. ఎవరైనా మీ మీద ప్రేమ చూపించాలని అలా ఏడుస్తారా ? ఎందుకంటే ఒక్కోసారి మీ ఏడుపు ఫేక్ అనిపిస్తోంది అని అడిగారు. దీనికి తనూజ సమాధానం ఇస్తూ.. నా ఏడుపు ఫేక్ కాదు. ఇక్కడ హౌస్ లో ఉన్న వారంతా నాకు కొత్త వారు. నా ఎమోషన్స్ ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఏడుపు వస్తోంది అని వివరణ ఇచ్చింది.

