- Home
- Entertainment
- Giribabu-Krishna: కృష్ణ ప్రతి సినిమాల్లో గిరిబాబు ఉండాల్సిందే, ఆ రహస్య బంధం ఏంటో తెలుసా?
Giribabu-Krishna: కృష్ణ ప్రతి సినిమాల్లో గిరిబాబు ఉండాల్సిందే, ఆ రహస్య బంధం ఏంటో తెలుసా?
నటుడు గిరిబాబు.. సూపర్ స్టార్ కృష్ణ నటించే ప్రతి సినిమాలోనూ నటించేవారు. దానికి ఓ కారణం ఉంది. ఆ విషయాలను, వీరి మధ్య రహస్య బంధం గురించి గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

కృష్ణ, గిరిబాబు అనుబంధం
తెలుగు చిత్ర పరిశ్రమలో విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న గిరిబాబు సినీ జీవితంలో ఎన్నో ఆసక్తికరమైన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా సూపర్‌స్టార్ కృష్ణతో ఆయనకు ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. కృష్ణ నటించిన సినిమాల్లోనే కాకుండా, విజయనిర్మల నిర్మించిన చిత్రాల్లోనూ గిరిబాబుకు దాదాపు తప్పనిసరిగా ఓ పాత్ర ఉండేది. దీనికి కారణాలు చూస్తే,
కృష్ణ సినిమాల్లో గిరిబాబు ఎందుకు ఉండేవారు?
అప్పట్లో కృష్ణ నటించిన ప్రతి సినిమాల్లో గిరిబాబు కనిపించేవారు. అదొక సెంటిమెంట్‌గా నడిచేది. దీనిపై ఓ ఇంటర్వ్యూలో గిరిబాబు స్వయంగా వెల్లడించారు. పద్మాలయ స్టూడియోస్‌తో, కృష్ణ కుటుంబంతో తనకు ఎంతోకాలంగా అనుబంధం ఉందని చెప్పారు. కృష్ణ సోదరులు హనుమంతరావు, బంగారు తనను ఎంతో అభిమానించేవారని, సినిమాలకు సంబంధించిన కథలు వినిపించి తన అభిప్రాయాలు కూడా అడిగేవారని గుర్తుచేసుకున్నారు. తాను నటుడిగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా పనిచేయడంతో కథలపై తనకు మంచి అవగాహన ఉండేదని వివరించారు.
150కి పైగా సినిమాల్లో కలిసి నటన..
గిరిబాబు మాట్లాడుతూ సూపర్‌స్టార్ కృష్ణతో తాను దాదాపు 150కి పైగా సినిమాల్లో నటించినట్లు వెల్లడించారు. విజయనిర్మల నిర్మించిన సుమారు 40 సినిమాల్లోనూ తనకు అవకాశాలు వచ్చాయని చెప్పారు. కృష్ణ దర్శకత్వం వహించిన 'సింహాసనం', 'కొడుకు దిద్దిన కాపురం' వంటి చిత్రాల్లోనూ నటించారు.
కృష్ణ నటించిన ప్రతి సినిమాలో గిరిబాబుకు ఏదో ఒక పాత్ర ఉండేలా చూసేవారని ఆయన గుర్తుచేసుకున్నారు. కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఫలానా పాత్రకు గిరిబాబు అయితే బాగుంటుందని కృష్ణ కుటుంబ సభ్యులు భావించేవారని తెలిపారు. ఇది గిరిబాబుపై వారికున్న అభిమానానికి, ఆయన నటనా సామర్థ్యంపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.
గిరిబాబు నటనకు కృష్ణ ఇచ్చిన ప్రశంసలు!
కృష్ణ, గిరిబాబు మధ్య ఉన్న అనుబంధానికి మరో ఆసక్తికరమైన ఉదాహరణ 'దొంగోడు వచ్చాడు' సినిమా. 1987లో విడుదలైన ఈ చిత్రంలో గిరిబాబు విలన్‌గా నటించారు. సినిమా విజయం సాధిస్తుందని ముందుగానే అంచనా వేసిన కృష్ణ.. ఈ సినిమా 14 వారాలు ఆడితే, అందులో నాలుగు వారాలు తన వల్ల, మిగిలిన పది వారాలు గిరిబాబు కామెడీ, నటన వల్లే ఆడుతుందని చెప్పారట. ఒక సూపర్ స్టార్ మరో నటుడి ప్రతిభను ఇంత గొప్పగా గుర్తించడం గిరిబాబు ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.
స్నేహానికి రాజకీయాలు అడ్డుకాలేదు!
కృష్ణ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ గా ఉన్న సమయంలోనూ, గిరిబాబు తెలుగుదేశం పార్టీతో అనుబంధం కొనసాగించిన సందర్భాల్లోనూ వారి వ్యక్తిగత స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు. రాజకీయ అభిప్రాయాలు వేరైనా వ్యక్తిగత అనుబంధాలకు వాటిని అడ్డుగా పెట్టుకోలేదని గిరిబాబు వెల్లడించారు.
మొత్తంగా చూస్తే కృష్ణ, గిరిబాబు కాంబినేషన్ తెలుగు ప్రేక్షకులకు ఎన్నో గుర్తుండిపోయే సినిమాలను అందించింది. ఒకవైపు స్టార్ హీరోగా కృష్ణ, మరోవైపు విలన్‌గా, హాస్యనటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా గిరిబాబు.. ఇద్దరూ కలిసి తెరపై అద్భుతమైన వినోదాన్ని పంచారు.
ఇదిలా ఉంటే సీనియర్ నటుడు గిరిబాబు శనివారం మధ్యాహ్నం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మరణంపై ఇండస్ట్రీ స్పందించి తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు.













