MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Singer Sunitha: 18 ఏళ్ళ వయసులోనే చూశా, అమ్మాయిలకు ఇండస్ట్రీ సేఫ్ కాదు..సంచలన నిజాలు బయటపెట్టిన సింగర్ సునీత

Singer Sunitha: 18 ఏళ్ళ వయసులోనే చూశా, అమ్మాయిలకు ఇండస్ట్రీ సేఫ్ కాదు..సంచలన నిజాలు బయటపెట్టిన సింగర్ సునీత

సింగర్ సునీత టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి సంచలన నిజాలు బయట పెట్టారు. అమ్మాయిలకు ఇది సేఫ్ ప్లేస్ కాదు అని అన్నారు. ఇండస్ట్రీలో మహిళలకు ఎదురయ్యే కష్టాల గురించి ఆమె మాట్లాడారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 24 2026, 06:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Singer Sunitha
Image Credit : Asianet News

Singer Sunitha

టాలీవుడ్ లో స్టార్ సింగర్ గా సునీత దశాబ్దాలుగా గుర్తింపు పొందారు. ఆమె గాత్రం ఎంతో వినసొంపుగా ఉంటుంది. సునీత పాడిన పాటలు ఎక్కువగా సూపర్ హిట్స్ అయ్యాయి. 17 ఏళ్ళ వయసులోనే సునీత కెరీర్ ప్రారంభించారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం, మహిళలకు ఎదురయ్యే సమస్యల గురించి ఇప్పటి వరకు చాలా మంది నటీమణులు, సెలెబ్రిటీలు మాట్లాడారు. తాజాగా సింగర్ సునీత తన స్టైల్ లో మహిళల ఈక్వాలిటీ గురించి, ఇండస్ట్రీలో ఎదురయ్యే సమస్యల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నా బాడీ నా ఇష్టం అని అంటే వాళ్ళు నా కళ్ళు నా ఇష్టం అంటారు
Image Credit : our own

నా బాడీ నా ఇష్టం అని అంటే వాళ్ళు నా కళ్ళు నా ఇష్టం అంటారు

చాలా మంది నా బాడీ నా ఇష్టం, నాకు నచ్చిన బట్టలు వేసుకుంటా అని మాట్లాడుతున్నారు. దానిని ఫెమినిజంలో, ఈక్వాలిటీలో కలిపేస్తున్నారు. మహిళలు సిగరెట్ తాగడం కూడా ఈక్వాలిటీ అంటున్నారు. ఇవన్నీ నాకు నచ్చవు. నీ బాడీ నీ ఇష్టం అని నువ్వంటే.. నా కళ్ళు నా ఇష్టం అని అతడు అంటాడు. నాకు నచ్చిన బట్టలు నేను వేసుకుంటా అని నువ్వు అంటే.. వేసుకో నిన్ను ఎవరు అడ్డుకుంటున్నారు.

35
సిగరెట్ ని, బట్టలని ఈక్వాలిటీతో ముడిపెట్టొద్దు
Image Credit : our own

సిగరెట్ ని, బట్టలని ఈక్వాలిటీతో ముడిపెట్టొద్దు

కానీ దానిని ఫెమినిజం, ఈక్వాలిటీతో ముడిపెట్టకు. నీకు ఆ బట్టలు వేసుకోవాలనే కోరిక నీకు ఉంది. ఆ కోరికని సమాజం మీదకి రుద్దడం కరెక్ట్ కాదు. ఈక్వాలిటీ పేరుతో ఇలాంటి చెత్త విషయాలు చర్చించడం అస్సలు ఇష్టం లేదు. మహిళలకు ఇంకా చాలా పెద్ద సమస్యలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడాలి కానీ ఇవన్నీ వేస్ట్ అంటూ సునీత అన్నారు. సిగరెట్ నే తీసుకుందాం.. ఆ విషయంలో మగవాళ్ళు ఆడవాళ్ళూ ఇద్దరూ అస్సలు సమానం కాదు. ఒక సిగరెట్ తాగితే మగవాడికి జరిగే నష్టం కంటే ఆడవాళ్లు జరిగే నష్టమే చాలా ఎక్కువ అని సునీత తెలిపారు.

45
కొత్తగా వచ్చే వారిపై వేధింపులు నిజమే
Image Credit : our own

కొత్తగా వచ్చే వారిపై వేధింపులు నిజమే

ఇటీవల బట్టల గురించి ఇండస్ట్రీలో పెద్ద వివాదం సాగిన సంగతి తెలిసిందే. అలా బట్టల గురించి మాట్లాడే సెలెబ్రెటీలకు సింగర్ సునీత ఈ విధంగా కౌంటర్ ఇచ్చారు. ఇక ఇండస్ట్రీలో మహిళలకు జరిగే వేధింపుల విషయానికి వస్తే.. నిజంగానే వేధింపులు జరుగుతున్నాయి అని సునీత అన్నారు. ఇది కొత్తగా ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చే అమ్మాయిల విషయంలో ఎక్కువగా ఉంటుంది. ఫేమ్ సాధించిన వారి విషయంలో కాస్త తక్కువగా ఉంటుంది అని సునీత తెలిపారు.

55
18 ఏళ్ళ వయసులోనే చూశా
Image Credit : our own

18 ఏళ్ళ వయసులోనే చూశా

నాకు కూడా వేధింపులు ఎదురయ్యాయి. కానీ తీవ్రమైన స్థాయిలో కాదు. 18 ఏళ్ళ వయసులోనే ఇలాంటివి అనుభవించాను. కచ్చితంగా ఒక మాట చెప్పగలను. ఇండస్ట్రీ కొత్తగా వచ్చే వాళ్లకు సేఫ్ ప్లేస్ కాదు. సేఫ్ గా ఉండాలి అంటే మీరు మెంటల్ గా, ఎమోషనల్ గా, ఫిజికల్ గా, ఫైనాన్సియల్ గా స్ట్రాంగ్ గా ఉంటేనే ఇండస్ట్రీలో సేఫ్ గా ఉండే అవకాశం ఉంటుంది అని సునీత అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
418 Movie Trailer: సెన్సార్ బోర్డును వణికించినట్రైలర్.. 418 రిలీజ్ డేట్ ఫిక్స్!
Recommended image2
Trisha: 40 ఏళ్లు దాటాక విటమిన్ డి కోసం త్రిష ఏం చేస్తోందో తెలుసా? ఇది ఎందుకంత ముఖ్యం?
Recommended image3
Nani: ఇంటికి వచ్చిన స్టార్ హీరోయిన్ తో వంట చేయించిన నాని... కారణం ఏంటి? ఎవరా హీరోయిన్?
Related Stories
Recommended image1
Pan India Movies: ఇప్పుడు కనుక రిలీజై ఉంటే ఈ సినిమాలకు 1000 కోట్లు పక్కా.. జనాలు మరిచిపోయిన ఆ నటి మూవీ కూడా
Recommended image2
Chiranjeevi: చిరంజీవికి బిస్కెట్ వేయాల్సిన అవసరం నాకు లేదు.. రాంచరణ్, అల్లు అర్జున్ కాచుకుని కూర్చున్నారు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved