- Home
- Entertainment
- First Finalist: బిగ్ బాస్ తెలుగు 9 ఫస్ట్ ఫైనలిస్ట్ కన్ఫమ్.. తనూజ చేసిన మోసానికి రీతూ బలి
First Finalist: బిగ్ బాస్ తెలుగు 9 ఫస్ట్ ఫైనలిస్ట్ కన్ఫమ్.. తనూజ చేసిన మోసానికి రీతూ బలి
బిగ్ బాస్ తెలుగు 9 టికెట్ టూ ఫినాలేకి సంబంధించిన టాస్క్ లు జరుగుతున్నాయి. ఇందులో ఈ సీజన్ ఫస్ట్ ఫైనలిస్ట్ కన్ఫమ్ అయ్యిందట. తనూజ చేసిన మోసానికి రీతూ బలయ్యిందని సమాచారం.

రసవత్తరంగా బిగ్ బాస్ టికెట్ టూ ఫినాలే టాస్క్ లు
బిగ్ బాస్ తెలుగు 9 హౌజ్‌లో టికెట్ టూ ఫినాలే చివరి దశకు చేరుకుంది. ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ ని కన్ఫమ్ చేసే టాస్క్ లు జరుగుతున్నాయి. ఇమ్మాన్యుయెల్, రీతూ చౌదరీ, కళ్యాణ్ టికెట్ టూ ఫినాలే పోటీలో ఉన్నారు. వీరి మధ్య అసలైన పోటీ జరుగుతుంది. దీంతో బిగ్ బాస్ షో రసవత్తరంగా మారుతోంది. అదే సమయంలో కంటెస్టెంట్ల అసలు రూపాలు బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు మాస్క్ లతో మెయింటేన్ చేసిన వారు, బాండింగ్‌లతో డ్రామాలు ఆడిన వారంతా ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. బాండింగ్‌లు బ్రేక్ చేస్తున్నారు.
రీతూ, ఇమ్మాన్యుయెల్, కళ్యాణ్ ల మధ్య పోటీ
ఈ నేపథ్యంలో టికెట్ టూ ఫినాలేకి సంబంధించి చివరికి ముగ్గురు కంటెస్టెంట్లు మిగిలారు. రీతూ, కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్‌కి మధ్య టాస్క్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ ముగ్గురికి మధ్య బ్లాక్స్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో పవన్, తనూజ, సుమన్ శెట్టి, భరణి తమకు నచ్చిన వారికి సపోర్ట్ చేస్తున్నారు. అదే సమయంలో ఓడిపోవాలనుకునే వారి టవర్స్ ని కూలకొడుతున్నారు. ఇందులో తనూజ చేసిన మోసాన్ని రీతూ తట్టుకోలేకపోయింది.
తనూజ మోసంపై రీతూ ఫైర్
ఈ టాస్క్ లో తనూజ కళ్యాణ్‌కి సపోర్ట్ చేసింది. రీతూని టార్గ్ చేసింది. పవన్.. కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్ టవర్లని టార్గెట్ చేయగా, కళ్యాణ్‌ని టార్గెట్ చేసిన వారిని తాను టార్గెట్ చేస్తా అంటూ రీతూ టవర్స్ కూల్చే ప్రయత్నం చేసింది తనూజ. దీంతో రీతూ తట్టుకోలేపోయింది. గతంలో రీతూకి తనూజ సపోర్ట్ చేసింది. హెల్ప్ చేస్తానని పలు మార్లు చెప్పింది. కానీ ఈ టాస్క్ లో మాత్రం రీతూ ఓడిపోయేందుకు ఆమె ప్రయత్నం చేయడంతో రీతూ తట్టుకోలేక గోల చేసింది. ఫైర్ అయ్యింది. మరోవైపు తనకు సపోర్ట్ చేసిన పవన్.. ఓ దశలో డిస్ క్వాలిఫై అయ్యాడు. దీంతో తనకు సపోర్ట్ చేసేవారు లేరని వాపోయింది, ఇది ఎమోషనల్‌గా చూపించారు బిగ్ బాస్. తాజాగా విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది.
బిగ్ బాస్ ఫస్ట్ ఫైనలిస్ట్
ఇదిలా ఉంటే ఈ టాస్క్ లో కళ్యాణ్ గెలిచినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత రీతూ, ఇమ్మాన్యుయెల్ మధ్య టాస్క్ జరగ్గా ఇమ్మాన్యుయెల్ ఓడిపోయారని, అందులో గెలిచిన రీతూతో కళ్యాణ్ తలపడగా, కళ్యాణ్ గెలిచినట్టు తెలుస్తోంది. మొత్తంగా టికెట్ టూ ఫినాలే కళ్యాణ్ గెలిచారని సమాచారం. ఈ లెక్కన ఆయన ఈ సీజన్ మొదటి ఫైనలిస్ట్ అయ్యారని తెలుస్తోంది. మొత్తంగా బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ టాప్ 5లో కళ్యాణ్ స్థానం సంపాదించారని, ఆయనకు తిరుగులేదని తెలుస్తోంది. అంతేకాదు ఆయనకు ఈ సీజన్ విన్నింగ్ ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు.
ఈ వారం నామినేషన్‌లో ఉన్నది వీరే
ఇదిలా ఉంటే ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో 13వ వారం సాగుతుంది. ఈ వారం నామినేషన్‌లో తనూజ, రీతూ చౌదరీ, భరణి, సంజనా, డీమాన్ పవన్, సుమన్ శెట్టి ఉన్నారు. లేటెస్ట్ ఓటింగ్ ప్రచారం వీరిలో తనూజ, రీతూ, భరణి సేఫ్‌లో ఉన్నారని, సుమన్ శెట్టి, డీమాన్ పవన్, సంజనా డేంజర్లో ఉన్నట్టు సమాచారం. ఈ ముగ్గురిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

