- Home
- Entertainment
- Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
Rohith: సీజన్ 10లో బిగ్గెస్ట్ షాక్, రోహిత్ అవుట్.. ఎలిమినేషన్ కంటే రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోనే బిగ్గెస్ట్ షాకింగ్ ట్విస్ట్ ఆదివారం చోటు చేసుకుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పటికీ బలమైన కంటెస్టెంట్ అయిన రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 10
బిగ్ బాస్ సీజన్ 10లో ఎవ్వరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. హౌస్ లో ఎక్కువ మందితో గొడవలు ఉన్నప్పటికీ, తన యాటిట్యూడ్ తో వార్తల్లో నిలిచినప్పటికీ రోహిత్ బలమైన కంటెస్టెంట్ గా గుర్తింపు పొందాడు. కానీ ఆదివారం రోజు అనూహ్యంగా రోహిత్ ఎలిమినేట్ అయ్యాడు. హౌస్ మేట్స్ ఓటింగ్ ప్రకారం రోహిత్ హౌస్ నుంచి బయటకు వెళ్లకతప్పలేదు.
డేంజర్ జోన్ లో ఉన్న ముగ్గురు
హౌస్ లో ఆర్కే, స్వేత, రోహిత్ ముగ్గురూ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇంటి సభ్యుల ఓటింగ్ ప్రకారం ఒకరు ఎలిమినేట్ అవుతారు అని నాగార్జున తెలిపారు. ఈ ఓటింగ్ ప్రక్రియని నాగార్జున.. నరేష్ తో ప్రారంభించారు. ఎవరైతే హౌస్ లో ఉండకూడదు అని భావిస్తారో వాళ్ళ ఫోటోని బొమ్మకు అంటించి కారణం చెప్పి దానిని బ్రేక్ చేయాలి. నరేష్ రోహిత్ హౌస్ లో ఉండకూడదు అని ఓట్ వేశాడు.
రోహిత్ కి వ్యతిరేకంగా ఓట్లు
రామ్ ప్రసాద్ కూడా రోహిత్ ఉండకూడదు అనే ఓట్ వేశాడు. త్రిగుణ్ కొన్ని విషయాలు చెప్పాడు అని, అది విన్న తర్వాత రోహిత్ లో హౌస్ లో ఉండకూడదు అని తాను డిసైడ్ అయినట్లు రామ్ ప్రసాద్ తెలిపారు. రామ్ ప్రసాద్ అలా చేయడంతో రోహిత్ నమ్మలేకపోయాడు. దేబ్జానీ కూడా రోహిత్ కి వ్యతిరేకంగా ఓట్ వేసింది. ముకేశ్, సుధీర్, నీతూ ఆర్కేకి వ్యతిరేకంగా ఓటింగ్ వేశారు. హౌస్ లో నా వాళ్ళు అనుకున్న వాళ్ళు వాస్తవానికి నా వాళ్ళు కాదు అని అర్థం అయింది అంటూ అమన్ రోహిత్ కి వ్యతిరేకంగా ఓటింగ్ చేశాడు.
కసి తీర్చుకున్న త్రిగుణ్
త్రిగున్ కి శనివారం రోజు బిగ్ బాస్ సీక్రెట్ గా ఒక వీడియో చూపించారు. అది రోహిత్ గురించే. ఆ వీడియోలో తనకు అవకాశం వస్తే త్రిగుణ్ ని నూనె పూసిన కట్టితో కొడతానని కాస్త అసభ్యంగా మాట్లాడాడు. అది విన్న తర్వాత త్రిగుణ్ కి రోహిత్ పై కోపం పెరిగిపోయింది. ఆదివారం రోజు రోహిత్ కి వ్యతిరేకంగా ఓట్ వేస్తూ, తాను చూసిన విషయాన్ని కారణంగా చెబుతూ త్రిగుణ్ తన కసి మొత్తం తీర్చుకున్నాడు.
రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ
మొత్తంగా ఎక్కువ ఓట్లు రోహిత్ కి వ్యతిరేకంగా వచ్చాయి. దీనితో అతడు ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. ఆ తర్వాత రోహిత్ మాట్లాడుతూ తాను ఎలిమినేట్ అయినందుకు బాధగా లేదు.. రామ్ ప్రసాద్ అన్న ఇలా చేయడమే ఎక్కువ బాధ కలిగిస్తోంది అని తెలిపాడు. రోహిత్ ఎలిమినేట్ కావడంతో నీతూ కన్నీళ్లు పెట్టుకుంది. బిగ్ బాస్ సీజన్ 10 అంటే ఊహించనివి జరుగుతాయి. రోహిత్ బలమైన కంటెస్టెంట్ అని ముందు నుంచే చెబుతూనే ఉన్నా. కానీ ఇలా జరుగుతుంది అని తాను కూడా ఊహించలేదు అని నాగార్జున తెలిపారు.





