జస్ట్ కమెడియన్, దేనికీ పనికిరావు అంటూ హేళన.. రోహిణి అసలు రేంజ్ ఇది, రెమ్యునరేషన్ ఎంతో తెలుసా
బిగ్ బాస్ తెలుగు సీజన్ సీజన్ 8 చివరి దశకి చేరుకుంది. ఇక గేమ్ వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీ. నితో ఈ వారం హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ చేస్తున్నారు. ఆల్రెడీ శనివారం రోజు రోహిణి ఎలిమినేట్ అయింది.
బిగ్ బాస్ తెలుగు సీజన్ సీజన్ 8 చివరి దశకి చేరుకుంది. ఇక గేమ్ వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీ. నితో ఈ వారం హౌస్ లో డబుల్ ఎలిమినేషన్ చేస్తున్నారు. ఆల్రెడీ శనివారం రోజు రోహిణి ఎలిమినేట్ అయింది. ఆదివారం ఎపిసోడ్ లో విష్ణుప్రియ ఎలిమినేట్ అవుతుంది అని అంటున్నారు. రోహిణి ఎలిమినేషన్ పై సోషల్ మీడియాలో బాగా చర్చ జరుగుతోంది.
రోహిణి సీజన్ 8లో చక్కగా పెర్ఫామ్ చేసింది అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వివాదాల జోలికి ఎక్కువగా వెళ్లకుండా మంచి వినోదం అందించింది అని చెబుతున్నారు. అవినాష్ తో కలసి ఆమె చేసిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. వైల్డ్ కార్డ్స్ వచ్చేవరకు సీజన్ 8 చప్పగా సాగింది. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత కాస్త జోష్ పెరిగింది. ఇందులో ముఖ్య పాత్ర పోషించింది రోహిణి, అవినాష్ అని చెప్పొచ్చు.
గతంలో రోహిణి సీజన్ 3లో పాల్గొంది. ఆ సీజన్ రోహిణికి అంతగా ఉపయోగపడలేదు. కానీ ఈ సీజన్ మాత్రం రోహిణికి గుర్తింపు పరంగా, ఆర్థికంగా బాగా ఉపయోగపడింది. రోహిణి సీజన్ 8లో దాదాపు రెండు నెలలు గడిపింది. వారానికి ఆమె రెమ్యునరేషన్ 2 లక్షలు గా అగ్రిమెంట్ కుదుర్చుకుని హౌస్ లోకి వెళ్ళింది. అంటే రోహిణికి ఈ సీజన్ లో ముట్టింది 16 లక్షల పైనే. విష్ణుప్రియ లాంటి వాళ్ళు రోహిణిని అనరాని మాటలు అన్నారు. నువ్వు కామెడీ చేయడానికి తప్ప దేనికి పనికిరావు అని అవమానించారు.
Jabardasth Rohini
వాళ్లందరికీ తన రేంజ్ ఏంటో రోహిణి చూపించింది. గేమ్ కూడా ఆడగలనని నిరూపించుకుంది. ఎలాంటి నెగిటివిటి లేకుండా బయటకి వచ్చింది. ఈ సీజన్ ద్వారా రోహిణి ఇంకా పాపులారిటీ పెంచుకుంది. ఈ క్రేజ్ ని రోహిణి బయట ఎలా ఉపయోగించుకుంటుందో చూడాలి.