- Home
- Entertainment
- Mirchi Madhavi: ఐదుగురితో కాంప్రమైజ్ అయితే ప్రకాష్ రాజ్ భార్యగా ఛాన్స్, నీ సంగతి తెలుసులే అన్నారు
Mirchi Madhavi: ఐదుగురితో కాంప్రమైజ్ అయితే ప్రకాష్ రాజ్ భార్యగా ఛాన్స్, నీ సంగతి తెలుసులే అన్నారు
నటి మిర్చి మాధవి టాలీవుడ్ లో తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలని పంచుకున్నారు. ప్రకాష్ రాజ్ భార్య పాత్రలో నటించే అవకాశం ఉందని ఓ వ్యక్తి ఫోన్ చేసి తనతో అసభ్యంగా మాట్లాడినట్లు మాధవి పేర్కొన్నారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

నటి మిర్చి మాధవి
టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణించే నటీమణులు చాలా మంది ఉన్నారు. నటి మిర్చి మాధవి చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి నటిగా తనకంటూ గుర్తింపు సొంతం చేసుకున్నారు. ఎన్నో చిత్రాల్లో ఆమె పోషించిన పాత్రలు ఉన్నాయి. అయితే బలమైన క్యారెక్టర్స్ లో ఆమెకి ఇంకా అవకాశం రాలేదు. బుల్లితెరపై కూడా రాణిస్తున్నారు. ప్రభాస్ మిర్చి మూవీలో నటించడంతో మిర్చి మాధవి అనే గుర్తింపు దక్కింది. రీసెంట్ గా ఇంటర్వ్యూలో మిర్చి మాధవి మాట్లాడుతూ టాలీవుడ్ లో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఐదుగురితో కాంప్రమైజ్ కావాలి
మిర్చి మాధవి మాట్లాడుతూ.. ఒకతను నాకు ఫోన్ చేసి ఓ సినిమాలో ప్రకాష్ రాజ్ భార్యగా పాత్ర ఉంది. ఆ పాత్రని నీకే ఇవ్వాలని అనుకుంటున్నాం. కాకపోతే ఐదుగురితో కాంప్రమైజ్ కావాల్సి ఉంటుంది అని అడిగారు. కాంప్రమైజ్ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు అని అడిగా. మీరు 100 పర్సెంట్ లవ్ మూవీ లో నటించారు. మీరు ఎలాంటివారో మాకు తెలుసు. మీ సంగతి నాకు తెలుసు అని అన్నాడు.
అలాంటి పనులు చేసేదాన్ని అయితే సినిమాల్లోకి రాను
సరే అయితే వాళ్ళతోనే చెప్పించండి. సుకుమార్ గారు బంగారంలా చూసుకున్నారు. అలాంటి పనులు చేసేదాన్ని అయితే సినిమాల్లోకి వచేదాన్ని కాదు. మీ ఆఫర్ నాకు అవసరం లేదు అని చెప్పా. దీనితో అతడు చూసుకోండి మరి.. ఇది మంచి ఆఫర్ అని అన్నాడు. నాకు అవసరం లేదు అని ఫోన్ కట్ చేసినట్లు మాధవి పేర్కొన్నారు.
అన్ని రంగాల్లో ఉంది
అయితే కాస్టింగ్ కౌచ్ అనేది సినీ ఇండస్ట్రీలో మాత్రమే కాదు, అన్ని రంగాల్లో ఉంది. కాకపోతే సినీ ఇండస్ట్రీ గురించి ఎక్కువగా అందరికీ తెలుస్తూ ఉంటుంది. నేను ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేస్తున్న కొత్తల్లో.. ఒకతను నేను కొత్త డైరెక్టర్ ని.. ఒక సినిమా చేస్తున్నా. అందులో క్యారెక్టర్ ఉంది. నాకు ఆఫీస్ లేదు. కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కలవొచ్చా అని ఫోన్ చేసి అడిగారు. ఆ డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు. ఇండస్ట్రీలో ఒక పాత్ర కోసం ఎలా ఎంపిక చేస్తారు అనే అవగాహన కూడా ఆ సమయంలో నాకు లేదు.
ఇంటికి వచ్చి మరీ అసభ్యంగా..
దీనితో సరే రండి అని మా ఇంటికి అతడిని పిలిచా. ఆ సమయంలో నేను పంజాబీ డ్రెస్ వేసుకుని ఉన్నా. ఇంట్లో మా అమ్మ, పని అమ్మాయి, నేను మాత్రమే ఉన్నాం. నా భర్త వేరే ఊరు వెళ్లారు. ఆ డైరెక్టర్ నన్ను చూసి ఒకసారి నడిచి చూపించండి అని అడిగారు. సరే అని నడిచాను. వెళ్లి చీర కట్టుకుని రండి అని చెప్పారు. చీర కట్టుకుని వచ్చాను. నడుము చూపించండి అని అడిగాడు. నాకు విపరీతమైన కోపం వచ్చింది. వెంటనే ఇంట్లో నుంచి వెళ్ళిపోరా.. లేకుంటే చెప్పుతో కొడతా అని వార్నింగ్ ఇచ్చా. ఇలా మాధవి తనకి ఎదురైన చేదు అనుభవాలని పంచుకున్నారు.

