2025 Google లో ఎక్కువగా సెర్చ్ చేసిన 10 ఇండియన్ సినిమాలు
2025లో ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు విడుదలయ్యాయి. అందులో కొన్నింటి కోసం ఆడియన్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించారు. ఇక 2025 లో గూగుల్ ఇండియాలో ఎక్కువగా సెర్చ్ చేసిన 10 సినిమాలు ఏంటో తెలుసా?

కాంతార: ది లెజెండ్ చాప్టర్ 1
రిషబ్ శెట్టి దర్శకత్వంలో, ఆయన హీరోగా వచ్చిన ఈ కన్నడ సినిమా అక్టోబర్ 2, 2025న రిలీజైంది. ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా 852.06 కోట్లు వసూలు చేసింది. గుగుల్ లో ఈ సినిమా గురించి కూడా ఎక్కువగా జనాలు సెర్చ్ చేశారు.
సైయారా
మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూలై 18, 2025న రిలీజైంది. ఈ మ్యూజికల్ రొమాంటిక్ డ్రామాతో అహాన్ పాండే, అనీత్ పడ్డా హీరోహీరోయిన్లుగా నటించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా 570.33 కోట్లు వసూలు చేసింది. గూగుల్ సెర్చ్ లో ఈసినిమా దూసుకుపోయింది.
కూలీ
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ తమిళ సినిమా ఆగస్టు 14, 2025న రిలీజైంది. రజనీకాంత్ హీరోగా నటించగా, నాగార్జున, సౌబిన్ షాహిర్ కూడా ఇందులో నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 518 కోట్లు వసూలు చేసింది.
వార్ 2
2019 బ్లాక్‌బస్టర్ 'వార్'కి ఇది సీక్వెల్. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో 'వార్ 2' ఆగస్టు 14, 2025న రిలీజైంది. హృతిక్, జూ.ఎన్టీఆర్, కియారా నటించిన ఈ ఫ్లాప్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.364.35 కోట్లు వసూలు చేసింది. ఎక్కువ మంది గూగుల్ లో సెర్చ్ చేసిన సినిమాల్లో ఇది కూడా ఉంది.
సనమ్ తేరీ కసమ్
రాధికా రావు, వినయ్ సప్రూ దర్శకత్వంలో ఈ సినిమా 2016లో మొదటిసారి రిలీజైంది. ఫిబ్రవరి 7, 2025న మళ్లీ విడుదలైంది. హర్షవర్ధన్ రాణే, మావ్రా హోకేన్ నటించిన ఈ సినిమా 50 కోట్లకు పైగా వసూలు చేసింది.
మార్కో
హనీఫ్ అదేని దర్శకత్వంలో వచ్చిన ఈ సూపర్‌హిట్ మలయాళ సినిమాలో ఉన్ని ముకుందన్ హీరో. డిసెంబర్ 20, 2024న రిలీజైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.102 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈసినిమా కోసం కూడా
హౌస్‌ఫుల్5
హౌస్‌ఫుల్ ఫ్రాంచైజీలో ఇది ఐదో సినిమా. తరుణ్ మన్‌సుఖానీ దర్శకుడు. జూన్ 6, 2025న రిలీజైన ఈ యావరేజ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.288.67 కోట్లు వసూలు చేసింది. అక్షయ్ కుమార్ ఇందులో హీరోగా నటించారు.
గేమ్ ఛేంజర్
ఎస్. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ తెలుగు యాక్షన్ థ్రిల్లర్‌లో రామ్ చరణ్ హీరో. జనవరి 10, 2025న రిలీజైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 186.28 కోట్లు వసూలు చేసింది. కానీ గూగుల్ లో ఈ సినిమాను ఎక్కువ మంది సెర్చ్ చేశారు.
మిసెస్
ఈ డ్రామా సినిమా ఫిబ్రవరి 7, 2025న నేరుగా జీ5 ఓటీటీలో విడుదలైంది. ఆర్తీ కాదవ్ దర్శకత్వం వహించారు. సాన్యా మల్హోత్రా, నిషాత్ దహియా, కన్వల్జీత్ సింగ్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు.
10. మహావతార్ నరసింహ
అశ్విన్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈసినిమా ఒక యానిమేటెడ్ ఎపిక్ డ్రామా. విష్ణువు నరసింహ అవతారం కథతో వచ్చిన ఈ సినిమా జూలై 25, 2025న రిలీజైంది. ప్రపంచవ్యాప్తంగా 326.82 కోట్లు వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈసినిమా పాన్ ఇండియా ఆడియన్స్ ను ఆకర్శించడంతో పాటు గూగుల్ లో ఎక్కువగా సెర్చ్ అయ్యింది.

