- Home
- Entertainment
- Amala Akkineni: స్టార్ డైరెక్టర్ ముఖం మీదే తలుపులువేసిన అమల, నాగార్జున వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటంటే?
Amala Akkineni: స్టార్ డైరెక్టర్ ముఖం మీదే తలుపులువేసిన అమల, నాగార్జున వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటంటే?
Amala: ఓ స్టార్ డైరెక్టర్ కథ చెప్పడానికి నాగార్జున ఇంటికి వెళ్తే.. అమల ఆ దర్శకుడి ముఖం మీదే తలుపులు వేసిందట. ఇంతకీ ఆమె ఎందుకలా చేసింది? ఆతరువాత నాగార్జున వేసిన మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? ఏ సినిమా కోసం వెళ్లాడు?

సరదాగా ప్లాన్ చేసిన సినిమా..
టాలీవుడ్లో ఎన్నో కుటుంబ చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. వాటిలో చిన్నారి అఖిల్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘సిసింద్రి’ కూడా ఒకటి. ఈ సినిమా ఆలోచన ఎలా పుట్టింది, పసిబిడ్డతో సినిమా తీయాలన్న ప్రతిపాదనకు అమల, నాగార్జున ఎలా స్పందించారనే విషయాలను ఒక ఇంటర్వ్యూలో అమల, నాగార్జున ఇద్దరు కలిసి చెప్పారు. అసలు ఆ సినిమాలో అంత చిన్న పిల్లాడిని ఎలా మేనేజ్ చేసేరన్న విషయంపై.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను వారు వెల్లడించారు.
డైరెక్టర్ ముఖంపై తలుపులు వేసిన అమల..
అఖిల్ పుట్టిన కొద్ది రోజులకే ‘సిసింద్రి’ కథతో దర్శకుడు శివ నాగేశ్వరరావు ఇంటికి వచ్చారని నాగార్జున గుర్తు చేసుకున్నారు. బెల్ కొట్టగానే అమల డోర్ తీశారట. వెంటనే నాగేశ్వరరావు.. “మీ బాబు డేట్స్ కావాలి, కథ చెబుతాను” అని ఆయన అడగ్గానే.. అసలు ఆ మాటే అమలకు నచ్చలేదట. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా ముఖం మీదే డోర్ వేసేసిందట అమల. అంత చిన్న పసిబిడ్డతో సినిమా ఏమిటన్న సంకోచంతో, ఆయన్ను లోపలికి రానివ్వకుండా తలుపు మూసేసి “వద్దు నాకు” అని పంపించేశానని సరదాగా వివరించారు.
‘బేబీస్ డే అవుట్’ స్ఫూర్తితో మారిన నిర్ణయం
మొదట వద్దనుకున్నా, ఆ తర్వాత ఆ ఆలోచన వెనుక ఉన్న సరదా కోణాన్ని నాగార్జున గమనించారు. హాలీవుడ్లో వచ్చిన ‘బేబీస్ డే అవుట్’ సినిమా తరహాలో దీన్ని తీస్తే సరదాగా ఉంటుందని భావించారు. చిన్న పిల్లాడికి ఏమీ తెలియదు కాబట్టి, ఆటపాటలుగా చిత్రీకరించవచ్చని, అంతా తమ కంట్రోల్లోనే ఉంటుందనే భరోసాతో ఈ ప్రాజెక్ట్ వైపు మొగ్గు చూపినట్లు తెలిపారు.
బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్కు నిధుల ఆలోచన
ఈ సినిమా చేయడానికి మరో ముఖ్యమైన కారణాన్ని కూడా నాగార్జున ప్రస్తావించారు. అప్పట్లోనే అమల ‘బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్’ ఆసుపత్రిని ప్రారంభించారు. దానికి నిధులు సమకూర్చడం కూడా ఈ నిర్ణయానికి ఒక ముఖ్యమైన కారణం. అయితే ఆ బ్లూ క్రాస్ హాస్పిటల్ కు డబ్బులు ఇవ్వడం తన వల్ల కాదని కాదు కానీ, అఖిల్ చేసిన సినిమా ద్వారా వచ్చే ఆదాయంతో ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తే, ఆ ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఆ అబ్బాయికి ఉంటాయన్న ఆలోచన వచ్చిందని నాగార్జున చెప్పారు. ఆ ఉద్దేశంతోనే ఈ చిత్రాన్ని ముందుకు తీసుకెళ్లినట్లు వివరించారు.
ఒక సరదా ప్రయోగం నుంచి ప్రత్యేక గుర్తింపు వరకు
పసిబిడ్డతో సినిమా చేయడమనే సాహసోపేతమైన ఆలోచన మొదట కాస్త ఆలోచించినా.. ఆతర్వాత చాలా జాగ్రత్తగా.. అన్ని సిద్దం చేసుకుని ఎక్కడా ఇబ్బంది లేకుండా షూటింగ్ కంప్లీట్ చేశారు. అఖిల్ ఆ ఏజ్ లో ఏది చేస్తే.. దాన్ని షూట్ చేసి.. సినిమా కథకు మ్యాచ్ అయ్యేలా చేసుకున్నారు. సరదాగా తీసిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది.











