- Home
- Entertainment
- Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?
Bigg Boss Telugu 9: నిధి అగర్వాల్ కి చుక్కలు చూపించిన ఇమ్మాన్యుయేల్.. హౌస్ లో కూడా ఆమె పరిస్థితి అంతేనా ?
బిగ్ బాస్ తెలుగు 9 షోలో నిధి అగర్వాల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. టాప్ 5 సభ్యులతో ఆమె సరదాగా ముచ్చటించారు. నిధి అగర్వాల్ ని చూసి ఇమ్మాన్యుయేల్ చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

బిగ్ బాస్ తెలుగు 9
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 తుది దశకు చేరుకుంది. ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలేతో బిగ్ బాస్ తెలుగు 9 ముగుస్తుంది. టాప్ 5లో ఇమ్మాన్యుయేల్, సంజన, డిమాన్ పవన్, కళ్యాణ్, తనూజ ఉన్నారు. శనివారం ఎపిసోడ్ లో ఫుల్ హంగామా ఉండబోతోంది. కొందరు సెలెబ్రిటీలు హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
రాజాసాబ్ ప్రమోషన్స్
రాజా సాబ్ హీరోయిన్ నిధి అగర్వాల్ గెస్ట్ గా హౌస్ లోకి వెళ్లి కాసేపు టాప్ 5 సభ్యులతో సరదాగా గడిపింది. దీనికి సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఇటీవల నిధి అగర్వాల్ రాజా సాబ్ ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్ లోని లులు మాల్ ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అభిమానులు ఆమెని చుట్టుముట్టి తీవ్ర అసౌకర్యం కలిగించారు.
నిధి అగర్వాల్ కి చేదు అనుభవం
నిధి అగర్వాల్ ఆ జనం నుంచి నానా తిప్పలు పడి కారు ఎక్కేసింది. ఆమె ధరించిన కాస్ట్యూమ్స్ కూడా నలిగిపోయే పరిస్థితితి ఏర్పడింది. ఆ సంఘటనలో జనం దారుణంగా బిహేవ్ చేశారు అనే కామెంట్స్ వినిపించాయి. చిత్ర యూనిట్ ప్లానింగ్, సెక్యూరిటీ కూడా సరిగ్గా లేదనే విమర్శలు వచ్చాయి.
బిగ్ బాస్ హౌస్ లో నిధి అగర్వాల్ సందడి
బయట నిధి అగర్వాల్ కి అలాంటి సంఘటన ఎదురుకాగా.. బిగ్ బాస్ హౌస్ లో ఆమెకి ఇమ్మాన్యుయేల్ చుక్కలు చూపించాడు. కానీ ఇదంతా సరదాగా సాగింది. హౌస్ మేట్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు నిధి అగర్వాల్ కాసేపు వారితో సరదాగా మాట్లాడింది. వాళ్ళకి గేమ్స్ కూడా పెట్టింది. నిధి అగర్వాల్ రాగానే ఇమ్మాన్యుయేల్ రెచ్చిపోయాడు. పాపలకే పాప నిధి పాప అంటూ కేకలు వేశాడు. నిధి అగర్వాల్ కూడా బాగానే సెటైర్లు వేసింది. టైటిల్ గెలిస్తే మీరు ఏం చేస్తారు అని పవన్ ని అడిగింది. తనకి కొన్ని గోల్స్ ఉన్నాయని చెప్పాడు. ఏంటి గర్ల్స్ ఉన్నాయా ? అంటూ నిధి ఫన్నీగా అడిగింది. దీనితో అంతా నవ్వేశారు.
ఇమ్మాన్యుయేల్ రొమాన్స్
ఆ తర్వాత నిధి అగర్వాల్ ఇంటి సభ్యులకు ఒక గేమ్ పెట్టింది. కళ్ళకు గంతలు కట్టుకుని ఆడే గేమ్ అది. పొరపాటున మిమ్మల్ని ముట్టుకుంటే ఏమీ అనుకోవద్దు అని ఇమ్మాన్యుయేల్ నిధి అగర్వాల్ ని రొమాంటిక్ గా అడగడం నవ్వులు పూయిస్తోంది.

