ఎలిమినేషన్‌లో ఊహించని ట్విస్ట్.. బిగ్ బాస్ హౌజ్ నుంచి దివ్వెల మాధురి ఔట్
బిగ్ బాస్ తెలుగు 9 ఎనిమిదో వారంలో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎలిమినేషన్‌కి సంబంధించి చివరి నిమిషంలో లెక్కలు తారుమారయ్యాయి. ఫైర్ బ్రాండ్ ఎలిమినేట్ అయ్యిందట.

బిగ్ బాస్ తెలుగు 9 ఎలిమినేషన్‌లో ట్విస్ట్
బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్ ప్రారంభమై ఎనిమిది వారాలు అవుతుంది. 15 మంది కంటెస్టెంట్లతో సెప్టెంబర్ 7న ఈ షో ప్రారంభమైన విషయం తెలిసిందే. మధ్యలో దివ్య మిడ్ వీక్ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా మరో ఆరుగురు కంటెస్టెంట్లు హౌజ్‌లోకి వచ్చారు. అప్పటికే ఐదుగురు కంటెస్టెంట్లు హౌజ్‌ని వీడారు. ఇప్పటి వరకు హౌజ్ నుంచి ప్రియా శెట్టి, శ్రష్టి వర్మ, రమ్య మోక్ష, హరిత హరీష్, మర్యాద మనీష్, ఫ్లోరా సైనీ, శ్రీజ వంటి వారు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఎనిమిదవ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం మాధురి, తనూజ, సంజనా, రీతూ చౌదరీ, గౌరవ్, కళ్యాణ్, పవన్, రాము రాథోడ్ నామినేషన్‌లో ఉన్నారు.
8వ వారం ఎలిమినేట్ అయ్యింది గౌరవ్ కాదా?
ఆన్‌లైన్ ఓటింగ్ ప్రకారం గౌరవ్ లీస్ట్ లో ఉన్నారు. దీంతో ఆయన ఈ వారం ఎలిమినేషన్ పక్కా అని అంతా అనుకున్నారు. ఆయనతోపాటు దివ్వెల మాధురి కూడా లీస్ట్ లోనే ఉంది. దీంతో ఈ ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని, అందులో గౌరవ్‌కే ఎక్కువ ఛాన్స్ ఉందని అన్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా లెక్కలు మారిపోయాయి. గౌరవ్ కాకుండా మాధురిని ఎలిమినేట్ చేశారట. బిగ్ బాస్ కి వచ్చిన ఓటింగ్ ప్రకారం మాధురి లీస్ట్ లో ఉందని, దీంతో ఆమెని ఎలిమినేట్ చేసినట్టు సమాచారం. ఈ ఎలిమినేషన్ ప్రక్రియ కూడా ఇప్పుడే పూర్తయ్యిందట. మొత్తంగా ఈ వారం ఫైర్ బ్రాండ్ హౌజ్‌ని వీడినట్టు తెలుస్తోంది.
దివ్వెల మాధురి ఎలిమినేషన్‌తో షాక్
దివ్వెల మాధురి ఎలిమినేషన్ అందరికి షాకిస్తుంది. అటు హౌజ్‌మేట్స్, ఇటు ఆడియెన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఆమెని అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా భావించారు. ఆమెని ఎలిమినేట్ చేసే అవకాశం ఉండదని భావించారు. కానీ అనూహ్యంగా ఆమెని హౌజ్ నుంచి పంపించడం ఆశ్చర్యపరుస్తుంది. తన ఫ్రెండ్ రమ్య మోక్ష గత వారమే ఎలిమినేట్ అయ్యింది. ఇప్పుడు మాధురి కూడా ఎలిమినేట్ కావడం గమనార్హం. అయితే మాధురి వైల్డ్ కార్డ్ ద్వారా ఐదో వారంలోనే బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వచ్చిన మూడో వారమే ఆమె హౌజ్‌ని వీడాల్సి వచ్చింది. వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన అయేషా జీనత్ కూడా అనారోగ్యంతో హౌజ్‌ని వీడింది. వచ్చీ రావడంతోనే బ్యాక్ టూ బ్యాక్ ముగ్గురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడం గమనార్హం. వీరే స్ట్రాంగ్ అండ్ క్రేజీ కంటెస్టెంట్లు అని అంతా భావించారు. కానీ వారే ఎలిమినేట్ కావడం షాకిస్తోంది.
రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన మాధురి, శ్రీనివాస్
ఇదిలా ఉంటే దివ్వెల మాధురి ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. ఆమె ఏపీ వైసీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి ఉంటూ వార్తల్లో నిలిచింది. పాపులర్ అయ్యింది, సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇటు మాధురి, అటు శ్రీనివాస్ తమ మొదటి పార్ట్‌నర్స్ నుంచి విడిపోయారు. వారిని దూరం పెట్టి, వీరు కలవడం విశేషం. అంతేకాదు ఒకరిపై ఒకరు ప్రేమని వ్యక్తం చేస్తూ ఆశ్చర్యపరిచారు. అదే సమయంలో చాలా ట్రోల్స్ కి గురయ్యారు. వీరిది ఫేక్ ప్రేమలంటూ చాలా మంది ట్రోల్ చేశారు. రాజకీయంగానూ విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా ఒకరికొకరు స్ట్రాంగ్ గా నిలబడ్డారు. ఆదర్శ జంటగా నిలుస్తున్నారు. వీరిద్దరు త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నట్టు సమాచారం.

