MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రెబల్ గా రీతూకి ఛాన్స్, కావాలనే ఇమ్మాన్యుయేల్ గొడవ.. తగ్గేదే లే అంటూ రెచ్చిపోయిన గౌరవ్

రెబల్ గా రీతూకి ఛాన్స్, కావాలనే ఇమ్మాన్యుయేల్ గొడవ.. తగ్గేదే లే అంటూ రెచ్చిపోయిన గౌరవ్

బిగ్ బాస్ తెలుగు 9 షోలో రీతూ చౌదరికి రెబల్ గా అవకాశం దక్కింది. రెబల్ గా మారిన రీతూ హౌస్ లో సీక్రెట్ గా కొన్ని పనులు చేసింది. కెప్టెన్సీ కంటెండర్లుగా ఎవరికీ అవకాశం దక్కిందో ఈ కథనంలో తెలుసుకోండి.  

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 06 2025, 11:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ బాస్ తెలుగు 9
Image Credit : Asianet News

బిగ్ బాస్ తెలుగు 9

కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 60 రోజు కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ చోటు చేసుకున్నాయి. బిగ్ బాస్ నియమించిన రెబల్స్ చక్కగా సీక్రెట్ టాస్క్ లు పూర్తి చేస్తుండడంతో గేమ్ ఆసక్తికరంగా మారింది. బుధవారం రోజు టాస్క్ లో గెలిచిన ఆరెంజ్ టీం తమకి దక్కిన సేఫ్ గార్డ్ ని తమ టీంలోని తనూజకి ఇవ్వాలని నిర్ణయించారు. అదే విధంగా హౌస్ లో రెబల్స్ గా దివ్య, సుమన్ శెట్టి చాలా తెలివిగా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు పూర్తి చేశారు. వారిద్దరూ ఎవ్వరికీ దొరకకుండా రెబల్స్ గా పని పూర్తి చేశారు. 

25
రెబల్ గా రీతూకి ఛాన్స్
Image Credit : Asianet News

రెబల్ గా రీతూకి ఛాన్స్

బిగ్ బాస్ సుమన్ శెట్టికి ఫోన్ చేసి రెబల్స్ గా ఇక మీ పని పూర్తయింది అని తెలిపారు. ఆ తర్వాత బిగ్ బాస్ కొత్త రెబల్ గా రీతూ చౌదరిని సీక్రెట్ గా నియమించారు. ఆమెకి ఇచ్చిన మొదటి సీక్రెట్ టాస్క్.. హౌస్ లో ఎవరితో అయినా కావాలనే సీరియస్ గా గొడవ పెట్టుకోవాలి. ఆ పని పూర్తయ్యాక కంటెండర్ రేసు నుంచి ఎవరినైనా తప్పించాలి. దీనితో రీతూ వెళ్లి గౌరవ్ తో గొడవ పెట్టుకోవాలని ట్రై చేసింది. కానీ కుదర్లేదు. 

Related Articles

Related image1
రాజమౌళి గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు, పాత బైక్ లో తిరుగుతూ.. ఎన్టీఆర్ ఇలా ఎందుకు అన్నారో తెలుసా
Related image2
అనుష్క దెబ్బకు బలైన 6 సినిమాలు ఇవిగో.. ఆ ఎఫెక్ట్ వల్లే ఫేడ్ అవుట్ అయిన స్టార్ హీరో
35
సాయిని బలి చేసిన రీతూ
Image Credit : Asianet News

సాయిని బలి చేసిన రీతూ

దీనితో ఇమ్మాన్యుయేల్ తో గొడవ పెట్టుకుంది. ఈ గొడవ తర్వాత సాయిని కంటెండర్ రేసు నుంచి తప్పిస్తున్నట్లు రీతూ ప్రకటించింది. ఆ తర్వాత బిగ్ బాస్ బ్లూ, ఆరెంజ్, పింక్ టీమ్స్ కి ఒక టాస్క్ ఇచ్చారు. రిలే పద్దతిలో బకెట్స్ లో నీళ్లు నింపాలి. ఆ బకెట్స్ లో ఉన్న బాల్స్ పైకి వచ్చాక వాటితో తమ టీమ్ ఫ్లాగ్స్ ని పైకి లేపాలి. 

45
సేఫ్ గార్డ్ కోసం ఇమ్మాన్యుయేల్, గౌరవ్ గొడవ
Image Credit : Asianet News

సేఫ్ గార్డ్ కోసం ఇమ్మాన్యుయేల్, గౌరవ్ గొడవ

ఈ టాస్క్ లో ఆరెంజ్ టీం నుంచి ఇమ్ము, గౌరవ్.. బ్లూ టీం నుంచి రీతూ, భరణి.. పింక్ టీం నుంచి దివ్య, సుమన్ శెట్టి పాల్గొన్నారు. కానీ ఈ టాస్క్ లో ఆరెంజ్ టీం విజయం సాధించింది. దీనితో వాళ్ళకి సేఫ్ గార్డ్ లభించింది. సేఫ్ గార్డ్ కోసం ఆరెంజ్ టీం వాళ్లలో వల్లే వాగ్వాదానికి దిగారు. చివరికి కాంప్రమైజ్ అయ్యారు. దీనితో గౌరవ్ కి సేఫ్ గార్డ్ దక్కింది. ఇంతలో ఇంటి సభ్యులు రెబల్ ఎవరనే ఊహాగానాల్లో మునిగిపోయారు. కొంతమంది సంజనపై అనుమానం పెంచుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ రీతూకి రెండవ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. 

55
కెప్టెన్సీ కంటెండర్లు వీరే
Image Credit : Asianet News

కెప్టెన్సీ కంటెండర్లు వీరే

ఈ టాస్క్ ప్రకారం రీతూ.. ఇమ్మాన్యుయేల్ ఫ్యామిలీ ఫొటో దాచిపెట్టాలి. ఈ టాస్క్ ని కూడా రీతూ విజయవంతంగా పూర్తి చేసింది. ఆ తర్వాత రెబల్ ఎవరనేది ఒక్కో ఇంటి సభ్యుడు గెస్ చేసి చెప్పాలి. ఈ టాస్క్ లో ఎక్కువ మంది సభ్యులు గౌరవ్ అని భావించారు. కానీ చివరికి బిగ్ బాస్ అసలైన రెబల్స్ ని రివీల్ చేశారు. మొత్తంగా భరణి, తనూజ, సుమన్, దివ్య, ఇమ్మాన్యుయేల్, రీతూ, కెప్టెన్సీ కంటెండర్లుగా అవకాశం సాధించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
Oscar Tributes: కోట శ్రీనివాసరావుని ప్రత్యేకంగా గౌరవించిన ఆస్కార్‌.. ఈ ముగ్గురి దిగ్గజాలకు అకాడమీ నివాళ్లు
Recommended image2
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్‌ పెద్ద 420, నేను అస్సలు నమ్మను.. బండారం బయటపెట్టిన నటి
Recommended image3
Sneha Ullal: ఐశ్వర్య రాయ్‌లా ఉన్నందుకే సల్మాన్ ఛాన్స్ ఇచ్చాడు.. ఇన్నేళ్ల తర్వాత సీక్రెట్ చెప్పిన స్నేహా ఉల్లాల్
Related Stories
Recommended image1
రాజమౌళి గురించి మాట్లాడే అర్హత ఎవరికీ లేదు, పాత బైక్ లో తిరుగుతూ.. ఎన్టీఆర్ ఇలా ఎందుకు అన్నారో తెలుసా
Recommended image2
అనుష్క దెబ్బకు బలైన 6 సినిమాలు ఇవిగో.. ఆ ఎఫెక్ట్ వల్లే ఫేడ్ అవుట్ అయిన స్టార్ హీరో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved