MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Dasari Narayana Rao: ఈ చిన్న మిస్టేక్‌తో వేల కోట్లు పోగొట్టుకున్న దాసరి నారాయణరావు.. ఆయన్ని మోసం చేసిందెవరు?

Dasari Narayana Rao: ఈ చిన్న మిస్టేక్‌తో వేల కోట్లు పోగొట్టుకున్న దాసరి నారాయణరావు.. ఆయన్ని మోసం చేసిందెవరు?

Dasari Narayana Rao: దర్శకరత్న దాసరి నారాయణ రావు ఒకప్పుడు తెలుగులో స్టార్‌ డైరెక్టర్‌గా వెలిగారు. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అంతేకాదు వేల కోట్లు సంపాదించారు. కానీ ఒక చిన్న మిస్టేక్‌ కారణంగా ఆయన మొత్తం పోగొట్టుకున్నారు. 

3 Min read
Author : Aithagoni Raju
Published : May 04 2026, 03:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జనం మెచ్చిన దర్శకుడు దాసరి
Image Credit : Pinterest

జనం మెచ్చిన దర్శకుడు దాసరి

దర్శకరత్న దాసరి నారాయణరావు టాలీవుడ్‌ని శాసించిన దర్శకుడు. అద్భుతమైన సినిమాలతోనే కాదు, తన ఆదిపత్యంతోనూ ఇండస్ట్రీని రూల్‌ చేశాడు. పేదవాడైనా, పెద్ద వాడైనా, ఏ సమస్య ఉన్న దాసరి పరిష్కరించేవారు. అదే సమయంలో మంచి సామాజిక అంశాలతో కూడిన సినిమాలు చేసి మెప్పించారు. జనం మెచ్చిన దర్శకుడిగా నిలిచారు. సామాజిక సమస్యలు, లింగ వివక్ష, కుల వివక్ష, రాజకీయ అవినీతి వంటి అంశాలపై ఎక్కువగా సినిమాలు తీసి సక్సెస్‌ అయ్యారు. ప్రజల్లో తన సినిమాలతో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వారిలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఇండస్ట్రీకి పెద్ద దిక్కు దాసరి నారాయణరావు
Image Credit : the indian express

ఇండస్ట్రీకి పెద్ద దిక్కు దాసరి నారాయణరావు

ఇక ఇండస్ట్రీలో కార్మికుల సమస్యలు, దర్శకుల గొడవలు, నిర్మాతల మధ్య ఇష్యూస్‌, థియేటర్‌ సమస్యలు, స్టార్స్ గొడవలు, వారి ఫ్యామిలీ గొడవలు ఇలా ఏదైనా తన వద్ద పరిష్కారం జరిగేవి. అందుకే ఆయన్ని అంతా పెద్ద దిక్కుగా భావించారు. ఆయన మరణం తర్వాత ఆ పెద్ద దిక్కు మిస్‌ అయ్యింది. ఆయన లోటు ఇంకా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో దాసరికి సంబంధించిన పలు షాకింగ్‌ విషయాలు బయటకు వస్తున్నాయి. ఆయన వేల కోట్ల ఆస్తులు పోగొట్టుకున్నారట. కొందరు మోసం చేశారట. దానికి కారణం దాసరి చేసిన మిస్టేకే అంటున్నారు. అదెలా అనేది చూస్తే..

Related Articles

Related image1
Thalapathy Vijay: అజిత్ సూపర్ హిట్ సినిమాలో విలన్‌గా విజయ్‌.. దళపతి డ్రీమ్‌ బయటపెట్టిన స్టార్‌ డైరెక్టర్‌
Related image2
TVK Vijay: చిరంజీవి, పవన్‌కి సాధ్యం కానిది విజయ్‌కి ఎలా సాధ్యం.. దళపతి సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే
35
దర్శకుడిగా బాగా సంపాదించిన దాసరి
Image Credit : our own

దర్శకుడిగా బాగా సంపాదించిన దాసరి

దాసరి నారాయణరావు దర్శకుడిగా సక్సెస్‌ అయ్యారు. ఓ దశలో ఆయన పీక్‌ లెవల్‌ని చూశారు. తిరుగులేని దర్శకుడిగా రాణించారు. ఒకే రోజు మూడు సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొన్నారు. ఉదయం ఓ మూవీ తీస్తే, మధ్యాహ్నం మరో మూవీ, రాత్రి ఇంకో సినిమా షూటింగ్‌ చేసేవారు. అవన్నీ హిట్‌ అయ్యేవి. హీరోలు కాదు, దర్శకులు కూడా ఇలా మూడు సినిమాలు చేయోచ్చని నిరూపించిన దర్శకుడు దాసరి. ఇలా ఆయన నుంచి ఏడాది దాదాపు ఐదు నుంచి పది సినిమాల వరకు వచ్చేది. దీంతో పారితోషికం రూపంలో బాగా సంపాదించారు. దీనికితోడు చాలా సినిమాలు సొంత బ్యానర్‌లో ఉండేవి. అవన్నీ ఆయన సొంతమే. దీనికితోడు ఆయన నటుడు కూడా. చాలా సినిమాల్లో నటుడిగా మెప్పించారు. పత్రికని నడిపించారు. కొన్ని వ్యాపారాలు కూడా పెట్టారు.

45
దాసరి చేసిన మిస్టేక్‌
Image Credit : our own

దాసరి చేసిన మిస్టేక్‌

కానీ దాసరి సంపాదించిన డబ్బు నిలవలేదు. అంతా తన చుట్టూ ఉన్నవాళ్లు కాజేశారు. దాసరి తన చుట్టూ ఉన్న వాళ్లనే బాగా నమ్మాడట. వాళ్లే డబ్బులు తీసుకొని ఎగ్గొట్టారు. కొందరు అధిక వడ్డీ వసూలు చేసి మోసం చేశారట. ఇంకోవైపు తన అకౌంట్స్ చూసుకోవడానికి ఇంట్లో వాళ్లు లేదు. ఇతరులను నమ్మడం వల్ల తప్పుడు లెక్కలు చూపించి అప్పులు చూపించారట. దీనికి కారణం దాసరినే. తనకు ఇద్దరు కొడుకులున్నారు. ఆయన ఏ రోజూ వాళ్లని పట్టించుకోలేదు. తన బిజీలో తాను ఉన్నాడు, దీంతో వాళ్లు జల్సాలకు పరిమితమయ్యారు. పెద్ద కొడుకు అమ్మాయితో లేచిపోయాడు, చిన్న కోడుకు జల్సా రాయుడిగా మారిపోయాడు. దీంతో ఇంట్లో బాధ్యతలు తీసుకునేవారే లేదు. అలా తాను సంపాదించినది మొత్తం ఇతరుల సొంతమైందని దర్శకుడు నందం హరిశ్చంద్రరావు వెల్లడించారు.

55
మోసం చేసింది వీళ్లే
Image Credit : our own

మోసం చేసింది వీళ్లే

దాసరికి వచ్చిన ఆదాయాన్ని చూసుకునే ఇంటిమనుషులు లేరని, దానివల్లే ఆయన ఆస్తులన్నీ దొంగలపాలయ్యాయని తెలిపారు. దాసరి తన భార్య పద్మకి ఆర్థికపరమైన అధికారం ఇవ్వలేదని, తన వద్దకు వచ్చిన వాటితోనే ఆమె ఆస్తులు కొనిపెట్టిందని తెలిపారు. అయితే దాసరి కొడుకులు మనీని మ్యానేజ్‌ చేసే స్థితిలో లేరు. పెద్ద కొడుకు అమ్మాయితో వెళ్లిపోయాడు, చిన్న కొడుకు జల్సాలకే పరిమితమయ్యాడు, బాధ్యతలు తీసుకోలేదు. దాసరి కూడా కొడుకులను పట్టించుకోకపోవడం వల్లే ఇదంతా జరిగిందని చెప్పారు. దాసరి తనకు వచ్చే సంపాదనని చూసుకునే బాధ్యతని తనకు నమ్మకమైన వారికి అప్పగించారు. వారిలో చాలా మంది మోసం చేశారు. ఎక్కువ బిల్లలు వేయడం, వడ్డీలు ఎక్కువ కట్టడం చేశారు. ఇక తన వద్ద ఫైనాన్స్ తీసుకున్నవాళ్లు ఎగొట్టడం, తాను ఫైనాన్స్ తీసుకుంటే ఎక్కువ వడ్డీలు కట్టడం ఇలా సంపాదించిన ఆస్తులన్నీ కరిగిపోయాయని, తన చుట్టూ ఉన్నవాళ్లే, తనకు నమ్మకమైన వాళ్లే, రోజూ గురువుగారు గురువుగారు అంటూ తిరిగివాళ్లే ఆయన మంచితనాన్ని ఆసరాగా తీసుకుని మోసం చేశారని, దాసరి సంపాదించిన దాంట్లో ఇప్పుడు మిగిలిన ఆస్తులు సగం కూడా ఉండవని తెలిపారు. ట్రీ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను పంచుకున్నారు. అలా ఇప్పుడు విలువతో పోల్చితే వేల కోట్లు దాసరిగారు కోల్పోయారని చెప్పొచ్చు.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image2
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Recommended image3
Vijayakanth: విజయ్ కోసం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నటించిన కెప్టెన్.. కారణం తెలిస్తే సెల్యూట్‌ చేయాల్సిందే
Related Stories
Recommended image1
Thalapathy Vijay: అజిత్ సూపర్ హిట్ సినిమాలో విలన్‌గా విజయ్‌.. దళపతి డ్రీమ్‌ బయటపెట్టిన స్టార్‌ డైరెక్టర్‌
Recommended image2
TVK Vijay: చిరంజీవి, పవన్‌కి సాధ్యం కానిది విజయ్‌కి ఎలా సాధ్యం.. దళపతి సక్సెస్‌ సీక్రెట్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved