- Home
- Entertainment
- Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
Pawan Kalyan తో నటించి కనిపించకుండా పోయిన హీరోయిన్లు, లిస్ట్ లో ఐదుగురు.. ఆమె మాత్రం చేజేతులా..
పవన్ కళ్యాణ్ తో నటించిన ఐదుగురు హీరోయిన్లు టాలీవుడ్ లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయారు. వాళ్లంతా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ హీరోయిన్ల వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

పవన్ తో నటించి కనుమరుగైన హీరోయిన్లు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు రాజకీయాలు, ఇటు సినిమాల్లో రాణిస్తున్నారు. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ నుంచి హరి హర వీరమల్లు, ఓజీ రెండు చిత్రాలు విడుదలయ్యాయి. ఓజీ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. హరిహర వీరమల్లు డిజాస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తో చాలా మంది హీరోయిన్ నటించారు. వారిలో కొంతమంది హీరోయిన్ కనిపించకుండా పోయారు. ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
నేహా ఒబెరాయ్
బాలు చిత్రంలో నేహా ఒబెరాయ్ నటించింది. బాలు చిత్రం నిరాశ పరిచింది. ఈమె నిర్మాత ధరమ్ ఒబెరాయ్ కుమార్తె. బాలు తర్వాత బ్రహ్మాస్త్రం అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత టాలీవుడ్ లో ఆమె కనిపించలేదు.
ఇలియానా
ఇలియానా పవన్ కళ్యాణ్ తో జల్సా చిత్రంతో నటించింది. ఆ సమయంలో ఇలియానా కెరీర్ పీక్ లో ఉంది. జల్సా తర్వాత జులాయి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇలియానాకి పడింది. అయినప్పటికీ ఆమె టాలీవుడ్ లో మరికొంత కాలం కొనసాగకుండా చేజేతులా కెరీర్ నాశనం చేసుకుంది. బాలీవుడ్ కి వెళ్లడంతో అక్కడ ఆమెకి సరైన ఆఫర్స్ రాలేదు.
సారా జేన్
డయాస్ సారా జేన్ పవన్ తో పంజా చిత్రంలో నటించింది. పంజా మూవీ డిజాస్టర్ కావడంతో ఆమెకి అవకాశాలు రాలేదు. దీనితో సారా జేన్ టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది.
నికీషా పటేల్
నికీషా పటేల్ కొమరం పులి చిత్రంలో పవన్ తో రొమాన్స్ చేసింది. కొమరం పులి డిజాస్టర్ కావడంతో నికీషాకి కూడా సరైన ఆఫర్స్ రాలేదు. దీనితో ఆమె నెమ్మదిగా ఇండస్ట్రీకి దూరమవుతూ వచ్చింది.
కృతి కర్బంద
తీన్మార్ మూవీలో కృతి కర్బంద హోమ్లీ లుక్ లో అదరగొట్టింది. పవన్, కృతి మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. కానీ సినిమా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో కృతి నటించినప్పటికీ సరైన విజయం దక్కలేదు. ఈమె కూడా టాలీవుడ్ కి దూరమైంది.

