హఠాత్తుగా మరణించిన బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్ ఎంతమంది ఉన్నారో తెలుసా?
ఈమధ్య ఇండియాన ఫిల్మ్ ఇండస్ట్రీలో నటీనటుల మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ కూడా ఉన్నారు. బిగ్ బాస్ తో ఫేమస్ అయ్యి, ఆకస్మికంగా మరణించిన స్టార్స్ ఎవరో తెలుసా?
- FB
- TW
- Linkdin
Follow Us

కాంటా లగా గుర్తింపు పొందిన గర్ల్ షెఫాలీ జరివాలా (Shefali Jariwala), 42 ఏళ్ల వయసులో హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఆమె బిగ్ బాస్ 13 సీజన్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె మరణం వెనకాల కారణాలపై స పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. షెఫాలీకి గతంలో డిప్రెషన్, ఎపిలెప్సీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు సమాచారం.
అయితే ఆమె మరణంతో దేశవ్యాప్తంగా బిగ్ బాస్ షో ప్రస్తావన పెరిగింది. ఎందుకంటే బిగ్ బాస్ షోలో పాల్గొన్న పలువురు నటీనటులు చాలామంది సడెన్ మరణించారు. ఇది యాదృశ్చికమే అయినా ఆడియన్స్ లో మాత్రం ఓ చర్చ కొనసాగుతోంది. ఇంతకీ బిగ్ బాస్ లో పార్టిస్పేట్ చేసి ఫేమస్ అయ్యి, హాఠాత్తుగా మరణించిన తారలు ఎవరంటే?
సిద్ధార్థ్ శుక్లా బిగ్ బాస్ హిందీ 13 విజేత. 2021లో 40 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ లో బాగా ఫేమస్ అయిన ఈ నటుడు, బాలీవుడ్ తో పాటు సౌత్ ఆడియన్స్ అభిమానాన్ని కూడా సంపాదించాడు. కాని ఆయన ఆకస్మిక మరణం అందరికి షాక్ అని చెప్పాలి. శుక్లాకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది.
ప్రత్యూషా బెనర్జీ బిగ్ బాస్ హిందీ 7 కంటెస్టెంట్. 2016లో ఆత్మహత్య చేసుకుంది. టీవీ కార్యక్రమాలతో ప్రత్యూషా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి పేరు ఉంది. కాని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఇక స్వామి ఓం కూడా హిందీ బిగ్ బాస్ 10 సీజన్ లో కంటెస్టెంట్ అయితే ఆయన కాంట్రవర్సీలు క్రియేట్ చేసిన కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నాడు. 2021లో కోవిడ్-19 కారణంగా ఆయన చనిపోయాడు, ఇక సోనాలీ ఫోగట్ బిగ్ బాస్ హిందీలో 14 వ సీజన్ లో పార్టిసిపెంట్, 2023లో 42 ఏళ్ల వయస్సులో ఆమె సడెన్ గా గుండెపోటుతో మరణించింది.
ఇక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో కూడా మరణించిన వారు ఉన్నారు. వారిలో తెలుగు నుంచి ఇద్దరు కంటెస్టెంట్ మరణించారు. అందులో కత్తి మహేష్ బిగ్ బాస్ సీజన్ 1 పార్టిసిపెంట్, 2021లో రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలు అయ్యారు. చెన్నైలోని ఓ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటూ మరణించాడు.
ఇక తెలుగుతో పాటు మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన సూర్యకిరణ్ కూడా అనారోగ్యంతో మరణించారు. ఆయన హీరోయిన్ కళ్యాణి భర్త. అంతే కాదు ప్రముఖ దర్శకుడు కూడా. 2024 మార్చి 11న చెన్నైలో అనారోగ్యంతో మరణించాడు.కిరణ్ పచ్చ కామెర్లు, గుండెపోటుతో చనిపోయారు. సూర్యకిరణ్, ‘సత్యం’, ‘ధన 51’ వంటి సినిమాలను డైరెక్ట్ చేశాడు. బాలనటుడిగా 200కు పైగా చిత్రాల్లో నటించాడు.
సోమదాస్ చాతన్నూర్ మలయాళ నటుడు. మాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 1 పోటీదారు, 2021లో కోవిడ్ కారణంగా మరణించాడు.ఇక కన్నడ పరిశ్రమకు చెందిన నటి జయశ్రీ రామయ్య, బిగ్ బాస్ కన్నడ సీజన్ 3 లో పాల్గొన్న నటి, 2020లో మానసిక సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. గుండెపోటు, ఆత్మహత్య, కోవిడ్-19, రోడ్డు ప్రమాదం వంటి వివిధ కారణాల వల్ల ఈ వ్యక్తులు మరణించారు.