MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • నాగచైతన్య కంటే ముందే.. అఖిల్ తండ్రి కాబోతున్నాడా? తాత కావడంపై నాగార్జున అక్కినేని రియాక్షన్ ఏంటి?

నాగచైతన్య కంటే ముందే.. అఖిల్ తండ్రి కాబోతున్నాడా? తాత కావడంపై నాగార్జున అక్కినేని రియాక్షన్ ఏంటి?

Akhil going to become a father : అక్కినేని వారింట ఇంట శుభవార్త అంటూ.. సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. కింగ్ నాగార్జున తాత కాబోతున్నట్టు టాలీవుడ్ కోడై కూస్తోంది. ఇంతకీ తండ్రి అయ్యేది ఎవరు నాగచైతన్య.. లేక అఖిల్ అక్కినేనినా..? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Dec 19 2025, 10:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తాత కాబోతున్న నాగార్జున..?
Image Credit : Asianet News

తాత కాబోతున్న నాగార్జున..?

గత కొన్ని రోజులుగా అక్కినేని ఇంట శుభవార్త అంటూ సోషల్ మీడియాలో, టాలీవుడ్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అక్కినేని ఫ్యామిలీలోకి వారసుడు రాబోతున్నాడన్న టాక్ తెగ వైరల్ అయ్యింది. ఈమధ్య కాలంలోనే నాగచైతన్య శోభితకు, అఖిల్, జైనాబ్ కు పెళ్లయ్యింది. కాగా ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి వారసుడిని ఈ ఇద్దరు హీరోలలో ఒకరు ఇవ్వబోతున్నట్టు సమాచారం. శోభిత ప్రెగ్నెంట్ అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. నాగచైతన్య తండ్రి కాబోతున్నటాడంటూ.. గుసగుసలు వినిపించాయి. అయితే అందులో నిజం లేదని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉండే శోభిత ఈ విషయం దాచడం కష్టమనే చెప్పాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అఖిల్ అక్కినేని తండ్రి కాబోతున్నాడా?
Image Credit : @AkhilAkkineni

అఖిల్ అక్కినేని తండ్రి కాబోతున్నాడా?

అక్కినేని అఖిల్ ఈ ఏడాది జూన్ నెలలో జైనబ్‌తో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వయస్సులో జైనబ్ అఖిల్ కంటే పెద్ద. అయినా సరే వారి ఇద్దరి మనసులు కలవడం, ఇరు కుటుంబాల అంగీకారం లభించడంతో ఈ వివాహం జరిగింది. ఈ పెళ్లి తర్వాత అక్కినేని కుటుంబం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈక్రమంలోనే సోషల్ మీడియాలో అక్కినేని నాగ చైతన్య, అఖిల్‌లకు సంబంధించిన పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. నాగచైతన్య తండ్రి కాబోతున్నాడని కొన్ని రోజులు వార్తలు హల్ చేయగా.. ఇప్పుడు చైతూ కాదు.. ఆయనకంటే ముందు అఖిల్ తండ్రి కాబోతున్నాడన్న వార్త వినిపిస్తోంది. ఈ విషమంపై తాజాగా స్పందించారు కింగ్ నాగార్జున.

Related Articles

Related image1
చిరంజీవి కాదు.. బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే గెస్ట్ ఎవరో తెలుసా? పాన్ ఇండియా అభిమానులకు పండగే?
Related image2
800 కోట్లతో బాలీవుడ్ లో దుమ్మురేపిన తెలుగు సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ?
35
నాగార్జున ఏమన్నారంటే?
Image Credit : Asianet News

నాగార్జున ఏమన్నారంటే?

అక్కినేని కోడళ్లు ప్రెగ్నెంట్స్ అయ్యారు అనే వార్త బయటకురాగానే క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఈక్రమంలో నాగార్జున ఓ హెల్త్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయన మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా ఒక లేడీ రిపోర్టర్, “మీరు త్వరలోనే తండ్రి నుంచి తాతగా ప్రమోట్ అవ్వబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉంది?” అని ప్రశ్నించారు. దీనికి నాగార్జున చిరునవ్వుతో స్పందిస్తూ, “సరైన సమయం వచ్చినప్పుడు నేనే అధికారికంగా చెప్తాను” అని నవ్వుతూ వెళ్లిపోయారు. ఈవార్తలను ఆయన ఖండించలేదు. దాంతో ఏదో ఉంది అన్న అనుమానం మాత్రం అభిమానుల్లో కలిగింది.

45
అక్కినేని కుటుంబంలో త్వరలో శుభవార్త ?
Image Credit : instagram/@sobhitad

అక్కినేని కుటుంబంలో త్వరలో శుభవార్త ?

ఈవిషయంపై ఇండస్ట్రీలో, సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది. అక్కినేని కుటుంబంలో త్వరలో శుభవార్త ఉండొచ్చన్న ఊహాగానాలు మరింత బలపడ్డాయి. ముందుగా నాగ చైతన్య, శోభిత జంట త్వరలోనే ఒక బిడ్డకు తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో షికారు కొట్టాయి.. ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని తెలియగానే.. అందరి చూపు అఖిల్ వైపు మళ్లింది. నాగార్జున సరైన టైమ్ లో అనౌన్స్ చేస్తాము అన్నది అఖిల్ గురించేనే అని అంతా గుసగుసలాడుకుంటున్నారు.

55
అఖిల్ కు అదృష్టం కలిసొస్తుందా?
Image Credit : @AkhilAkkineni

అఖిల్ కు అదృష్టం కలిసొస్తుందా?

ఈ నేపథ్యంలో శోభిత కాకపోతే జైనబ్ ప్రెగ్నెంట్ అయ్యి ఉండొచ్చని కొందరు అభిమానులు సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. అయితే దీనిపై అక్కినేని కుటుంబం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇక సినిమాల విషయానికి వస్తే.. అక్కినేని అఖిల్ ప్రస్తుతం ‘లెనిన్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఏళ్లు గడుస్తున్నా.. ఇంత వరకూ సాలిడ్ హిట్ కొట్టలేదు అఖిల్.. సరైన కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోవడం అఖిల్ అభిమానుల్లో అసంతృప్తిని కలిగిస్తోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఆయన గత చిత్రం ‘ఏజెంట్’ కూడా కమర్షియల్‌గా భారీ డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ‘లెనిన్’ సినిమాతో అయినా హిట్ కొట్టి.. సాధిస్తాడేమో చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అక్కినేని నాగార్జున
నాగ చైతన్య
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
చిరంజీవి కాదు.. బిగ్ బాస్ తెలుగు 9 గ్రాండ్ ఫినాలే గెస్ట్ ఎవరో తెలుసా? పాన్ ఇండియా అభిమానులకు పండగే?
Recommended image2
800 కోట్లతో బాలీవుడ్ లో దుమ్మురేపిన తెలుగు సినిమా, అత్యధిక వసూళ్లు సాధించిన టాప్ 10 మూవీస్ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved