- Home
- Entertainment
- Rajamouli కి పోటీగా.. 1000 కోట్లతో శంకర్ సినిమా, ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? హీరో ఎవరు?
Rajamouli కి పోటీగా.. 1000 కోట్లతో శంకర్ సినిమా, ఎప్పుడు స్టార్ట్ కాబోతోంది? హీరో ఎవరు?
రాజమౌళి 1000 కోట్లకు పైగా బడ్జెట్ తో వారణాసి మూవీ తెరకెక్కిస్తుండగా.. దానికి పోటీగా సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ మరో ప్రాజెక్ట్ ను స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ శంకర్ తెరకెక్కించబోయే 1000 కోట్ల సినిమా ఏది?

డైరెక్టర్ శంకర్ 1000 కోట్ల సినిమా
కోలీవుడ్ నుంచి సూపర్ హిట్ సినిమాలను అందించిన దర్శకుడు శంకర్. ఈమధ్య కాలంలో హిట్ కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. శంకర్ సినిమాలలో బ్లాక్ బస్టర్స్ చాలా ఉన్నాయి. కానీ 2018 తర్వాత శంకర్ ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో, తన కలల ప్రాజెక్ట్‌తో మళ్లీ అభిమానులను పలకరించేందుకు శంకర్ సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ప్రకటించిన ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ వారణాసికి సమానమైన బడ్జెట్‌తో.. ఇండస్ట్రీలో హిస్టరీ క్రియేట్ చేయడం కోసం శంకర్ రెడీ అవుతున్నాడు.
వీరయుగ నాయగన్ వేల్పారి నవల ఆధారంగా
'వేల్పారి' టైటిల్ తో తెరకెక్కబోయే ఈసినిమాను సు. వెంకటేశన్ రాసిన 'వీరయుగ నాయగన్ వేల్పారి' అనే ప్రసిద్ధ చారిత్రక నవల ఆధారంగా రూపొందుతోంది. తమిళ సంఘం సాహిత్యంలో మూలాలున్న ఈ కథను ప్రపంచస్థాయిలో ప్రేక్షకులకు అందించాలన్నది శంకర్ లక్ష్యం. సినిమా స్క్రిప్ట్ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. పారి అనే నాయకుడి చుట్టూ మూడు భాగాలుగా శంకర్ సినిమాను తీయనున్నారు. ముల్లై ప్రాంతానికి రాజుగా ఉన్న పారి, చేర, చోళ, పాండ్య సామ్రాజ్యాలకు వ్యతిరేకంగా పెద్ద యుద్ధాలు చేశాడు.
గేమ్ ఆఫ్ థ్రోన్స్' ... అవతార్ లాగా
'రోబోనే నా డ్రీమ్ ప్రాజెక్ట్ అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా కాదు. వేల్పారి సినిమానే నన్ను ఇప్పుడు బాగా ఉత్తేజపరుస్తోంది. అది 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లేదా 'అవతార్' లాగా ప్రపంచస్థాయి సినిమా అవుతుంది' అని శంకర్ ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు అక్కడే ఉన్న రజినీకాంత్ కూడా శంకర్ కొత్త ప్రయత్నానికి శుభాకాంక్షలు తెలిపారు. ఇండియన్ 3 సినిమా పూర్తయ్యాక, 2026 జూన్‌లో వేల్పారి సినిమా షూటింగ్ శంకర్ మొదలుపెడతారని అంచనా. సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.
ప్రధాన పాత్రల్లో స్టార్స్..
ఇందులో నటించేవారు ఎవరు అన్న విషయంలో అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. త్వరలో చేసే అవకాశం ఉంది. కానీ, సూర్య, విక్రమ్‌లను శంకర్ ప్రధానంగా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇంకా, బాలీవుడ్ నుంచి ఓ సూపర్‌స్టార్ కూడా పరిశీలనలో ఉన్నారు. అది షారుఖ్ ఖాన్ లేదా రణ్‌వీర్ సింగ్ కావొచ్చని అంటున్నారు. ఎస్.ఎస్.రాజమౌళి వారణాసి ప్రాజెక్ట్ బడ్జెట్ లాగే, వేల్పారి సినిమా బడ్జెట్ కూడా 1000 కోట్ల రూపాయలని తెలుస్తోంది. సినిమా నిర్మాణంలో ధర్మ ప్రొడక్షన్స్, నెట్‌ఫ్లిక్స్ సంస్థలకు కూడా భాగస్వామ్యం ఉంటుందని అంటున్నారు. ఏదేమైనా, ఇటీవలి పరాజయాలతో తనను విమర్శించిన వారికి గట్టి సమాధానం ఇవ్వడమే శంకర్ లక్ష్యంగా కనిపిస్తోంది.

