- Home
- Entertainment
- రీతూ విషయంలో డిమాన్ పవన్ కి కళ్ళు మూసుకుపోయాయి, లత్కోర్ పనులు చేయను.. హరీష్ సంచలన వ్యాఖ్యలు
రీతూ విషయంలో డిమాన్ పవన్ కి కళ్ళు మూసుకుపోయాయి, లత్కోర్ పనులు చేయను.. హరీష్ సంచలన వ్యాఖ్యలు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 15వ రోజు నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా హరిత హరీష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డిమాన్ పవన్, రీతూ చౌదరి గురించి అతడేమన్నాడో ఈ కథనంలో చూడండి. అలాగే ఈవారం నామినేషన్స్ లిస్ట్ కూడా చూడొచ్చు.

బిగ్ బాస్ తెలుగు 9లో 15వ రోజు
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో 15వ రోజు ఎలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయో ఇప్పుడు చూద్దాం. ఫ్లోరా షైనీ జైల్లో ఉన్న దృశ్యాలు చూపించారు. రీతూ చౌదరి తనతో ఎవరూ మాట్లాడడం లేదని వెక్కి వెక్కి ఏడ్చింది. దీనితో కళ్యాణ్ ఆమెని క్యూట్ గా ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య చిన్నపాటి రొమాన్స్ కనిపించింది. ఆ తర్వాత ఈవారం నామినేషన్ ప్రక్రియ వాడీవేడిగా సాగింది.
వాడివేడిగా నామినేషన్స్ ప్రక్రియ
నామినేషన్ ప్రక్రియని ముందుగా టెనెంట్స్ ప్రారంభించాలని బిగ్ బాస్ ఆదేశించారు. టెనెంట్స్ అంతా ఏకాభిప్రాయానికి వచ్చి ఐదుగురు సభ్యులని నామినేట్ చేయాలి. వారిలో ఒకరు టెనెంట్స్ అయి ఉండాలి. ముందుగా టెనెంట్స్ అంతా సంజనని నామినేట్ చేశారు. ఆమెకి అహం ఎక్కువ, ఎవరిమాటా లెక్కచేయదు అంటూ ఆరోపించారు. ఆ తర్వాత రీతూని నామినేట్ చేశారు. ఇలా టెనెంట్స్ ఏకాభిప్రాయానికి వచ్చి సంజన, రీతూ, సుమన్ శెట్టి, ఫ్లోరా షైనీ లని నామినేట్ చేశారు. టెనెంట్స్ లో కూడా ఒకరు ఉండాలి కాబట్టి ప్రియా, శ్రీజ, పవన్, కళ్యాణ్ కలసి హరీష్ ని నామినేట్ చేశారు.
డిమాన్ పవన్ కళ్ళు మూసుకుపోయాయి
హరీష్ పాత విషయాలనే కారణాలుగా చూపించారు. దీనితో హరీష్ ఆగ్రహానికి గురయ్యాడు. ఈ క్రమంలో డిమాన్ పవన్, హరీష్ మధ్య పెద్ద అర్జుమెంట్ జరిగింది. నిజాలు మాట్లాడుకుందాం రా.. నీకు రీతూ విషయంలో కళ్ళు మూసుకుపోయాయి. ఆమెకి ఫేవర్ గా ఉంటున్నావు. ఆమె చేసిన తప్పులు నీకు కనిపించవు.. నీలాగా నేను లత్కోర్ పనులు చేయను అంటూ హరీష్ రెచ్చిపోయారు. మొత్తంగా టెనెంట్స్ నామినేట్ చేసిన వారిలో సంజన, సుమన్ శెట్టి, రీతూ చౌదరి, ఫ్లోరా షైనీ, హరీష్ ఉన్నారు.
నామినేషన్స్ నుంచి సుమన్, సంజన ఎస్కేప్
ఇక ఓనర్స్ కి నామినేట్ చేసే అవకాశం వచ్చింది. టెనెంట్స్ నామినేట్ చేసిన వారిలో ఇద్దరిని స్వాప్ చేసే అధికారాన్ని బిగ్ బాస్ ఓనర్స్ కి ఇచ్చారు. ఓనర్స్ అంతా చర్చించుకుని సంజన, సుమన్ శెట్టి లని స్వాప్ చేసి వారి ప్లేస్ లో కళ్యాణ్, ప్రియా లని నామినేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఇమ్మాన్యుయేల్ ప్రకటించారు. కళ్యాణ్ అందరితో కలవలేకున్నాడు. గేమ్ సరిగ్గా ఆడడం లేదు అనే కారణాన్ని ఇమ్మాన్యుయేల్ తెలిపాడు. ఇక ప్రియా మాట్లాడే విధానం అందరికీ నచ్చడం లేదు అని తెలిపారు. ఫ్లోరా షైనీ వచ్చి.. ప్రియా నాతో చాలా బాగా ఉంటుంది. బాగా మాట్లాడుతుంది. హౌస్ లో నన్ను సాఫ్ట్ పర్సన్ అని అంటుంది. నేను సాఫ్ట్ పర్సన్ ని కాబట్టి నన్నే నామినేట్ చేసి వెన్ను పోటు పొడిచింది అని ఆవేదన వ్యక్తం చేసింది.
ఈవారం నామినేషన్స్ లిస్ట్ ఇదే
మిగిలిన వాళ్లలో శ్రీజ, రాము లని నామినేట్ చేశారు. దీనితో కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, హరీష్, శ్రీజ, రాము నామినేషన్స్ లో నిలిచారు. కెప్టెన్ పవన్ కి ఒకరిని సేవ్ చేసే పవర్ ని బిగ్ బాస్ ఇచ్చారు. దీనితో పవన్ శ్రీజని సేవ్ చేశారు. మొత్తంగా ఈవారం నామినేషన్స్ లో కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, హరీష్, రాము నిలిచారు.