MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Nagma: 50 ఏళ్లు దాటినా నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరు? ఆముగ్గురు ఎవరో తెలుసా?

Nagma: 50 ఏళ్లు దాటినా నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరు? ఆముగ్గురు ఎవరో తెలుసా?

Nagma: సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది హీరోయిన్ నగ్మా. సినిమాలు మానేసిన తర్వాత తోటి హీరోయిన్లు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వగా.. నగ్మా మాత్రం 50 ఏళ్లు దాటినా ఇంకా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ గానే ఉండిపోయింది. అందుకు కారణం ఎవరో తెలుసా? 

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 03 2026, 04:16 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సౌత్ సినిమాను ఊపేసిన స్టార్ హీరోయిన్...
Image Credit : www.facebook.com/NagmaOfficial

సౌత్ సినిమాను ఊపేసిన స్టార్ హీరోయిన్...

సౌత్ సినిమాలో మరీ ముఖ్యంగా తెలుగు సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది నగ్మా . తెలుగులో చిరంజీవి, నాగార్జున, బాలయ్య, వెంకటేష్, సుమన్, ఇలా స్టార్ హీరోలందరిసరసన నటించి మెప్పటించింది. తమిళం, మలయాళం, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా స్టార్ గా మెరిసిన నగ్మా .. బాలీవుడ్ లో కూడా స్టార్ ఇమేజ్ ను తెచ్చుకుంది. హీరోయిన్ గా ఆఫర్లు తగ్గిన వెంటనే.. ఒకటీ రెండు సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసిన ఈ బ్యూటీ.. ఆతరువాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
10 భాషల్లో 90 సినిమాలు చేసిన తార..
Image Credit : www.facebook.com/NagmaOfficial

10 భాషల్లో 90 సినిమాలు చేసిన తార..

స్టార్ హీరోయన్ గా 10 భాషల్లో దాదాపు 90 సినిమాల వరకూ చేసింది నగ్మా .. సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా అన్నిబాషల్లో స్టార్ డమ్ ను సాధించింది. అంతే కాదు ఆమె చేసిన సినిమాల్లో దాదాపు అన్నీ సూపర్ హిట్లే. అయితే తన తో కలిసి పనిచేసిన కోస్టార్స్, అప్పటి హీరోయిన్లు అందరు పెళ్లిళ్లు చేసుకున్నారు కానీ.. నగ్మ మాత్రం లైఫ్ టైమ్ బ్యాచిలర్ గా మిగిలిపోయింది. 50 ఏళ్లు దాటినా.. ఇంకా బ్యాచిలర్ లైఫ్ నే గడుపుతోంది. నగ్మా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఎవరు?

36
50 ఏళ్ల బ్యాచిలర్ హీరోయిన్..
Image Credit : Getty

50 ఏళ్ల బ్యాచిలర్ హీరోయిన్..

సినిమాల నుంచి ఫెయిడ్ అవుట్ అయిన తర్వాత నగ్మా రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ఆమె పెళ్లి చేసుకోకుండా సింగిల్ లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇంత వరకూ పెళ్లి చేసుకోకపోవడానికి స్పష్టమైన కారణం మాత్రం ఎప్పుడు చెప్పలేదు ఆమె. అయితే ఇండస్ట్రీలో మాత్రం రకరకాల వార్తలు వైర్ అవుతుంటాయి. ఈ విధంగానే నగ్మాతో ముగ్గరు స్టార్లకు ఎఫౌర్ అందంటూ ప్రచారం జరిగింది. ఇంతకీ ఎవరా స్టార్లు.

46
ముగ్గురు హీరోలతో ఎఫైర్ రూమర్స్..
Image Credit : Facebook

ముగ్గురు హీరోలతో ఎఫైర్ రూమర్స్..

హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగా... స్టార్ క్రికెటర్ గంగూలితో ఆమెకు అఫైర్ ఉందని రూమర్లు గట్టిగా వినిపించాయి. మరో ఇద్దరు స్టార్లతో ఆమె డేటింగ్ చేసిందని వార్తలు వైరల్ అయ్యాయి. తమిళంలో శరత్ కుమార్ తో ఆమెకు ఎఫైర్ అందంటూ సోషల్ మీడియా కోడే కూసింది. ఇక టాలీవుడ్ మన్మధుడు నాగార్జునతో కూడా నగ్మా ప్రేమాయనం నడిపిందన్న వార్తలు వైరల్ అయ్యాయి. 

ముఖ్యంగా ప్రేమలో విఫలం అవ్వడం వల్లే ఆమె బ్యాచిలర్ గా ఉండిపోయిందన్న ప్రచారం కూడా జరిగింది. అయితే మరో వాదన ఏంటంటే.. తన తల్లీ తండ్రులు విడిపోవడం, పెళ్లిపై ఆమెకు మొదటి నుంచి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల నగ్మ పెళ్లి చేసుకోకుండ.. రాజీయాల్లో బిజీ అయిపోయిందని అంటుంటారు. ఇక ప్రస్తుతం 50 ఏళ్లు దాటిన నగ్మ.. పెళ్ళి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది.

56
నగ్మా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే.. ?
Image Credit : our own

నగ్మా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే.. ?

నగ్మా ఫ్యామిలీలో రకరకాల మతాలు కలిసి ఉంటాయి. ఆమె తండ్రి అరవింద్ మొరార్జీ హిందూ, తల్లి షామా మాత్రం కాజీ ముస్లిం. తండ్రి వ్యాపారవేత్త. అతని పూర్వీకులు జైసల్మేర్‌కు చెందినవారు. ముంబైకి వచ్చి సెటిల్ అయ్యారు. ఇక . తల్లి ముస్లీం అయినా.. ఆమె ఫ్యామిలీ మాత్రం స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబం కావడం విశేషం.షామా, అరవింద్ 1969లో పెళ్లి చేసుకున్నారు. నగ్మా కడుపులో ఉండగానే 1974లో విడిపోయారు. ఆ తర్వాత షామా, సినీ నిర్మాత చందర్ సదానాని పెళ్లి చేసుకుంది. వీళ్లకు జ్యోతిక, రోషిణి (రాధిక) అనే ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

66
నగ్మా చెల్లెళ్లు కూడా హీరోయిన్లే అని తెలుసా?
Image Credit : our own

నగ్మా చెల్లెళ్లు కూడా హీరోయిన్లే అని తెలుసా?

నగ్మ ఇద్దరు చెల్లెల్లు హీరోయిన్లుగా చేశారు. అందులో నగ్మ పెద్ద చెల్లెలు జ్యోతిక స్టార్ హీరోయిన్ గా సౌత్ లోవెలుటు వెలిగింది. తమిళ స్టార్ హీరో సూర్యను ఆమె పెళ్ళాడింది. ఇక నగ్మాకు తన తండ్రి అంటే చాలా ఇష్టం. తండ్రి 2005 లో మరణించగా.. అతను మరణించే వరకూ అతనికి చాలా దగ్గరగా ఉంది. తల్లి దగ్గర కంటే తండ్రి దగ్గరే నగ్మ ఎక్కువగా పెరిగింది. ఇక సినిమాలు చేయడానికి మాత్రం నగ్మను ప్రోత్సహించింది తల్లి షామానే. 

1990 లో సల్మాన్ ఖాన్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన నగ్మా.. అప్పటి నుంచి కెరీర్ లో తిరిగి చూసుకోలేదు. ఆతరువాత ఆమె చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్లే, ఇక సౌత్ లో అయితే.. భాషా, రౌడీ అల్లుడు, రిక్షావోడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంది నగ్మ. సౌత్ ఆడియన్స్ లో ఆమె క్రేజ్ ఎలా ఉండేదంటే నగ్మాకు ఏకంగా గుడికట్టేశారు అంత ఇష్టపడ్డారు ఇక్కడి ఆడిమన్స్.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: సృష్టి, అమన్ ని పీకి పడేసిన అపూర్వ, మిథిలేష్.. రాగానే రచ్చ లేపారుగా
Recommended image2
Divya Bharathi: ఇండస్ట్రీలో నేను చేసిన అతిపెద్ద తప్పు అదే.. అసలు నిజం చెప్పిన హీరోయిన్!
Recommended image3
Taapsee Pannu: హీరో పెళ్ళానికి నచ్చలేదని తాప్సీని సినిమా నుంచి తీసేశారు.. స్టార్‌ హీరోయిన్‌ ఆవేదన
Related Stories
Recommended image1
Nagababu: నాగబాబు కు ఫోన్ చేసి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిపడేసిన చిరంజీవి, కారణం ఏంటి? మెగా బ్రదర్ ఏం చేశాడంటే?
Recommended image2
Mahesh Babu: నమ్రత చంపి సమాధి చేస్తుంది.. మహేష్ బాబుతో పెళ్లి పై హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved