- Home
- Entertainment
- BBK 12 Finale: బిగ్ బాస్ ప్రకటించకముందే విన్నర్ పేరు లీక్ చేసిన వికీపీడియా.. విజేత ఎవరో తెలుసా?
BBK 12 Finale: బిగ్ బాస్ ప్రకటించకముందే విన్నర్ పేరు లీక్ చేసిన వికీపీడియా.. విజేత ఎవరో తెలుసా?
BBK 12 Finale: బిగ్ బాస్ కన్నడ సీజన్ 12 ఫినాలేకి ముందే విజేతపై ఉత్కంఠ పెరిగింది. అధికారిక ప్రకటనకు ముందే వికీపీడియాలో విన్నర్ పేరుని ప్రస్తావించారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది.

బిగ్ బాస్ కన్నడ గ్రాండ్ ఫినాలే
బిగ్ బాస్ కన్నడ 12 ఫినాలే ఎపిసోడ్ ఈరోజు(ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి ప్రసారం అవుతుంది. మరి కాసేపట్లో విన్నర్ ఎవరనేది తేలనుంది. అయే ఈ ఎపిసోడ్ చివర్లో విన్నర్ ఎవరో ప్రకటిస్తారు. అంతకంటే ముందే అభిమానులు తమ అభిమాన కంటెస్టెంటే విన్నర్ అని రాసుకుంటున్నారు. ఇప్పుడు వికీపీడియాలో విన్నర్ ఎవరో ప్రకటించి షాకిచ్చింది.
గూగుల్ సెర్చ్ లో బిగ్ బాస్ విన్నర్ పేరు
గూగుల్‌లో ఏది సెర్చ్ చేసినా వికీపీడియా కొంత వివరణాత్మక సమాచారాన్ని అందిస్తుంది. గూగుల్‌లో 'Bigg Boss Kannada season 12' అని సెర్చ్ చేసి వికీపీడియా పేజీని తెరిస్తే, షోకి సంబంధించిన కొన్ని వివరాలు కనిపిస్తాయి. అధికారిక సమాచారం వెలువడక ముందే వికీపీడియా విన్నర్ పేరును పేర్కొంది. వికీపీడియా పేజీని ప్రజలు కూడా ఎడిట్ చేయవచ్చు.
వికీపీడియా ఏం చెప్పింది?
వికీపీడియాలోని సమాచారం ప్రకారం, సీజన్ 12 విన్నర్ గిల్లి నట, మొదటి రన్నరప్ రక్షిత శెట్టి అని నమోదు చేశారు. కొద్దిసేపటి క్రితం రక్షిత శెట్టిని విన్నర్‌గా చూపించారు. ఇప్పుడు గిల్లి పేరు రావడంతో అభిమానులు సంతోషంగా స్క్రీన్‌షాట్‌లను పంచుకుంటున్నారు.
బిగ్ బాస్ సీజన్ 12 ఫినాలే
బిగ్ బాస్ సీజన్ 12 ఫినాలేలో గిల్లి నట, రక్షిత శెట్టి, అశ్విని గౌడ, మ్యూటెంట్ రఘు, కావ్య శైవ, ధనుష్ ఉన్నారు. అందుతున్న సమాచారం మేరకు ప్రకారం టాప్ 3లో గిల్లి నట, రక్షిత శెట్టి, అశ్విని గౌడ ఉంటారని చెబుతున్నారు. కానీ దీనిపై బిగ్ బాస్ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రిడిక్షన్ ప్రకారం కూడా గిల్లి నట అంటున్నారు.
పోలీసు భద్రత
బిగ్ బాస్ కార్యక్రమం బిడదిలోని జాలీవుడ్ స్టూడియోలో జరుగుతోంది. ఈరోజు ఫినాలే కావడంతో జాలీవుడ్ స్టూడియో ముందే అభిమానులు బ్యానర్లు పెట్టడం మొదలుపెట్టారు. మరోవైపు, జాలీవుడ్ స్టూడియో వైపు వస్తున్న జనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు మోహరించారు. మరి విన్నర్ ఎవరనేది కాసేపట్లో తేలనుంది.

