MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Ntr: నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్‌ స్ట్రాంగ్‌ స్టేట్‌మెంట్‌? తారక్‌ ఎమోషనల్‌ కామెంట్‌కి కారణం ఇదేనా?

Ntr: నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్‌ స్ట్రాంగ్‌ స్టేట్‌మెంట్‌? తారక్‌ ఎమోషనల్‌ కామెంట్‌కి కారణం ఇదేనా?

జూ ఎన్టీఆర్‌ చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అవుతున్నాయి. ఆయన నందమూరి ఫ్యామిలీని టార్గెట్‌ చేస్తూ కామెంట్‌ చేశారని అంటున్నారు. ఇదిప్పుడు పెద్ద రచ్చ అవుతుంది.

2 Min read
Author : Aithagoni Raju
Published : Sep 30 2026, 01:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ సందడి
Image Credit : Asianet News

డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ సందడి

జూ ఎన్టీఆర్‌ ప్రస్తుతం `డ్రాగన్‌` మూవీలో నటిస్తున్నాడు. షూటింగ్‌లో భాగంగా ఆయన భుజానికి గాయం కావడంతో రెస్ట్ లో ఉన్నారు. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఫహద్‌ ఫాజిల్‌ హీరోగా నటించిన `డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌` చిత్ర ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి గెస్ట్ గా హాజరయ్యారు. దీనికి రాజమౌళి కొడుకు కార్తికేయ నిర్మాత. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఈవెంట్‌లో తారక్‌ సందడి చేశారు. గాయం తర్వాత తొలిసారి బయటకు రావడంతో అభిమానులు భారీగా తరలి వచ్చారు. ఎన్టీఆర్‌ ని చూసేందుకు, ఆయన స్పీచ్‌ వినేందుకు తహతహలాడారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎన్టీఆర్‌ ఫస్ట్ సినిమా అనుభవాలు
Image Credit : Asianet News

ఎన్టీఆర్‌ ఫస్ట్ సినిమా అనుభవాలు

అభిమానులను కూడా ఎన్టీఆర్‌ అంతే బాగా ఆకట్టుకున్నారు. వారి గొప్పతనం చెప్పారు. వాళ్లు తనకు ఎంత ముఖ్యమో వెల్లడించారు. అభిమానులు లేకపోతే తాను లేననే విషయాన్ని స్పష్టం చేశారు. అదే సమయంలో వాళ్లే తన కుటుంబంగా వర్ణించారు ఎన్టీఆర్‌. కాకపోతే ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి. తన మొదటి సినిమా ఓపెనింగ్‌ సమయంలో తన వెంట ఫ్యామిలీ ఎవరూ లేరని చెప్పాడు. తన మొదటి సినిమా `నిన్ను చూడాలని` మూవీకి రామోజీరావు నిర్మాత అని, ఆర్‌ఎఫ్‌సీలో ఓపెనింగ్‌ జరిగితే తన అమ్మ రాలేదు, నాన్న రాలేదు, నీ పాట్లు నువ్వే పడు అని చెప్పారని, ఆ సమయంలో తనతోడుగా ఎవరైనా ఉంటే బాగుండు అనిపించిందట. ధైర్యం చెప్పేవాళ్లు లేక బాధపడ్డానని తెలిపారు ఎన్టీఆర్‌.

35
అభిమానులు, జక్కన్న ఫ్యామిలీనే తన కుటుంబం అంటూ తారక్‌ ఎమోషనల్‌
Image Credit : Asianet News

అభిమానులు, జక్కన్న ఫ్యామిలీనే తన కుటుంబం అంటూ తారక్‌ ఎమోషనల్‌

తన బాధని దేవుడు విన్నాడేమో మీ అందరిని నాకు ఇచ్చాడు, మీ అందరిని నా ఫ్యామిలీని చేశాడని అభిమానులను ఉద్దేశించి చెప్పాడు తారక్‌. ఆ తర్వాత జక్కన్న ఫ్యామిలీని ఇచ్చాడని, కీరవాణి, వల్లి, రమా రాజమౌళి ఇలా పెద్ద కుటుంబాన్ని ఇచ్చాడని, అదే సమయంలో కార్తికేయ వంటి తమ్ముడిని ఇచ్చాడని చెప్పాడు ఎన్టీఆర్‌. ఈ క్రమంలో జక్కన్న ఫ్యామిలీపై ప్రశంసలు కురిపించారు. తనకు బాధ అయినా, సంతోషం అయినా వారితోనే అనేలా ఆయన వెల్లడించారు. అభిమానుల వల్లే తాను ఈస్థాయికి వచ్చానని, రాజమౌళి ఫ్యామిలీ తనకు బ్యాక్‌బోన్‌లా ఉన్నారని ఎన్టీఆర్‌ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్‌ అయ్యారు.

45
నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్‌ స్ట్రాంగ్‌ స్టేట్‌మెంట్‌
Image Credit : Asianet News

నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్‌ స్ట్రాంగ్‌ స్టేట్‌మెంట్‌

ఎన్టీఆర్‌ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఎన్టీఆర్‌ తన స్పీచ్‌లో నందమూరి ఫ్యామిలీ తన వెంట లేదనే విషయాన్ని ఆయన చెప్పకనే చెప్పినట్టుగా ఉంది. తన స్వతహాగా ఎదిగాననే సందేశాన్ని ఇచ్చారు. అప్పుడు తాను ఒంటరే, ఇప్పుడు కూడా ఒంటరనే అనే విషయాన్ని ఎన్టీఆర్‌ చెప్పదలుచుకున్నాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఇటీవల కాలంలో నందమూరి ఫ్యామిలీకి, ఎన్టీఆర్‌కి మధ్య కొంత గ్యాప్‌ కనిపిస్తుంది. బాలయ్యకి, తారక్‌ మధ్య విభేదాలున్నట్టు వార్తలు వస్తున్నాయి. నందమూరి ఫ్యామిలీ తారక్‌ని దూరంపెడుతుందనే పుకార్లు ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా తారక్‌ చేసిన కామెంట్లు మరింత ఇంట్రెస్టింగ్‌గా మారాయి. అదే సమయంలో ఆయా పుకార్లకి బలం చేకూరేలా ఉన్నాయి.

55
ఎన్టీఆర్‌పై ట్రోల్స్
Image Credit : Asianet News

ఎన్టీఆర్‌పై ట్రోల్స్

అదే సమయంలో తారక్‌ కామెంట్స్ పై టీడీపీ అభిమానులు, ట్రోలర్స్ రెచ్చిపోతున్నారు. నందమూరి అభిమానులు కూడా కౌంటర్‌ ఇస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ మెంబర్‌ కావడం వల్లే ఆ రోజు రామోజీరావు మీకు ఆఫర్‌ ఇచ్చారని, తొలి ఛాన్స్ రావడం వెనుక ఉన్నదే వాళ్లు అని అంటున్నారు. నందమూరి ట్యాగ్‌ వల్లే ఈ స్థాయికి వచ్చావని, లేకపోతే ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదని, కానీ ఇప్పుడు ఇలా మాట్లాడటం సరికాదు అంటున్నారు. రకరకాల కామెంట్లతో ఎన్టీఆర్‌ని ఆడుకుంటున్నారు ట్రోలర్స్. మొత్తంగా ఎన్టీఆర్‌ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో, నందమూరి ఫ్యామిలీలో ఆసక్తికరంగా, చర్చనీయాంశంగా మారాయని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
ఎస్.ఎస్. రాజమౌళి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajamouli: 3 నెలల్లో సినిమా తీస్తా అని మాటిచ్చి... రెండేళ్లు సాగదీసిన రాజమౌళి, రమా రాజమౌళి చెప్పిన సీక్రెట్..
Recommended image2
Venkatesh: వెయ్యి రూపాయలు ఇస్తేనే యాక్ట్ చేస్తా.. సొంత తండ్రికే కండీషన్‌ పెట్టిన వెంకటేష్‌
Recommended image3
Nagarjuna: శోభనం పాటలో 'రాముడు', శివ శివా.. తప్పు అర్థం రాకుండా లిరిసిస్ట్ ఎలా రాశారో తెలుసా, హ్యాట్సాఫ్
Related Stories
Recommended image1
Uday Kiran: చిరంజీవి అడ్డుపడుతున్నాడంటూ ఉదయ్‌ కిరణ్‌ ఆవేదన.. లవర్‌ బాయ్‌ నిజస్వరూపం బయటపెట్టిన నిర్మాత
Recommended image2
Venkatesh: వెయ్యి రూపాయలు ఇస్తేనే యాక్ట్ చేస్తా.. సొంత తండ్రికే కండీషన్‌ పెట్టిన వెంకటేష్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved