MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఉదయ్ కిరణ్ తో 5 సినిమాలకు సైన్ చేశా, ఆత్మహత్య చేసుకొని అందరినీ వదిలిపోయారు!

ఉదయ్ కిరణ్ తో 5 సినిమాలకు సైన్ చేశా, ఆత్మహత్య చేసుకొని అందరినీ వదిలిపోయారు!

హీరో ఉదయ్ కిరణ్ ని ఉద్దేశిస్తూ బిగ్ బాస్ ఫేమ్ సుదీప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల హౌస్ నుండి ఎలిమినేటై వచ్చిన సుదీప దివంగత ఉదయ్ కిరణ్ చేయాల్సిన 5 చిత్రాలకు తాను సైన్ చేసినట్లు వెల్లడించారు.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Oct 24 2022, 01:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


7/జి బృందావన కాలనీ, నువ్వు నాకు నచ్చావ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సుదీప అలియాస్ పింకీ బిగ్ బాస్ షోతో మరలా వెలుగులోకి వచ్చారు. సీజన్ 6 లో పాల్గొన్న సుదీప ఆరవవారం ఎలిమినేట్ అయ్యారు. హౌస్ నుండి బయటకు వచ్చాక ఆమె వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


ఈ సందర్భంగా సుదీప ఉదయ్ కిరణ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన నటిస్తున్న 5 చిత్రాలకు తాను సైన్ చేసినట్లు గుర్తు చేశారు.సుదీప మాట్లాడుతూ...  ఉదయ్ కిరణ్ హీరోగా ఒకేసారి తొమ్మిది చిత్రాలు ప్రారంభం అయ్యాయి. అయితే వాటిలో చాలా ఆగిపోయాయి.  ఒక ఐదు చిత్రాలకు నేను కూడా సైన్ చేశాను. 
 

36
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6

ఉదయ్ కిరణ్ చాలా సాఫ్ట్ గా ఉండేవారు. కొంచెం డల్ గా కనిపిస్తే దగ్గరకొచ్చి  ఏమైందని అడిగేవాడు. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పమని మంచి చెడులు అడిగి తెలుసుకునే మనస్తత్వం. ఒకరి బాధను పసిగట్టి ఓదార్చడానికి ప్రయత్నం చేసేవారు. ఏ కష్టం వచ్చిందో ఆత్మహత్య చేసుకొని అందరినీ వదిలివెళ్ళిపోయారు. బౌతికంగా ఉదయ్ కిరణ్ లేకున్నా అందరి మనస్సులో ఉండిపోయారు, అని సుదీప ఎమోషనల్ అయ్యారు. 
 

46
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


ఉదయ్ కిరణ్ తో సుదీప నటించిన చివరి చిత్రం వియ్యాల వారి కయ్యాలు. కాగా సుదీప నటిగా ఎలా మారారో కూడా వెల్లడించారు. మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన ఎమ్ ధర్మరాజు ఎంఏ మూవీ షూటింగ్ గోదావరి జిల్లాల్లో జరుగుతుంది. ఆ మూవీలో నటించాల్సిన చైల్డ్ ఆర్టిస్ట్ హ్యాండ్ ఇచ్చింది. దాంతో మా తాతగారు నా పేరు సూచించారు. అలా వెండితెరకు పరిచయమయ్యానని సుదీప వెల్లడించారు. 
 

56
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


హీరో, హీరోయిన్స్ చెల్లెలు పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ అయిన సుదీప పదుల సంఖ్యలో చిత్రాలు చేశారు. అనంతరం తెలుగు సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేశారు. పెళ్లయ్యాక సుదీప స్లో అయ్యారు. ఆమె సిల్వర్ స్క్రీన్ కి దూరమయ్యారు. 
 

66
Bigg Boss Telugu 6

Bigg Boss Telugu 6


బిగ్ బాస్ సీజన్ 6 తో మరలా తెలుగు ప్రేక్షకులను పలకరించారు. హౌస్లో సుదీప తన మార్కు గేమ్ చూపించారు. విషయం ఏదైనా గట్టిగా మాట్లాడుతూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉన్న సుదీప అనూహ్యంగా 6వ వారం ఎలిమినేట్ అయ్యారు. 
 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఉదయ్ కిరణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Samantha: సమంతపై పోటీకి దిగుతున్న మహేష్, మంచు విష్ణు, తేజ సజ్జా.. భయపడాల్సిన అవసరమే లేదా ?
Recommended image2
Singer Sunitha: 18 ఏళ్ళ వయసులోనే చూశా, అమ్మాయిలకు ఇండస్ట్రీ సేఫ్ కాదు..సంచలన నిజాలు బయటపెట్టిన సింగర్ సునీత
Recommended image3
OTT Top 10 Movies: ఇండియా వైడ్‌గా ఓటీటీలో దుమ్ములేపుతున్న ఫ్యామిలీ థ్రిల్లర్‌.. ప్రైమ్‌లో టాప్‌ 10 మూవీస్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved