- Home
- Entertainment
- మహేష్ బాబులో అల్లు అర్జున్‌కి బాగా నచ్చిన విషయం ఏంటో తెలుసా? వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రతి సారి
మహేష్ బాబులో అల్లు అర్జున్‌కి బాగా నచ్చిన విషయం ఏంటో తెలుసా? వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రతి సారి
మహేష్ బాబు, అల్లు అర్జున్‌కి మధ్య కోల్డ్ వార్ ఉందనే టాక్ తరచూ వినిపిస్తుంటుంది. అయితే మహేష్ బాబులో తనకు బాగా నచ్చిన విషయాన్ని బయటపెట్టారు అల్లు అర్జున్. ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

అల్లు అర్జున్, మహేష్ ఫ్యాన్స్ మధ్య వార్
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందంటారు. ఫ్యాన్స్ మధ్య మాత్రం ఇలాంటి వార్ నిత్యం జరుగుతూనే ఉంటుంది. మహేష్ సినిమా విడుదలైనప్పుడు బన్నీ ఫ్యాన్స్ ట్రోల్ చేయడం, అల్లు అర్జున్ మూవీ విడుదల సమయంలో మహేష్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తుంటారు. ఇది చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. అయితే ఇటీవల ఆ వార్ కాస్త తగ్గింది. మరీ దారుణంగా ట్రోల్ చేసుకోవడం లేదు. కొందరు అభిమానులు ఇరువురి హీరోల సినిమాలకు అభినందనలు తెలియజేస్తున్నారు కూడా. ఏదేమైనా ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య వార్ ఉందనేది నిజం.
అల్లు అర్జున్‌కి విషెస్ చెప్పిన మహేష్
ఇదిలా ఉంటే మహేష్ బాబు, అల్లు అర్జున్ వ్యక్తిగతంగా మాత్రం బాగానే ఉంటారు. అడపాదడపా ఈవెంట్లలో, పార్టీల్లో కలుసుకున్నప్పుడు క్లోజ్‌గానే మూవ్ అవుతుంటారు. ఎప్పుడైనా స్టార్స్ బాగానే ఉంటారు. కానీ ఫ్యాన్స్ అనవసరంగా ఆవేశానికి గురవుతుంటారనేది నిజం. ఎందుకంటే `పుష్ప 2` సినిమా సమయంలో మహేష్ అభినందనలు తెలియజేస్తూ ట్వీట్ కూడా చేశారు. మహేష్ మూవీకి కూడా బన్నీ అభినందనలు తెలియజేశారు. బర్త్ డే సమయంలోనూ విషెస్ చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి.
మహేష్ బాబు బన్నీకి నచ్చేవిషయం
అయితే మహేష్ బాబు గురించి ఒక ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు అల్లు అర్జున్. మహేష్ కెరీర్‌కి సంబంధించి తనకు బాగా నచ్చిన విషయాన్ని వెల్లడించారు. `మహేష్‌లో నాకు పర్సనల్‌గా బాగా నచ్చే విషయం ఏంటంటే.. ఆయన కమ్ బ్యాక్స్ చాలా బాగుంటాయి. ఫెయిల్యూర్ తర్వాత ఆయన ఇచ్చే కామ్ బ్యాక్ చాలా బాగుంటుంది` అని బన్నీ వెల్లడించడం విశేషం. బాలయ్య హోస్ట్ గా చేసిన `అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే` షోలో బన్నీ ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మహేష్ ఫ్యాన్స్ వైరల్ చేయడం విశేషం.
మహేష్ బాబు కెరీర్ గురించి చూస్తే
`రాజకుమారుడు`తో హీరోగా పరిచయం అయిన మహేష్ బాబు `మురారి`తో హిట్ అందుకున్నారు. ఆ తర్వాత `టక్కరి దొంగ`, `బాబీ` చిత్రాలు డిజాస్టర్ అయ్యాయి. `ఒక్కడు`తో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తర్వాత `నిజం`, `నాని` వంటి ఫెయిల్యూర్స్ తర్వాత `అర్జున్` మంచి హిట్ అయ్యింది. `అతడు` సైతం మెప్పించింది. `పోకిరి`తో మరోసారి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. తిరుగులేని సూపర్ స్టార్ అయ్యారు. ఆ తర్వాత `సైనికుడు`, `అతిథి`, `ఖలేజా` వరుస ఫ్లాపుల తర్వాత `దూకుడు`తో బ్లాక్ బస్టర్ కొట్టారు మహేష్. `బిజినెస్ మ్యాన్`, `సీతమ్మ వాకిట్టో సిరిమల్లె` చెట్టు` బాగా ఆడాయి. ఆ తర్వాత `వన్ నేనొక్కడినే`, `ఆగడు` డిజాస్టర్స్. అనంతరం `శ్రీమంతుడు`తో మరో బిగ్గెస్ట్ హిట్‌ని అందుకున్నారు. మళ్లీ `బ్రహ్మోత్సవం`, `స్పైడర్` ఫ్లాప్. అనంతరం `భరత్ అనే నేను`, `మహర్షి`, `సరిలేరు నీకెవ్వరు` బాగానే ఆడాయి. `సర్కారు వారి పాట`, `గుంటూరు కారం` సరిగా ఆడలేదు.
రాజమౌళితో అంతర్జాతీయ స్థాయిలో మూవీ
ఇప్పుడు రాజమౌళితో `ఎస్‌ఎస్‌ఎంబీ29` చిత్రంలో నటిస్తున్నారు మహేష్ బాబు. దీన్ని గ్లోబల్ ఫిల్మ్ గా రూపొందిస్తున్నారు జక్కన్న. ఈ మూవీతో ఏకంగా అంతర్జాతీయ బాక్సాఫీసు మీద కన్నేశారు. భారీ స్థాయిలో దీన్ని రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు రాజమౌళి. ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సినిమా సాగుతుందని, ఇందులో ప్రపంచ సాహసికుడిగా మహేష్ కనిపిస్తారని సమాచారం. ఈ నెలలోనే ఈ మూవీ నుంచి టైటిల్, ఫస్ట్ లుక్, టీజర్ రాబోతుందట. ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇక బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో `ఏఏ22`లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది కూడా అంతర్జాతీయ ప్రాజెక్ట్ గా రూపొందుతుంది. సూపర్ హీరో నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని సమాచారం.