- Home
- Entertainment
- OTT Top 10 Movies: ఇండియా వైడ్‌గా ఓటీటీలో దుమ్ములేపుతున్న ఫ్యామిలీ థ్రిల్లర్.. ప్రైమ్‌లో టాప్ 10 మూవీస్
OTT Top 10 Movies: ఇండియా వైడ్‌గా ఓటీటీలో దుమ్ములేపుతున్న ఫ్యామిలీ థ్రిల్లర్.. ప్రైమ్‌లో టాప్ 10 మూవీస్
OTT Top 10 Movies: ప్రైమ్ వీడియో ఓటీటీలో సౌత్ సినిమాలు దుమ్ములేపుతున్నాయి. అందులో మోహన్ లాల్ ఫ్యామిలీ థ్రిల్లర్, సూర్య యాక్షన్ మూవీ ట్రెండ్ అవుతోంది. మరి ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతున్న టాప్ 10 మూవీస్ ఏంటంటే?

ప్రైమ్ వీడియోస్ టాప్ 10 మూవీస్
ఇప్పుడు ఓటీటీ హవా నడుస్తోంది. చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా అన్ని సినిమాలను ఇందులో చూస్తున్నారు ఆడియెన్స్. థియేటర్ కి వెళ్లేవారి శాతం తగ్గింది. ఓటీటీలో చూసేవారి శాతం పెరిగింది. ఈ క్రమంలో థియేటర్లో రిజల్ట్ తో సంబంధం లేకుండా చాలా సినిమాలు ఓటీటీలో దుమ్ములేపుతున్నాయి. అందులో భాగంగా ప్రైమ్ వీడియోస్‌లో ఫ్యామిలీ థ్రిల్లర్ మూవీ టాప్‌లో ఉంది. వీటితోపాటు యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ ట్రెండ్ అవుతున్నాయి. ప్రైమ్‌లో ఇప్పుడు ట్రెండ్ అవుతున్న టాప్ 10 మూవీస్ ఏంటో చూద్దాం.
ప్రైమ్‌లో నెంబర్ 1 స్థానంలో దృశ్యం 3
ప్రైమ్‌లో నెంబర్ 1లో దూసుకుపోతున్న మూవీ `దృశ్యం 3`. మోహన్‌లాల్ హీరోగా నటించిన చిత్రమిది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. మీనా హీరోయిన్‌గా నటించింది. ఒక మర్డర్ కేసు చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇదే కేసుతో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చి ఆదరణ పొందాయి. ఇప్పుడు మూడో సీక్వెల్ కూడా మలయాళంలో పెద్ద హిట్ అయ్యింది. ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ఇండియా వైడ్‌గా ట్రెండ్ అవుతుంది. ప్రైమ్‌లో మొదటి స్థానంలో దూసుకుపోతుంది.
టాప్ 2లో కరుప్పు
రెండో స్థానంలో తమిళ మూవీ `కరుప్పు` ఉంది. సూర్య హీరోగా, త్రిష హీరోయిన్‌గా నటించిన చిత్రమిది. ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీసు వద్ద పెద్ద విజయం సాధించింది. సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లని రాబట్టింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో దుమ్ములేపుతోంది. ప్రైమ్‌లో టాప్ 2లో ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే తెలుగు వెర్షన్ మూవీ కూడా టాప్ 10లో ట్రెండ్ అవుతుండటం విశేషం. ఇది ఏడో స్థానంలో దూసుకుపోతుంది.
మూడో స్థానంలో అనుపమా పరమేశ్వరన్ మరీచిక
ఇక ప్రైమ్‌లో మూడో స్థానంలో అనుపమా పరమేశ్వరన్ నటించిన `మరీచిక` మూవీ ఉంది. రెజీనా, విరాజ్ అశ్విన్ నటించిన ఈ మూవీకి సతీష్ కాశెట్టి దర్శకత్వం వహించారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లో ఏమాత్రం ఆట్టుకోలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతోంది. టాప్ 3లో ట్రెండ్ అవుతుంది. దీంతోపాటు టాప్ 4లో హిందీ మూవీ గిన్నీ వెడ్స్ సన్నీ 2, ఐదో స్థానంలో హాలీవుడ్ మూవీ `యువర్ ఫాల్ట్ లండన్` ట్రెండ్ అవుతున్నాయి.
ఆరో స్థానంలో అడవి శేష్ డెకాయిట్
ఇక ఆరో స్థానంలో తెలుగు చిత్రం రచ్చ చేస్తోంది. అదే అడివి శేష్ హీరోగా నటించిన `డెకాయిట్`. మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన చిత్రమిది. ఇందులో అనురాగ్ కశ్యప్, ప్రకాష్ రాజ్, సునీల్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. శానీల్ డియో దర్శకత్వం వహించారు. ఇది థియేటర్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ ఓటీటీలో మాత్రం మంచి ఆదరణ పొందుతోంది. గత నెల రోజులుగా ఇది టాప్ 10లో ట్రెండ్ అవుతుండటం విశేషం.
8వ స్థానంలో కార్మేని సెల్వం
ఎనిమిదో స్థానంలో ఫ్యామిలీ మూవీ `కార్మేని సెల్వం` ఉంది. సముద్రఖని, గౌతమ్ మీనన్ వంటి వారు నటించిన ఈ సినిమా ప్రైమ్‌లో టాప్ 8లో ఉంది. 9వ స్థానంలో `సెకండ్ కేస్ ఆఫ్ సీతారామ్` మూవీ దూసుకుపోతుంది. ఇక జ్యోతిక, సోనాక్షి సిన్హా కలిసి నటించిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ `సిస్టెమ్` పదో స్థానంలో ట్రెండ్ అవుతుంది. ఇలా మొత్తంగా ఆరు సౌత్ మూవీస్ ప్రైమ్‌లో టాప్ 10లో ట్రెండ్ అవుతుండటం విశేషం.

