అనుష్క దెబ్బకు బలైన 6 సినిమాలు ఇవిగో.. ఆ ఎఫెక్ట్ వల్లే ఫేడ్ అవుట్ అయిన స్టార్ హీరో
అనుష్క శెట్టి లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తే స్టార్ హీరోల చిత్రాల రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. అనుష్క నటించిన ఓ సూపర్ హిట్ మూవీ ప్రభావం వల్ల ఏకంగా 6 సినిమాలు బలయ్యాయి

అనుష్క శెట్టి అరుంధతి మూవీ
అనుష్క శెట్టి టాలీవుడ్ లో ఒక సంచలనం అనే చెప్పాలి. సూపర్ మూవీతో అనుష్క శెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. నెమ్మదిగా అనుష్కకి విక్రమార్కుడు, మహానంది, లక్ష్యం లాంటి విజయాలు అనుష్క క్రేజ్ ని పెంచుతూ వచ్చాయి. ఒక దశకి చేరుకున్న తర్వాత అనుష్క గ్లామర్ పాత్రలు చేస్తూనే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు దర్శకులకు పర్ఫెక్ట్ ఛాయిస్ గా మారింది. అరుంధతి చిత్రంతో అనుష్క హవా మరో స్థాయికి చేరుకుంది. వరల్డ్ వైడ్ గా అప్పట్లోనే ఈ చిత్రం 35 కోట్ల షేర్ రాబట్టింది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలలో అరుంధతి తిరుగులేని రికార్డ్ సృష్టించింది. అరుంధతి మూవీ తో అదే విధంగా కొన్ని వారాలకు అటూ ఇటూ గా విడుదలైన కొన్ని చిత్రాలు ఆ ప్రభంజనంలో కొట్టుకుపోయాయి. ఆ సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం.
మస్కా
రామ్ పోతినేని, షీలా, హన్సిక కలసి నటించిన ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ అరుంధతి చిత్రానికి రెండు రోజుల ముందు విడుదలయింది. మస్కా చిత్రానికి మంచి టాక్ వచ్చింది. కానీ అరుంధతి మూవీ జోరు ముందు ఈ సినిమా ప్రభావం అంతగా కనిపించలేదు. మస్కా కలెక్షన్లకు అరుంధతి భారీగా గండి కొట్టింది. హిట్ కావాల్సిన మస్కా మూవీ అరుంధతి దెబ్బకు యావరేజ్ గా నిలిచింది.
అరుంధతి దెబ్బకు స్టార్ హీరో కెరీర్ ఫేడ్ అవుట్
అరుంధతి మూవీ కారణంగా తుడిచిపెట్టుకుపోయిన మారో స్టార్ హీరో సినిమా శిశిరేఖా పరిణయం. లవర్ బాయ్ తరుణ్, జెనీలియా జంటగా నటించిన ఈ మూవీ అరుంధతి చిత్రానికి కొన్ని రోజుల ముందు విడుదలైంది. అప్పటికే వరుస పరాజయాలతో తరుణ్ ఇబ్బంది పడుతున్నాడు. శశిరేఖా పరిణయం కూడా డిజాస్టర్ కావడంతో తరుణ్ కెరీర్ టాలీవుడ్ లో ఫేడ్ అవుట్ కావడం ప్రారంభం అయింది. ఆ తర్వాత తరుణ్ ఒకటి రెండు సినిమాలు చేసినప్పటికీ అవి తరుణ్ కి ఏమాత్రం ఉపయోగపడలేదు.
నటుడు శివాజీ నటించిన మూవీ కూడా ఫ్లాప్
అరుంధతి చిత్రానికి కొన్ని రోజుల ముందు విడుదలైన నటుడు శివాజీ సైకలాజికల్ థ్రిల్లర్ ఇందుమతి కూడా అరుంధతి ప్రభావంతో ఫ్లాప్ అయింది. ఈ చిత్రంలో శివాజీ తో పాటు శ్వేతా భరద్వాజ్ కీలక పాత్రలో నటించారు.
మరికొన్ని సినిమాలపై అరుంధతి ప్రభావం
మస్కా, శశిరేఖా పరిణయం తో పాటు మరికొన్ని చిన్న చిత్రాలపై కూడా అరుంధతి ప్రభావం పడింది. ష్, బ్యాంక్ అనే చిత్రాలు అరుంధతి జోరు ముందు కనిపించకుండా పోయాయి. అప్పటికే నెగిటివ్ టాక్ తో నడుస్తున్న రవితేజ నేనింతే చిత్రం అరుంధతి రిలీజ్ అయ్యాక పూర్తిగా కనిపించకుండా పోయింది.