- Home
- Entertainment
- బిగ్ బాస్ హౌస్ లో కట్టప్ప, మహానటి అన్నీ తనూజనే.. చుక్కలు చూపించిన అవినాష్, టాప్ 5పై నాగబాబు అంచనా ఇదే
బిగ్ బాస్ హౌస్ లో కట్టప్ప, మహానటి అన్నీ తనూజనే.. చుక్కలు చూపించిన అవినాష్, టాప్ 5పై నాగబాబు అంచనా ఇదే
బిగ్ బాస్ తెలుగు 9లో శనివారం ఎపిసోడ్ లో మెగా బ్రదర్ నాగబాబు సందడి చేశారు. అదే విధంగా కమెడియన్ అవినాష్ కూడా బిగ్ బాస్ డయాస్ పైకి వచ్చి కడుపుబ్బా నవ్వించాడు.

బిగ్ బాస్ తెలుగు 9
బాస్ బాస్ తెలుగు 9షోలో శనివారం ఎపిసోడ్ చాలా ఫన్నీగా సాగింది. బిగ్ బాస్ డయాస్ పైకి కొందరు సెలెబ్రిటీలు, హౌస్ మేట్స్ కుటుంబ సభ్యులు వచ్చారు. అంతకు ముందు దివ్య, తనూజ మధ్య గొడవపై నాగార్జున పంచాయతీ పెట్టారు. ఈ పంచాయతీలో తనూజదే తప్పు అని భరణి చెప్పగా.. ఇమ్మాన్యుయేల్ మాత్రం దివ్య కొన్ని మాటలు తప్పుగా మాట్లాడింది అని తెలిపారు. ఎదుటి వ్యక్తి అరుస్తున్నారు అని నువ్వు కూడా అరిచి గొడవని పెద్దది చేస్తున్నావని తనూజని నాగార్జున గట్టిగా మందలించారు. కెప్టెన్ అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా అని ప్రశ్నించారు.
ఆమె ముఖం చూడను అంటూ దివ్య కామెంట్స్
దీనితో రీతూ వివరణ ఇచ్చుకుంది. అంతకు ముందు చూపించిన కంటెంట్ లో తనూజ గురించి దివ్య సంచలన వ్యాఖ్యలు చేసింది. జీవితంలో తనూజ ముఖం చూడాలని అనుకోవట్లేదు. బిగ్ బాస్ నుంచి బయటకి వెళ్లిన తర్వాత కూడా ఆమె ముఖం చూడను అంటూ దివ్య భరణికి చెప్పింది. ఇక బిగ్ బాస్ డయాస్ పైకి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చారు. మెగా బ్రదర్ నాగబాబు ఎంట్రీ ఇచ్చారు. ఆయనతో పాటు భరణి తల్లి కూడా వచ్చారు. వాళ్ళిద్దరినీ చూడగానే భరణి సంతోషంతో ఉప్పొంగిపోయారు. నా గురువు నా తల్లి వచ్చారు. ఇంతకి మించిన బెస్ట్ మూమెంట్ లేదు అని భరణి ఎమోషనల్ అయ్యారు.
టాప్ 5లో ఉండేది వీళ్ళే, నాగబాబు అంచనా
నాగబాబు భరణితో ఉన్న అనుబంధం గురించి పంచుకున్నారు. ఇద్దరం కలిసి టీవీ సీరియల్స్ లో నటించామని, ఆ సమయంలో భరణి చాలా అగ్రెసివ్ గా ఉండేవాడని నాగబాబు గుర్తు చేసుకున్నారు. కానీ బిగ్ బాస్ షోకి వెళ్లిన తర్వాత మరీ సాఫ్ట్ గా, గంగి గోవులా మారిపోయాడు. మరీ అంత సాఫ్ట్ నెస్ అవసరం లేదు అని నాగబాబు భరణికి సూచించారు. ఆ తర్వాత నాగబాబు, భరణి తల్లి ఇద్దరూ హౌస్ లో టాప్ 5 ఎవరు ఉంటారో అంచనా వేస్తూ.. నాగార్జున చెప్పినదాని ప్రకారం ఫోటోలు ఉంచారు. భరణి, తనూజ, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, సంజన టాప్ 5 లో ఉంటారని నాగబాబు తెలిపారు.
రీతూ చౌదరిపై నాగబాబు
సెటైర్ ఇక బాక్స్ లో నుంచి కొన్ని సినిమా క్యారెక్టర్స్ బయటకి తీస్తూ ఆ క్యారెక్టర్ హౌస్ లో ఎవరికి సూట్ అవుతుందో చెప్పాలని నాగార్జున నాగబాబుని అడిగారు. ముందుగా గజినీ క్యారెక్టర్ వచ్చింది. హౌస్ లో ఉన్న గజినీ భరణీనే అని నాగబాబు అన్నారు. అగ్రెసివ్ గా ఆడాలనే విషయం మరచిపోతున్నాడని నాగబాబు తెలిపారు. ఇక రెండవ క్యారెక్టర్ హాసిని. హౌస్ లో ఎప్పుడూ నవ్వుతూనే ఉండే అమ్మాయి రీతూ చౌదరి. కాకపోతే కొన్నిసార్లు ఆమె మాయాబజార్ లో ఎస్వీ రంగారావు లా నవ్వుతుంది అని నాగబాబు సెటైర్లు వేశారు. ఆ తర్వాత డయాస్ పైకి కళ్యాణ్ కుటుంబ సభ్యులు వచ్చారు. కళ్యాణ్ తండ్రి, తమ్ముడు వచ్చారు. వాళ్ళని చూసి కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. కళ్యాణ్ తండ్రి తాము జీవితంలో అనుభవించిన కష్టాల గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
హౌస్ లో మహానటి, కట్టప్ప ఎవరంటే..
ఆ తర్వాత ఇమ్మాన్యుయేల్ బ్రదర్, అదే విధంగా కమెడియన్ అవినాష్ ఎంట్రీ ఇచ్చారు. అవినాష్ వచ్చినప్పటి నుంచి వెళ్లే వరకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వించాడు. అవినాష్.. తనూజ, రీతూ చౌదరిని ఆటపట్టించిన విధానం బాగా నవ్వించింది. రీతూ, పవన్ మధ్య గొడవని అవినాష్ మిమిక్రీ చేస్తూ నవ్వించాడు. రీతూ, పవన్ లకు చుక్కలు చూపించాడు. అవినాష్ బాక్స్ లో నుంచి క్యారెక్టర్స్ తీస్తూ మహానటి క్యారెక్టర్ ని తనూజకి ఇచ్చారు. ఆమె ఎందుకు అని అడిగింది. ఎందుకంటే నువ్వు గొప్ప నటివి అందుకే ఇచ్చా అని అవినాష్ తెలిపాడు. ఆ తర్వాత కట్టప్ప క్యారెక్టర్ కూడా తనూజకే సూట్ అవుతుంది అని అవినాష్ తెలిపాడు. హౌస్ లో ఆమె నలుగురు ఐదుగురికి వెన్నుపోటు పొడిచింది అని ఫన్నీగా చెప్పాడు.

