- Home
- Entertainment
- ప్రేయసి దీప్తి సునయనతో బిగ్ బాస్ షణ్ముఖ్ రొమాంటిక్ పిక్స్... వీళ్ళ ప్రేమ కథ ఇంకా రొమాంటిక్!
ప్రేయసి దీప్తి సునయనతో బిగ్ బాస్ షణ్ముఖ్ రొమాంటిక్ పిక్స్... వీళ్ళ ప్రేమ కథ ఇంకా రొమాంటిక్!
సినిమా స్టార్స్ రేంజ్ పాపులారిటీ కలిగివున్నారు యూట్యూబర్స్ షణ్ముఖ్ జస్వంత్, దీప్తి సునయన. కలిసి అనేక షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో లవ్ బర్డ్స్ గా కనిపించిన ఈ జంట నిజజీవితంలో కూడా ప్రేమికులే.

Bigg boss సీజన్ 5 కంటెస్టెంట్ గా హౌస్ లో కొనసాగుతున్న షణ్ముఖ్ ఈ విషయాన్ని స్వయంగా ఒప్పుకున్నారు. తాము దీప్తి సునయనను ప్రేమిస్తున్నట్లు వెల్లడించారు. వీళ్ల మధ్య సంథింగ్ సంథింగ్ అని, ఆన్ స్క్రీన్ రొమాన్స్ చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది.
ముఖ్యంగా Deepthi, షణ్ముఖ్ అంటే విపరీతమైన ప్రేమను కనబరుస్తారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కారణంగా షణ్ముఖ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కలిసి జరుపుకునే ఛాన్స్ లేకుండా పోయింది. దీనితో సునయన అన్నపూర్ణ స్టూడియోస్ కి వెళ్లి షణ్ముఖ్ బర్త్ డే సెలెబ్రేట్ చేశారు. ఈ వీడియో వైరల్ గా మారింది.
ఇంస్టాగ్రామ్ లో హ్యాపీ బర్త్ డే విషెష్ చెప్పిన దీప్తి.. ఐ లవ్ యు షన్ను.. ఫర్ ఎవర్ అంటూ కామెంట్ పెట్టారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు దీప్తి, షణ్ముఖ్ మధ్య ఎంత ఘాటు ప్రేమ ఉన్నదో.
సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండే Shanmukh jaswanth, దీప్తి రొమాంటిక్ ఫోటోలు పంచుకుంటూ ఉంటారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా షణ్ముఖ్ ఫైనల్ కి చేరి అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. కాబట్టి మరో రెండు నెలలు షణ్ముఖ్ ని దీప్తి కలిసే అవకాశం లేదు.
లేటెస్ట్ గా వీరిద్దరూ కలిసి మలుపు అనే సిరీస్ లో నటించారు. ఈ సిరీస్ ప్రోమోలు బాగా ఆకట్టుకున్నాయి. మరోవైపు దీప్తి సునయన సైతం బిగ్ బాస్ షోలో పాల్గొన్నారు. ఆమె బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టెంట్ గా కొన్ని వారాలు హౌస్ లో ఉన్న విషయం తెలిసిందే.
దీప్తి మంచి నటి కంటే కూడా బెస్ట్ డాన్సర్. బిగ్ బాస్ షో వేదికగా ఆమె డాన్సింగ్ స్కిల్స్ మరింత ఎలివేట్ అయ్యాయి. ఛాన్స్ దొరికిన ప్రతిసారి హౌస్ లో కిరాక్ స్టెప్స్ తో పిచ్చెక్కించేది దీప్తి.
Also read నయనతారకు మొదట చెట్టుతో పెళ్లి ? విగ్నేష్ కు ఏమీ కాకూడదనే..
Also read శృంగారం అనే పదం బూతు కాదు.. జనాలు దాని గురించి మాట్లాడుకోవాలి, దంగల్ బ్యూటీ సంచలనం