- Home
- Entertainment
- 40 కోట్లు రెమ్యునరేషన్, 700 కోట్లకుపైగా ఆస్తి ఉన్న ఏకైక ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా?
40 కోట్లు రెమ్యునరేషన్, 700 కోట్లకుపైగా ఆస్తి ఉన్న ఏకైక ఇండియన్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఏ ఫీ మెయిల్ యాక్టర్ కూడా అందుకోలేని రెమ్యునరేషన్ ను అందుకుంటోంది ఓ హీరోయిన్. అంతే కాదు వందల కోట్ల ఆస్తితో రికార్డ్ క్రియేట్ చేసి, మరో భారీ ప్రాజెక్ట్ లో భాగం అయిన గ్లోబల్ బ్యూటీ ఎవరో తెలుసా?

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా? మన హీరోయిన్లకు హాలీవుడ్ మాదిరిగా పెద్దగా రెమ్యునరేషన్లు ఉండవు. హీరోలు తీసుకునేదానితో పోలిస్తే 20 శాతం కూడా ఇవ్వరు. కాని ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతుంది.
డిమాండ్ చేస్తున్న హీరోయిన్లు
బాలీవుడ్ హీరోయిన్లు అది కూడా 40 ఏళ్లు దాటిన దీపికా పదుకునే లాంటి సీనియర్ హీరోయిన్లు కూడా 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇక సౌత్ తో నయనతార, త్రిష, సమంత లాంటి సీనియర్ తారలు కూడా 10 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నాు. ఈక్రమంలో ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో టాప్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ గా ప్రియాంక చోప్రా రికార్డ్ క్రియేట్ చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ తో పాటు బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆమె మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ SSMB29లో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం ఆమె దాదాపు 30 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు బాలీవుడ్ మీడియా రిపోర్టులు పేర్కొన్నాయి. ఇది ఇండియన్ సినిమా చరిత్రలో ఒక హీరోయిన్‌కు చెల్లించిన అత్యధిక రెమ్యునరేషన్‌గా నిలిచింది.
గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన ప్రియాంక చోప్రా
సినిమా కెరీర్‌ను స్లోగా ప్రారంభించిన ప్రియాంక చోప్రా, తన టాలెంట్, గ్లామర్, సినిమా సెలక్షన్‌లతో చాలా తక్కువ కాలంలోనే బాలీవుడ్‌లో స్టార్ గా ఎదిగింది. ఇండస్ట్రీలో తన స్థానాన్ని పటిష్టం చేసుకుంది. ఆమె యూనిక్ యాక్టింగ్ స్టైల్‌తో ప్రతీ సినిమాకు ప్రత్యేకత తీసుకొచ్చింది. ఈ గుర్తింపు కేవలం బాలీవుడ్ స్థాయిలోనే ఆగిపోకుండా, గ్లోబల్‌గా కూడా ఆమె ప్రభావం చూపించింది. ఆమె నటించిన హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఇంటర్నేషనల్ ఈవెంట్‌ల వల్ల ప్రియాంక పేరు ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది.
మహేష్ బాబు సినిమాతో తిరిగి బిగ్ స్క్రీన్‌పై ప్రియాంక
ప్రియాంక 2019లో విడుదలైన ది స్కై ఈజ్ పింక్ తర్వాత పెద్ద తెరపై కనిపించలేదు. అయితే, ప్రస్తుతం ఆమె మహేష్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 అనే ప్రాజెక్ట్ ద్వారా మళ్లీ సినిమాల్లోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రం కోసం ఆమె అడిగినట్టుగా 30 కోట్ల రెమ్యునరేషన్ అందించబోతున్నట్టు సమాచారం. అయితే అంతకు ముందే ఆమె అంతకు మించి రెమ్యునరేషన్ అందుకుని రికార్డ్ క్రియేట్ చేసింది.
అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న హీరోయిన్ ఎవరు?
ఇండియాన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. హీరోలు తీసుకునే వాటిలో 20 శాతం కూడా హీరోయిన్లకు ఇవ్వరు. కాని ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయి. హీరోయిన్లు కూడా కోట్లు డిమాండ్ చేస్తున్నారు. నిర్మాతలు కూడా వారి స్థాయిని బట్టి అడిగినంతా ఇచ్చేందుకు సై అంటున్నారు. సౌత్ లో కూడా హీరోయిన్ల రెమ్యునరేషన్ 10 కోట్లు దాటింది.
ఇక బాలీవుడ్ విషయానికి వస్తే.. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ‘కల్కి 2898 AD’ సినిమాలో నటించి రూ.20 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంది. ఆలియా భట్ ఒక్కో సినిమాకు సుమారు రూ.15 కోట్లు అందుకుంటుండగా, కరీనా కపూర్, కత్రినా కైఫ్, కియారా అద్వానీ, నయనతార, సమంత తదితరులు రూ.10 కోట్ల వరకూ వసూలు చేస్తున్నారు.
ప్రియాంక చోప్రా టాప్ రెమ్యునరేషన్ రికార్డ్
ఇక ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుని రికార్డ్ క్రియేట్ చేసింది ప్రియాంక చోప్రా. ఇండియన్ సినిమా కాకపోయినా.. పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిన అమెజాన్ ప్రైమ్ వీడియో సిరీస్ ‘సిటాడెల్’ కోసం ప్రియాంక చోప్రా సుమారు $5 మిలియన్లు అంటే దాదాపు రూ.41 కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకున్నట్లు సమాచారం. ఆ వెబ్ సిరీస్ మొత్తం రన్‌టైమ్ 6 గంటలపాటు ఉన్నా, ఆమెకు చెల్లించిన మొత్తం చాలా పెద్దది. ఈరకంగా రెమ్యునరేషన్ విషయంలో రికార్డ్ క్రియేట్ చేసింది ప్రియాంక చోప్రా.
ప్రియాంక ఆస్తుల విలువ ఎంత?
ప్రియాంక చోప్రా హాలీవుడ్ కు వెళ్ళక ముందు కూడా భారీగా ఆస్తులు కూడబెట్టింది. ఇక అక్కడికి వెళ్లిన తరువాత కూడా చేతి నిండా సంపాదిస్తుంది గ్లోబల్ బ్యూటీ. ప్రస్తుతం ప్రియాంక ఆస్తుల విలువ 700 కోట్లకు పైనే ఉంటుందని సమాచారం.
ఆమె భర్త, ప్రముఖ అమెరికన్ సింగర్ నిక్ జోనస్ నెట్‌వర్త్ సుమారు రూ.666 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. ఇక వీరిద్దరి ఆస్తులు కలుపుకుని 1300 కోట్ల వరకూ ఉంటాయి.ఇలా చూసుకుంటే ఆస్తి పరంగా కూడా ప్రియాంక చోప్రా ఇండియాన్ హీరోయిన్లు అందుకోలేని స్థాయిలో ఉంది. అందుకే ఆమె గ్లోబల్ స్టార్ గా మారిపోయింది.
ప్రియాంక చోప్రా ఇప్పుడు కేవలం హీరోయిన్‌గా కాకుండా, గ్లోబల్ లెవల్‌లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే ఇండియన్ ఫీమేల్ యాక్టర్‌గా ఎదిగారు. SSMB29 ప్రాజెక్ట్‌తో ఆమె మరోసారి తన స్టార్డమ్‌ను నిరూపించుకోబోతోంది. ఈసినిమా ప్రపంచ స్థాయిలో రికార్డ్ లు క్రియేట్ చేస్తే.. ప్రియాంక చోప్రా డిమాండ్ హాలీవుడ్ లో ఇంకాస్త పెరగడం పక్కా.