- Home
- Entertainment
- Bigg Boss 10: ఈ వారం ఎలిమినేషన్.. బిగ్ బాస్ 10 హౌజ్ నుంచి లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్
Bigg Boss 10: ఈ వారం ఎలిమినేషన్.. బిగ్ బాస్ 10 హౌజ్ నుంచి లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్
Bigg Boss 10: బిగ్ బాస్ తెలుగు 10 పదో వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారింది. సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ వారం ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనేది చూస్తే, షాకిచ్చే విషయం బయటకు వచ్చింది.

బిగ్ బాస్ తెలుగు 10 ఎలిమినేషన్
బిగ్ బాస్ తెలుగు 10 పదో వారం మరింత ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఫ్యామిలీ వీక్ కావడంతో కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి సందడి చేశారు. దీంతో కంటెస్టెంట్లు ఎమోషనల్ అయ్యారు. ఇక వీకెండ్ కావడంతో ఎలిమినేషన్ అనేది ఆసక్తికరంగా మారింది. మరి ఈ వారం ఎవరు బిగ్ బాస్ హౌజ్ నుంచి ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. పదోవారం వంశీ తప్ప అందరు నామినేషన్లో ఉన్నారు. ముఖేష్, త్రిగుణ్, దేబ్జానీ, వర్షిణి, అమన్, నీతూ నటరాజ్, స్వేత, రామ్ ప్రసాద్, సుధీర్, నరేష్, రామకృష్ణ, శివకుమార్ నామినేషన్లో ఉన్నారు.
స్వేత నాయుడు ఎలిమినేట్
మరి వీరిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో పదో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరో క్లారిటీ వచ్చింది. శ్వేత నాయుడు ఎలిమినేట్ అవుతుందట. దీనికి సంబంధించిన షూటింగ్ ఆల్రెడీ జరిగిందని సమాచారం. పదో వారం మొదటి ఎలిమినేషన్‌గా శ్వేత హౌజ్‌ని వీడుతుందని చెబుతున్నారు. ఆమె మొదట్నుంచి పెద్దగా కంటెంట్ ఇవ్వలేకపోయింది. చాలా విమర్శలు ఫేస్ చేసింది. హౌజ్‌లోనూ యాక్టివ్‌గా కనిపించడం లేదు. ఆటల్లోనూ యాక్టివ్‌గా లేదు. ఈ క్రమంలో ఈ వారం ఆమెని హౌజ్ నుంచి పంపిస్తున్నట్టు సమాచారం. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. అయితే ఈ వారం మొదటి ఎలిమినేషన్ మాత్రం స్వేత నాయుడు అని చర్చ నడుస్తోంది.
పదో వారం డబుల్ ఎలిమినేషన్
ఇదిలా ఉంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌కి ఛాన్స్ ఉందట. గత వారం ఎలిమినేషన్ లేదు. దీంతో ఈ వారం ఇద్దరిని హౌజ్ నుంచి పంపించే ఛాన్స్ ఉందని సమాచారం. మరి మరో ఎలిమినేషన్ ఎవరనేది చూస్తే, లీస్ట్ లో రామకృష్ణ, శివ ఉన్నారు. నీతూ కూడా డేంజర్లోనే ఉంది. అయితే రెండో ఎలిమినేషన్‌గా రామకృష్ణకి ఛాన్స్ ఉందని చెబుతున్నారు. మొత్తంగా ఇప్పటికైతే స్వేత నాయుడు ఎలిమినేట్ అని తెలుస్తోంది. రెండో ఎలిమినేషన్‌కి సంబంధించిన క్లారిటీ రావాల్సి ఉంది.













