బిగ్ బాస్ తెలుగు 8 విన్నర్ అతనే? గౌతమ్ కి పెద్ద ఝలక్, తెరవెనుక నిజాలు బయటపెట్టిన మాజీ రన్నరప్
బిగ్ బాగ్ తెలుగు 8 విన్నర్ ఎవరు ? మాజీ రన్నరప్ షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. బిగ్ బాస్ తెరవెనుక జరుగుతున్న నిజాలు బయటపెట్టాడు.
బిగ్ బాస్ తెలుగు 8 షో ఎండింగ్‌కి చేరుకుంది. మరో వారంతో షో క్లోజ్ కాబోతుంది. ఈ వారం ఇప్పటికే రోహిణి ఎలిమినేట్ అయ్యింది. ఈ రోజు ఆదివారం కూడా మరో ఎలిమినేషన్ ఉండే అవకాశం ఉంది. విష్ణు ప్రియా, నబీల్, ప్రేరణలో ఒకరు ఎలిమినేట్ కాబోతున్నారని సమాచారం. దీంతో టాప్ 5 కంటెస్టెంట్లు మిగులుతారు.
ఇప్పటికే అవినాష్ ఫైనలిస్ట్ అయ్యారు. వారితోపాటు గౌతమ్, నిఖిల్ సేఫ్‌లోనే ఉన్నారు. వీరిద్దరు టాప్ 5లో చోటు సంపాదించినట్టే లెక్క. వీరితోపాటు విష్ణు ప్రియా, నబీల్, ప్రేరణలో ఇద్దరు టాప్ లోకి వెళ్తారు. అది ఎవరు అనేది ఈ రోజు ఎపిసోడ్‌లో తేలనుంది. ఈ నేపథ్యంలో అసలైన ఆట ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. ఈ వారం గేమ్ మరింత రసవత్తరంగా ఉండబోతుంది.
అయితే ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది చర్చ ప్రధానంగా నడుస్తుంది. చాలా మంది సెలబ్రిటీలు తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. అదే సమయంలో మాజీ కంటెస్టెంట్లు కూడా తమ ఒపీనియన్ తెలియజేస్తున్నారు. విన్నర్ అతనే అనే ప్రిడిక్షన్ చెబుతున్నారు. తమ ఫేవరేట్ ఆటగాడు ఇతనే అంటూ చెబుతున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ రన్నరప్ అఖిల్ సార్థక్ స్పందించారు. తన అభిప్రాయం ప్రకారం విన్నర్ ఎవరో తెలిపారు.
తనకు గౌతమ్ అంటే ఇష్టమని తెలిపారు అఖిల్. ఆయన విన్నర్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. గౌతమ్‌కి విన్నర్ అయ్యే అవకాశాలున్నాయన్నారు. ఈ సారి షో బాగుందని, గౌతమ్‌కే టైటిల్ దక్కే ఛాన్స్ ఉందని ఆయన తెలిపారు. కానీ ఇంతలోనే మరో ట్విస్ట్ ఇచ్చారు. తన అంచనా ప్రకారం గౌతమ్ విన్నర్ అని చెప్పిన అఖిల్.. కానీ నిఖిల్‌ని విన్నర్ ని చేయబోతున్నారనే బిగ్ సీక్రెట్‌ని బయటపెట్టాడు.
గౌతమ్ వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చారు. ఓ దశలో మణికంఠ స్థానంలో ఆయన ఎలిమినేట్ కూడా కావాల్సింది. కానీ మణికంఠ వెళ్లిపోవడంతో సేవ్ అయ్యాడు. అప్పట్నుంచి తన ఆట తీరు మార్చుకున్నారు. ఫైరింగ్ మూడ్‌లోకి వచ్చాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్లని టార్గెట్ చేస్తూ గేమ్ ఆడుతూ వచ్చాడు. అనూహ్యంగా టాప్‌లోకి వచ్చాడు గౌతమ్.
అంతేకాదు టైటిల్ రేస్‌లోకి వచ్చాడు. ఈ క్రమంలో ఇప్పుడు చాలా వరకు గౌతమ్ విన్నర్ అవుతాడని భావించారు. అఖిల్ కూడా అదే చెప్పారు. కానీ బిగ్ బాస్ షో వెనుక, జరిగే నిజాలను బయటపెట్టారు. విన్నర్ ఆల్‌రెడీ డిసైడ్ అయ్యాడని, నిఖిల్ ని విన్నర్‌ని చేయబోతున్నారని అఖిల్ తెలిపారు.
షోకి సంబంధించి అతిపెద్ద రహస్యాన్ని బయటపెట్టాడు. ఆయన మాటలు చూస్తుంటే ఇదంతా స్క్రిప్ట్ అని, విన్నర్ ముందే తెలిసిపోయాడని, మిగిలినదంతా డ్రామానే అని అఖిల్ మాటలను బట్టి అర్థమవుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. నిఖిల్, గౌతమ్‌లో విన్నర్ ఎవరు? ఈ వారంలో షో ఎలాంటి మలుపులు తిరుగుతుంది అనేది చూడాలి. నిజంగానే నిఖిల్ ని విన్నర్‌ని చేస్తే షోపై తీవ్ర విమర్శలు ఫేస్ చేయాల్సి రావడంలో అతిశయోక్తి లేదు.
read more: జస్ట్ కమెడియన్, దేనికీ పనికిరావు అంటూ హేళన.. రోహిణి అసలు రేంజ్ ఇది, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా
also read: వసుంధరతో బాలకృష్ణ పెళ్లి వేళ, ఎన్టీఆర్ ఉక్కిరి బిక్కిరి ఎందుకో తెలుసా? మ్యారేజ్‌లో ఇదే స్పెషల్