MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Bigg Boss Telugu 10: అమన్ పప్పుగాడు కాదు, రామ్ ప్రసాద్ కన్నింగ్ కాదు, బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున చెప్పిన చాణక్యుడు ఎవరంటే?

Bigg Boss Telugu 10: అమన్ పప్పుగాడు కాదు, రామ్ ప్రసాద్ కన్నింగ్ కాదు, బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున చెప్పిన చాణక్యుడు ఎవరంటే?

Bigg Boss Telugu 10: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో కొనసాగుతోంది. బిగ్ బాస్ టెంప్టేషన్‌లో భాగంగా ఇచ్చిన ప్రైజ్ మనీతో ఎవరో ఒకరు బయటకు వెళ్లిపోవచ్చని ఆఫర్ ఇవ్వగా.. వచ్చిన ఒక రోజులోనే మిథిలేష్ ఆ ఆఫర్‌ను తీసుకున్నాడు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Sep 27 2026, 12:14 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ బాస్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు..
Image Credit : Star Maa

బిగ్ బాస్‌లో ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ ఉత్కంఠభరితంగా మారుతోంది. రోజువారీ టాస్కులు, గొడవలతో హౌస్‌లోని వాతావరణం వేడెక్కుతుండగా, వీకెండ్‌లో నాగార్జున వచ్చే ఎపిసోడ్ వీక్షకులకు ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. ఆయన వచ్చి ఎవరికి క్లాస్ పీకుతారో, ఎవరి తప్పులు ఎత్తి చూపుతారో అని అంతా ఎదురుచూస్తుంటారు. తాజాగా డే 20కి సంబంధించిన ఎపిసోడ్‌లో బిగ్ బాస్ హౌస్‌లో జరిగిన హైడ్రామాపై హోస్ట్ అక్కినేని నాగార్జున తీవ్రస్థాయిలో స్పందించారు. పోటీదారుల ప్రవర్తన, వారి గేమ్‌ప్లే, హౌస్‌లోని ఘర్షణలపై క్లారిటీ ఇస్తూ నాగార్జున తీసుకున్న నిర్ణయాలు ఈ ఎపిసోడ్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కంటెస్టెంట్ల గేమ్‌ప్లేపై నాగార్జున సీరియస్
Image Credit : Star Maa

కంటెస్టెంట్ల గేమ్‌ప్లేపై నాగార్జున సీరియస్

గత వారం రోజులుగా హౌస్‌లో జరిగిన గొడవలు, టాస్కులలో ఇంటి సభ్యుల తీరును నాగార్జున రివ్యూ చేశారు. రూల్స్ పాటించని వారికి గట్టిగా క్లాస్ పీకిన నాగార్జున ప్రతి ఒక్కరి సమస్యనూ అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సుధీర్, సృష్టి మధ్య జరిగిన వివాదంపై నాగ్ పర్సనల్‌గా రూమ్‌కు పిలిచి మాట్లాడారు. అంతేకాదు, సుధీర్ అక్కడ అనుచితమైన పదం వాడటంతో నాగార్జునకు కోపం వచ్చింది. సుధీర్‌కు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇక చరణ్‌కు మరో అవకాశం ఇస్తే సరిగ్గా వాడుకోవడం లేదంటూ మండిపడ్డారు నాగ్. ఒకరి గురించి మాట్లాడే ముందు నీకు వచ్చిన అవకాశాలన్నింటినీ జాగ్రత్తగా వాడుకోవాలి కదా అని చరణ్‌కు కౌంటర్ ఇచ్చారు నాగార్జున.

35
అమన్ పప్పు కాదు.. వర్షిణి విషయంలో నిజం ఏంటి?
Image Credit : Star Maa

అమన్ పప్పు కాదు.. వర్షిణి విషయంలో నిజం ఏంటి?

ఇక రీసెంట్‌గా జరిగిన గేమ్‌లో అమన్, వర్షిణిని హగ్ చేసుకున్నట్టుగా పట్టుకోవడం.. ఆమె అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడంతో.. ఈ విషయంలో అందరి కళ్లు తెరిపించారు నాగ్. అందులో అమన్ తప్పు లేదని నిరూపించారు. ఇక రోహిత్, అమన్‌ను 'పప్పుగాడు' అనడంపై కూడా గట్టిగా స్పందించారు నాగార్జున. టాస్కులలో గట్టిగా ఆడుతూ రూల్స్ పాటిస్తున్న అమన్ పప్పు కాదు అని అన్నారు. ఇక ఈ క్రమంలోనే దేబ్‌జానీకి గత వారం చెప్పినట్టుగానే చిల్లర మాటలు తగ్గించుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కొందరు కంటెస్టెంట్లు నియమావళిని అతిక్రమించడం, వ్యక్తిగత విమర్శలకు దిగడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

45
కన్నింగ్ కాదు.. చాణక్యుడు!
Image Credit : Star Maa

కన్నింగ్ కాదు.. చాణక్యుడు!

గేమ్ ఆడటంలో నిజాయితీ, వ్యూహం ఉండాలి తప్ప అనవసరమైన గొడవలు హౌస్ వాతావరణాన్ని దెబ్బతీస్తాయని హెచ్చరించారు నాగార్జున. ముఖ్యంగా రామ్ ప్రసాద్, తనను 'కన్నింగ్' అనడంపై బాగా ఫీల్ అయ్యాడు. అది కన్నింగ్ గేమ్ కాదు, స్ట్రాటజీ అని చెప్పడంతో నాగార్జున కూడా రామ్ ప్రసాద్‌కు సపోర్ట్ చేశారు. అతను ఆడింది పక్కా స్ట్రాటజీ అని చెప్పి, "ఇక నుంచి నువ్వు చాణక్యుడివి" అని బిరుదు కూడా ఇచ్చారు.

మరోవైపు నరేష్‌పై పొగడ్తల వర్షం కురిపించారు కింగ్. "హౌస్‌లో పాజిటివిటీ అంతా నరేష్‌దే ఉంది" అంటూనే, నరేష్ అద్భుతంగా ఆడుతున్నాడని కితాబిచ్చారు. నోరుజారిన ముఖేష్‌కు, వర్షిణికి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున.. అసలు హౌస్‌లో కనిపించడం లేదని, గేమ్ సరిగ్గా ఆడలేకపోతున్నాడని టెంపర్ వంశీని గట్టిగా మందలించారు.

55
ఊహించని ట్విస్ట్ – మారిన మూడ్
Image Credit : Star Maa

ఊహించని ట్విస్ట్ – మారిన మూడ్

ఇక త్రిగుణ్ విషయంలో అంతా పాజిటివ్ వాతావరణం నెలకొంది. సంచాలక్‌గా అతని నిర్ణయాన్ని అందరూ వ్యతిరేకించగా.. నాగార్జున మాత్రం వీడియో ప్లే చేసి మరీ త్రిగుణ్ చెప్పింది నిజమని నిరూపించారు.ఇది కొనసాగుతుండగానే ఎపిసోడ్ ముగింపు దశకు చేరుకుంటున్న సమయంలో నాగార్జున ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. బిగ్ బాస్ నుంచి ఇప్పటికిప్పుడే బయటకు వెళ్లిపోవాలంటే వెళ్లవచ్చని ఆఫర్‌గా ముందు ₹5 లక్షలు, తర్వాత ₹10 లక్షలు, ఆ తర్వాత ₹15 లక్షలు ప్రకటించారు. ఈ ఆఫర్‌ను మిథిలేష్ తీసుకున్నాడు. కానీ ఆ ₹15 లక్షలు విన్నర్ ప్రైజ్ మనీ నుంచి కట్ అవుతాయని నాగ్ ప్రకటించారు. అందరూ ఆపడానికి ఎంత ప్రయత్నించినా ఆ ఆఫర్‌ను అతను కాదనలేకపోయాడు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhanush: కొడుకులే బాడీగార్డ్స్.. యాత్ర, లింగాలతో కలిసి పళని మురుగన్ గుడికి ధనుష్
Recommended image2
డైలాగ్ వింటేనే వణుకు పుడుతుంది... ఆడియన్స్ 100 మార్కులు వేసిన ఈ హారర్ సినిమా గుర్తుందా?
Recommended image3
Arjun Sarja Fitness: 64 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా యాక్షన్ కింగ్.. అర్జున్‌ సర్జా ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే
Related Stories
Recommended image1
Auto Ram Prasad: బిగ్ బాస్ కే స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆటో రామ్ ప్రసాద్, జబర్దస్త్ కమెడియన్ లో ఈ కోణం కూడా ఉందా?
Recommended image2
Babu Mohan: బాబు మోహన్ మంత్రి అవ్వడం తట్టుకోలేకపోయిన కోట శ్రీనివాసరావు, అసెంబ్లీలో ఏం చేశాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved