- Home
- Entertainment
- Rambha: 2000 కోట్ల ఆస్తులు రంభ ఎలా సంపాదించింది, ఆమె భర్త ఎవరు? ఏం చేస్తాడో తెలుసా? నిజమెంత?
Rambha: 2000 కోట్ల ఆస్తులు రంభ ఎలా సంపాదించింది, ఆమె భర్త ఎవరు? ఏం చేస్తాడో తెలుసా? నిజమెంత?
Rambha: 90వ దశకంలో సిల్వర్ స్క్రీన్ ను ఒక ఊపు ఊపేసింది హీరోయిన్ రంభ. సినిమాలు మానేసిన తర్వాత ఆమె తీసుకున్న ఓ నిర్ణయం జీవితాన్నే మార్చేసింది. ప్రస్తుతం వేల కోట్ల ఆస్తులతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.

అభిమానులు ఆందోళన..
90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన రంభ ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అయింది. అందులో రంభ సరిగ్గా నడవలేక, ఒకరి సహాయంతో నెమ్మదిగా అడుగులు వేస్తూ కనిపించారు. ఈ వీడియో చూసిన అభిమానులు ఆమె ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
వెండితెరను ఊపేసిన హీరోయిన్..
టాలీవుడ్ తో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ పరిశ్రమల్లో కూడా స్టార్ హీరోయిన్ గా ఊపేసింది రంభ. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్ తో పాటు, రాజేంద్రప్రసాద్, సుమన్ లాంటి హీరోలతో నటించి మెప్పించింది రంభ. రజినీకాంత్, విజయ్ కాంత్, సల్మాన్ ఖాన్,వివరాజ్ కుమార్ లాంటి స్టార్ హీరోల సరసన మెరిసింది రంభ. 15 ఏళ్ళకు పైగా వరుస హిట్ సినిమాలతో అదరగొట్టింది బ్యూటీ. హీరోయిన్ గా ఫెయిడ్ అవుట్ అయిన తర్వాత ఇండస్ట్రీకి కంప్లీట్ గా దూరం అయ్యింది బ్యూటీ.. కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టింది.
హీరోయిన్ నుంచి బిజినెస్ ఉమెన్ గా ..
చాలా మంది హీరోయిన్లు సినిమాలు తగ్గి..ఫెయిడ్ అవుట్ అయిన తరువాత పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారు. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి కుటుంబానికే పరిమితమవుతుంటారు. కానీ రంభ మాత్రం కొత్త దారి ఎంచుకుంది. కెనడాకు చెందిన బిజినెస్ మెన్ ఇంద్రకుమార్ పద్మనాథన్ ను పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్లిపోయింది. అక్కడ కుటుంబానికే పరిమితం కాకుండా.. వ్యాపారంలోకి అడుగు పెట్టింది. భర్త వ్యాపారాల్లో చేదోడు వాదోడుగా ఉంటూనే, సొంతంగా వ్యాపార రంగంలో పట్టు సాధించారు. ప్రస్తుతం రంభ భర్త వ్యాపారల్లో కొన్నింటికి బాస్ గా ఉన్నట్టు సమాచారం.
వేల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయంటే..?
హీరోయిన్ గా కొంత ఆస్తులు సంపాదించిన రంభ.. వాటిని కొన్ని వ్యాపారాల్లో ఇన్వెస్ట్ చేసినట్టు సమాచారం. భర్త వ్యాపారాలతో పాటు రంభ ఆస్తులు అన్ని కలుపుకుని దాదాపు 2000 కోట్లు సంపాదించిందని అంచనా. ఈ విషయంలో రంభ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ మాత్రం లేదు. చెన్నై, హైదరాబాద్ తో పాటు కెనడాలో అత్యంత విలాసవంతమైన భవనాలు, ఖరీదైన కార్లు ఆమె సొంతం. కష్టపడి సంపాదించని దానితో పాటు ఆమెకు వారసత్వంగా కూడా కొంత ఆస్తి కలిసివచ్చినట్టు సమాచారం. రంభ చాలా నిజాయితీగా తన వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. ఎక్కడా తన పాపులారిటీని వాడలేదు. హీరోయిన్ గా తన ఇమేజ్ ను వ్యాపారం కోసం ఉపయోగించలేదు.
హ్యాపీగా సాగుతున్నలైఫ్ లో విషాదం...
అంతా బాగుంది అనుకున్న టైమ్ లో 2022లో జరిగిన కారు ప్రమాదం.. రంభ లైఫ్ ను డిస్ట్రబ్ చేసింది. ఆయాక్సిడెంట్ వల్ల ఆమెకు కొన్ని ఈ ఆరోగ్య సమస్యలు వచ్చాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిపై రంభ గానీ, ఆమె కుటుంబ సభ్యులు గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు. 2022 నవంబర్‌లో కెనడాలోని టొరంటోలో రంభ ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్ అయింది. స్కూల్ నుంచి పిల్లలను ఇంటికి తీసుకొస్తుండగా, మరో వాహనం వచ్చి వీరి కారును ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో రంభ, ఆమె పిల్లలు గాయపడినా, ప్రాణాలతో బయటపడ్డారు.
వెండితెరపైకి రీ ఎంట్రీ ఎప్పుడంటే?
ప్రస్తుతం రంభ ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకును చూసుకుంటునే.. బిజినెస్ వ్యవహారాలు కూడా చూసుకుంటుంది. పిల్లలు పెద్దవాళ్లు అవ్వడంతో.. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా.. రంభ రీసెంట్ గా కొన్ని రియాలిటీ షోలకు జడ్జిగా కనిపించారు. మంచి పాత్ర దొరికితే మళ్లీ సినిమాల్లో నటించాలని ఉందని పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.

