- Home
- Entertainment
- డాక్టర్ చదివిన ప్రియా శెట్టి బిగ్ బాస్ కి ఎందుకు వచ్చిందో తెలుసా..సోషల్ మీడియా మొత్తం ఆమె గురించే..
డాక్టర్ చదివిన ప్రియా శెట్టి బిగ్ బాస్ కి ఎందుకు వచ్చిందో తెలుసా..సోషల్ మీడియా మొత్తం ఆమె గురించే..
బిగ్ బాస్ హౌస్ లోకి ఓ యంగ్ డాక్టర్ ఎంట్రీ ఇచ్చింది. రాయలసీమకి చెందిన ఆమె గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లోకి ఎంట్రీ ఇచ్చిన కామనర్స్ లో ప్రియా శెట్టి ఒకరు. బిగ్ బాస్ అగ్ని పరీక్ష నుంచే ఈ అమ్మాయి నెటిజన్లని తన క్యూట్ లుక్స్ తో అట్రాక్ట్ చేసింది. కర్నూలుకి చెందిన రాయలసీమ అమ్మాయి ప్రియా శెట్టి ఒక డాక్టర్. బిగ్ బాస్ షోలో ఛాన్స్ వస్తే వెళ్ళమని వాళ్ళ ఇంట్లో వాళ్లే ఎంకరేజ్ చేశారట.
తల్లిదండ్రుల కోసం మెడిసిన్ చదివి డాక్టర్ అయినట్లు ప్రియా శెట్టి పేర్కొంది. అదే విధంగా తాను వ్యాపార రంగంలో కూడా రాణిస్తున్నట్లు పేర్కొంది. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో నవదీప్ తో పెళ్లి చూపులు స్కిట్ చేసి నవ్వించింది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ప్రియా శెట్టి ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందో చూడాలి.
ప్రియా శెట్టి తన క్యూట్ లుక్స్ తో కట్టిపడేస్తుంది. ప్రియా శెట్టి అగ్నిపరీక్ష నుంచే తన హంగామా మొదలు పెట్టేసింది. ఇంస్టాగ్రామ్ లో కూడా ప్రియా శెట్టికి లక్షకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.
ప్రియా శెట్టి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో శ్రీముఖి, నవదీప్ తో కలిసి చేసిన పెళ్లి చూపులు స్కిట్ ని ఆడియన్స్ అంత త్వరగా మరచిపోలేరు. శ్రీముఖిని అత్తా అని పిలుస్తూ నవ్వించింది. క్యూట్ లుక్స్ తో మాయ చేస్తున్న ఈ డాక్టర్ పాప గురించి అప్పుడే నెటిజన్లు సోషల్ మీడియాలో, గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు.
ప్రియా శెట్టి వివిధ ట్రెండీ అవుట్ ఫిట్ లు ధరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటుంది. రాయలసీమ బిడ్డ బిగ్ బాస్ లో ఏ మేరకు సత్తా చాటుతుంది ? టాప్ 5 కి చేరుకోగలుగుతుందా అనేది తెలియాలంటే మరికొంత కాలం ఎదురుచూడాల్సిందే.