MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Moringa Powder: మునగాకు పొడిని ఇలా తీసుకుంటే.. మీ వయసు పదేళ్లు తగ్గడం ఖాయం, ఎలా వాడాలంటే..!

Moringa Powder: మునగాకు పొడిని ఇలా తీసుకుంటే.. మీ వయసు పదేళ్లు తగ్గడం ఖాయం, ఎలా వాడాలంటే..!

Moringa Powder: వయసు పెరుగుతున్నా కూడా అందంగా కనిపించాలి అంటే.. ఖరీదైన క్రీములు వాడాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ, రోజూ మునగాకు పొడిని తీసుకున్నా కూడా అందంగా మెరిసిపోవచ్చు.

2 Min read
Author : ramya Sridhar
Published : Sep 30 2026, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Moringa Powder
Image Credit : Getty

Moringa Powder

అందంగా కనిపించాలి అనే కోరిక చాలా మందిలో ఉంటుంది. దానికోసమే, మార్కెట్లో దొరికే ఏవో క్రీములు, సీరమ్స్ కొని ముఖానికి పూసేస్తూ ఉంటారు. అయితే, అందం కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా కూడా.. అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. కేవలం చర్మ సౌందర్యమే కాకుండా, జుట్టు ఒత్తుగా పెరగాలంటే దాని కోసం మునగాకు పొడి వాడితే చాలు. అయితే, ఈ మునగాకు పొడిని ఎలా తీసుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. మరి, మునగాకు పొడి ఏ టైమ్ లో తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? దేనితో కలిపి తీసుకోవాలి? అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మునగాకు పొడిని ఎలా తీసుకోవాలి..?
Image Credit : Getty

మునగాకు పొడిని ఎలా తీసుకోవాలి..?

మునగాకు పొడిని ప్రతిరోజూ ఉదయాన్నే తీసుకోవాలి. డైరెక్ట్ గా ఈ పొడిని తీసుకుంటే రుచికి చేదుగా అనిపిస్తుంది. తీసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి.. దీనిని ఉసిరిపొడితో కలిసి తీసుకోవాలి. అది కూడా.. ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ ఉసిరి పొడి, అర టీ స్పూన్ మునగాకు పొడి వేసుకొని బాగా కలిపి.. తీసుకోవాలి. రెగ్యులర్ గా ఈ డ్రింక్ ని ప్రతిరోజూ ఉదయాన్నే తాగడం వల్ల... మీ చర్మం స్మూత్ గా మారుతుంది. వయసు తగ్గినట్లుగా, యవ్వనంగా కనిపిస్తారు.

33
మునగాకు వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు...
Image Credit : Getty

మునగాకు వాటర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు...

మొటిమలకు చెక్: మునగాకులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలను తగ్గించి, సున్నితమైన చర్మాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి.

గ్లోయింగ్ స్కిన్ , కొల్లాజెన్: విటమిన్ సి, అమైనో ఆమ్లాలు చర్మానికి దృఢత్వాన్ని, యవ్వన కాంతిని ఇస్తాయి.

ఒత్తైన జుట్టు: ఇందులో ఉండే జింక్, ఐరన్ , ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు జుట్టు కుదుళ్లను బలపరిచి, కురులు రాలడాన్ని అడ్డుకుంటాయి.

ఉసిరితో అందమైన ఛాయ సొంతం.. రక్త శుద్ధి, మెరుపు: ఉసిరి శరీరాన్ని లోపల నుండి డిటాక్సిఫై చేసి, చర్మానికి నేచురల్ రేడియంట్ గ్లోను ఇస్తుంది.

ముడతలు మాయం: కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా చర్మం ముడతలు పడకుండా, యవనంగా మెరుస్తుంది. ఉసిరి క్రమం తప్పకుండా తీసుకుంటే జుట్టు ఒత్తుగా, నల్లగా, షైనీగా మారుతుంది.

మునగాకు, ఉసిరి ఇలా కూడా తీసుకోవచ్చు... 3 టేబుల్ స్పూన్ల మునగాకు పొడి, 3 స్పూన్ల పసుపు, 3 స్పూన్ల అల్లం పొడి, అర టీస్పూన్ మిరియాల పొడి, తేనె ఉంటే సరిపోతుంది. ముందుగా, వీటన్నింటినీ కలిపి ముద్దలా చేసి, చిన్న చిన్న మాత్రల సైజులో ఉండలు చేసుకోవాలి. వీటిని రెండు రోజులు నీడలో ఆరబెడితే అద్భుతమైన హోమ్‌మేడ్ మొరింగా టాబ్లెట్లు సిద్ధం.

దీనికి తోడు తగినన్ని నీళ్లు తాగుతూ, ప్రశాంతంగా నిద్రపోతే.. ఎలాంటి కెమికల్స్ అవసరం లేకుండానే మీ అందం రెట్టింపు అవ్వడం ఖాయం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Beach Trip Packing: ఈ దసరా హాలిడేస్ కు బీచ్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? కంగారులో ఇవి పెట్టడం మర్చిపోవద్దు
Recommended image2
Gold Bangles: డైలీవేర్ కోసం బంగారు గాజుల డిజైన్లు ఇవే!
Recommended image3
Gold Haaram: చీరలపైకి అదిరిపోయే లాంగ్ గోల్డ్ హారం డిజైన్లు చూసేయండి
Related Stories
Recommended image1
Instant Curd: ఇంట్లో పెరుగు అయిపోయిందా? 15 నిమిషాల్లో పాలను పెరుగులా మార్చే టెక్నిక్ ఇది
Recommended image2
Fresh Fish Vs Dry Fish: తాజా చేపలు, ఎండు చేపలు ఏది తింటే మంచిది? ఎందులో ఎక్కువ పోషకాలు ఉంటాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved