- Home
- Entertainment
- Sitara: మహేష్ బాబు, నమ్రతతో సితార ఏ భాషలో మాట్లాడుతుందో తెలుసా? తెలుగు మాట్లాడటం వస్తుందా?
Sitara: మహేష్ బాబు, నమ్రతతో సితార ఏ భాషలో మాట్లాడుతుందో తెలుసా? తెలుగు మాట్లాడటం వస్తుందా?
Sitara: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ల కుమార్తె సితార ఘట్టమనేని ఏదో రకంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇటీవల విడుదలైన ఒక ఇంటర్వ్యూ లో సితార తన కుటుంబంలో ఎవరితో ఏ భాషలో మాట్లాడుతుంది? బంధువులతో గడిపే సమయం గురించి ఏమన్నది.

సితార ఇంట్లో ఏ భాషలో మాట్లాడుతుంది?
సాధారణంగా బయట సితార తెలుగులో మాట్లాడతారని అందరూ అనుకుంటారు. అయితే ఇంటర్వ్యూలో హోస్ట్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, ఇంట్లో మాత్రం తాము ఎక్కువగా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటామని సితార చెప్పారు. అదే సమయంలో తనకు తెలుగు, మరాఠీ భాషలు కూడా వచ్చని స్పష్టం చేశారు. అమ్మమ్మ వైపు బంధువులతో మాట్లాడేటప్పుడు మరాఠీనే ఉపయోగిస్తానని తెలిపారు. హోస్ట్ రిక్వెస్ట్ మేరకు “నాకు పప్పు, అన్నం చాలా ఇష్టం” అనే అర్థం వచ్చేలా మరాఠీలో సరదాగా చెప్పి అందరినీ నవ్వించారు. చిన్న వయసులోనే ఒకటి కంటే ఎక్కువ భాషలపై పట్టు ఉండటం, కుటుంబ సంస్కృతికి అనుగుణంగా భాషలను మార్చుకుంటూ మాట్లాడటం అభిమానులను ఆశ్చర్చపరుస్తోంది.
అమ్మ వైపు బంధువులతో
సితార అమ్మ నమ్రత శిరోద్కర్ వైపు బంధువులతో కలిసి గడిపే క్షణాలను ఎంతో ఆప్యాయంగా గుర్తు చేసుకున్నారు. శిల్పమ్మ, అనుష్క, తన అమ్మతో కలిసి తరచూ రమ్మీ, లూడో వంటి ఆటలు ఆడుకుంటామని చెప్పారు. సితార తన ఫ్యామిలీతో విదేశాలకు వెళ్లినప్పుడు ఎక్కువగా అమ్మ తరపు బంధువులతోనే కనిపిస్తుంటుంది.
నాన్న వైపు కుటుంబంతో గేమ్ నైట్స్
నాన్న మహేశ్ బాబు వైపు బంధువులతో ఎలా సమయం గడుపుతారనే ప్రశ్నకు సితార ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మంజుఅత్త, భారతి అక్క, జాను పాప వంటితో కలిసి తరచూ ‘గేమ్ నైట్స్’ నిర్వహిస్తామని తెలిపారు. నాన్న వైపు బంధువులంతా ప్రియత లేదా మంజత ఇంట్లో కలుసుకుంటారని, అక్కడ కలిసి సినిమాలు చూడటం, రకరకాల ఆటలు ఆడటం దాదాపు ప్రతిసారీ జరుగుతుందని వివరించారు. బిజీ షెడ్యూళ్ల మధ్య కూడా కుటుంబ సభ్యులంతా ఒక రోజు అనుకుని ఆనందంగా గడపుతామని ఆమె వెల్లడించారు.
సొంత ఇమేజ్ సాధించిన సితార..
సితార చిన్నతనం నుంచే చాలా చురుకు. అటు చదువు, ఇటు ఫారెన్ టూర్లు,, మరోవైసు సోషల్ మీడియా పోస్టింగ్ లు.. తీరిక లేకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది సితార. చాలా చిన్న వయస్సులో ఎంతో మంది ఫ్యాన్స్ ను సాధించింది. అంతే కాదు ప్రతీ పండగను సెలబ్రేట్ చేస్తూ.. ఆదర్శంగా నిలుస్తోంది. తండ్రి స్టార్ డమ్ ను అడ్డు పెట్టుకోకుండా.. తనలో టాలెంట్ ను ఎప్పటికప్పుడు నిరూపిస్తోంది స్టార్ కిడ్. యాక్టింగ్, డాన్స్, మోడలింగ్, ఆర్ట్.. టాకింగ్ పవర్ తో పాటు...తనలో ఉన్న మాల్టీ టాలెంట్స్ ను సోషల్ మీడియా వేదికగా చూపిస్తూ.. మెస్మరైజ్ చేస్తోంది. తండ్రిని మించిన తనయ అనిపించుకుంటోంది.











