MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nagarjuna: నాగార్జున ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టను, మాజీ కంటెస్టెంట్ సంచలన కామెంట్స్

Nagarjuna: నాగార్జున ఉంటే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టను, మాజీ కంటెస్టెంట్ సంచలన కామెంట్స్

Nagarjuna: బిగ్ బాస్ హోస్ట్ గా కింగ్ నాగార్జున సక్సెస్ అయ్యారు. హోస్ట్ గా ఎంత సక్సెస్ అయ్యారో..అన్ని విమర్శలు కూడా ఫేస్ చేశారు నాగ్. ఎంతలా అంటే.. ఓ మాజీ కంటెస్టెంట్ మళ్లీ బిగ్ బాస్ కు వెళ్తావా అని అడిగితే.. నాగార్జున ఉంటే వెళ్లను అనేంతలా. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 05 2026, 01:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10
Image Credit : starmaa

త్వరలో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10

తెలుగులో బిగ్ బాస్ ఫుల్ సక్సెస్ అయ్యింది. మధ్యలో కొన్ని సీజన్లు ఇబ్బంది పెట్టినా.. ఆతర్వాత పుంజుకుని.. విజయవంతంగా 10వ సీజన్ లోకి అడుగు పెట్టబోతోంది. గత 9 సీజన్లలో ఎన్టీఆర్ ఫస్ట్ సీజన్ ను హోస్ట్ చేయగా.. రెండో సీజన్ కు హీరో నాని హోస్ట్ గా వ్యవహరించారు. ఇక మూడో సీజన్ నుంచి కింగ్ నాగార్జున వరుసగా ఏడు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించారు. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కు కూడా నాగార్జున హోస్ట్ గా ఉండబోతున్నాడు.రీసెంట్ గా బిగ్ బాస్ 10 కు సబంధించి కమింగ్ సూన్ ప్రోమోను కూడా టీమ్ రిలీజ్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున సక్సెస్ అయ్యాడా?
Image Credit : starmaa

బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జున సక్సెస్ అయ్యాడా?

బిగ్ బాస్ హోస్ట్ గా నాగార్జునకు మొదటి నుంచి మంచి మార్కులే పడ్డాయి. టాస్క్ లు నడించడం, కంటెస్టెంట్ తో సందర్భం ప్రకారం వ్వహరించడం, ఎవరైనా తోక జాడిస్తే స్ట్రాంగ్ వార్నింగ్ లు ఇవ్వడం, వీకెండ్ ఎంటర్టైన్మెంట్ తో పాటు ప్రతీ విషయంలో నాగార్జున సూపర్ అనిపించుకున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రం విమర్శలు తప్పలేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. రెండు మూడు సీజన్లు ఆయన అద్భుతంగా నడిపించారు. కానీ సీజన్ 5, 6 టైమ్ లో ఆయనపై బాగా విమర్శలు వచ్చాయి. అన్నిసీజన్లలో నాగార్జునను విమర్శించేవారు ఉన్నారు.

Related Articles

Related image1
Nagma: 50 ఏళ్లు దాటినా నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరు? ఆముగ్గురు ఎవరో తెలుసా?
Related image2
Rambha: 2000 కోట్ల ఆస్తులు రంభ ఎలా సంపాదించింది, ఆమె భర్త ఎవరు? ఏం చేస్తాడో తెలుసా? నిజమెంత?
35
సోషల్ మీడియాలో విమర్శలు..
Image Credit : starmaa

సోషల్ మీడియాలో విమర్శలు..

కంటెస్టెంట్లను తిట్టినప్పుడు వారి అభిమానులు కింగ్ ను విమర్శిస్తు పోస్ట్ లు పెట్టడం కామన్ గా జరిగేదే. కానీ సీజన్ 5,6 లో మాత్రం ఆయన హౌస్ ను సరిగ్గా నడిపించలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. అంతే కాదు బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ షోపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. యువతను చెడగొడుతుందంటూ.. బిగ్ బాస్ ను బ్యాండ్ చేయాలని ధర్నాలు కూడా చేశారు. కొన్ని స్వఛ్చంద సంస్థలు.. నాగార్జున ఇంటి ముందు ఆందోళన కూడా చేశారు. ఎన్నివిమర్శలు వచ్చినా.. ఏమాత్రం తగ్గకుండా సీజన్ సీజన్ కు కొత్తదనం చూపిస్తూ దూసుకుపోతోంది బిగ్ బాస్ తెలుగు.

45
నాగార్జున ఉంటే బిగ్ బాస్ కు రాను..
Image Credit : google

నాగార్జున ఉంటే బిగ్ బాస్ కు రాను..

కింగ్ నాగార్జునపై బయట నుంచి మాత్రమే కాదు మాజీ కంటెస్టెంట్స్ కూడా కొంత మంది విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. నాగార్జున ఎసిపోడ్స్ అన్నీ చూడరని.. కనీసం సిబ్బంది చెప్పిన విషయాలు కూడా సరిగ్గా ఫాలో అవ్వరని.. ఓ మాజీ కంటెస్టెంట్ ఓ సందర్భంలో కామెంట్ చేసింది. మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్ స్పందిస్తూ, హోస్ట్‌గా నాగార్జున విఫలమయ్యారని, ఆయన తీరు సరిగ్గా లేదని, షో మొత్తం స్క్రిప్టెడ్ అని ఆరోపించారు. ఇక మరో కంటెస్టెంట్ సోనియా అయితే తనకు నాగార్జున హోస్టింగ్ నచ్చలేదని. ఆయన ఉంటే మరోసారి బిగ్ బాస్ అవకాశం వచ్చినా.. తను అడుగు పెట్టనని తేల్చేసింది. మరి కొంత మంది కంటెస్టెంట్లు కూడా నాగార్జున హెస్టింగ్ పై విమర్శలు గుప్పించిన సందర్భాలుఉన్నాయి.

55
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోడింగ్..
Image Credit : X/JioHotstar Telugu

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లోడింగ్..

బిగ్‌ బాస్‌ తెలుగు 10కి రంగం సిద్ధమవుతుంది. ఇప్పటి వరకు తొమ్మిది సీజన్లు విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే. గత డిసెంబర్‌లో బిగ్‌ బాస్‌ తెలుగు 9 ముగిసింది. కామన్‌ మ్యాన్‌ కళ్యాణ్‌ పడాల టైటిల్‌ విన్నర్ అయ్యాడు. అగ్నిపరీక్ష ద్వారా వచ్చి ఆయన విజేతగా నిలవడం విశేషం. ఇక పదవ సీజన్‌కి సంబంధించిన ఏర్పాట్లు కూడా సాగుతున్నాయి. మరో రెండు మూడు నెలల్లో ఈ షో స్టార్ట్ కాబోతుంది. ఇప్పట్నుంచే దానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. ఈసారి కూడా అగ్నిపరీక్ష ఈవెంట్ తరువాత సామాన్యులను తీసుకుని బిగ్ బాస్ లోకి పంపిస్తారని సమాచారం. వచ్చే నెలలో అగ్నిపరీక్ష కూడా స్టార్ట్ అవ్వబోతుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
అక్కినేని నాగార్జున
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
SS Rajamouli: రాజమౌళి - కీరవాణి కాంబోలో వచ్చిన ఆల్ టైమ్ హిట్ సాంగ్స్ ఇవే
Recommended image2
Rambha: 2000 కోట్ల ఆస్తులు రంభ ఎలా సంపాదించింది, ఆమె భర్త ఎవరు? ఏం చేస్తాడో తెలుసా? నిజమెంత?
Recommended image3
Krishna: ఎన్టీఆర్ మాటను ఎదిరించి, పోటీగా కృష్ణ తెరకెక్కించిన భారీ బడ్జెట్ సినిమా, కురుక్షేత్రం రివ్యూ...
Related Stories
Recommended image1
Nagma: 50 ఏళ్లు దాటినా నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరు? ఆముగ్గురు ఎవరో తెలుసా?
Recommended image2
Rambha: 2000 కోట్ల ఆస్తులు రంభ ఎలా సంపాదించింది, ఆమె భర్త ఎవరు? ఏం చేస్తాడో తెలుసా? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved