- Home
- Entertainment
- Top 10 Heroines: సమంతకి పెద్ద షాక్, రష్మికకి గట్టి దెబ్బ.. ఇండియా నెంబర్ 1 హీరోయిన్ మారిపోయింది
Top 10 Heroines: సమంతకి పెద్ద షాక్, రష్మికకి గట్టి దెబ్బ.. ఇండియా నెంబర్ 1 హీరోయిన్ మారిపోయింది
ఇండియా టాప్ 10 హీరోయిన్లలో మొదటిసారి సంచలన మార్పు చోటు చేసుకుంది. మొదటి స్థానం మారిపోయింది. సమంతకి ఊహించని దెబ్బ పడింది. ఆమె స్థానం గల్లంతు అయ్యింది.

ఇండియా టాప్ 10 హీరోయిన్లు
ఓర్మాక్స్ మీడియా ప్రతి నెల ఇండియాలోని టాప్ 10 హీరోయిన్ల జాబితాని రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఏప్రిల్ నెలకు సంబంధించిన లిస్ట్ వచ్చింది. కానీ మొదటి సారి ఇందులో హీరోయిన్ల ప్లేస్‌లు ఊహించని విధంగా మారిపోయాయి. నెంబర్ 1 స్థానం చాలా కాలంగా మారలేదు. కానీ ఇప్పుడు మొదటిసారి ఆ హీరోయిన్ మారిపోయింది. సమంతకి ఊహించని దెబ్బ పడింది. మరి మొదటి స్థానంలో నిలిచి సంచలనం సృష్టించిన హీరోయిన్ ఎవరనేది చూస్తే.

సమంతకి షాక్ ఇచ్చిన అలియాభట్
చాలా కాలంగా సమంత మొదటి స్థానంలో కొనసాగుతూ వచ్చింది. కానీ ఇప్పుడు ఆమె డౌన్ అయ్యింది. ఆ స్థానాన్ని బాలీవుడ్ భామ, `ఆర్‌ఆర్‌ఆర్` హీరోయిన్ అలియాభట్ సొంతం చేసుకుంది. చాలా కాలంగా అలియాభట్ రెండో స్థానంలో ఉండేది. కానీ ఇప్పుడు ఆమె మొదటి స్థానానికి చేరుకుంది. సమంతకి పెద్ద షాక్ ఇచ్చింది. అలియాభట్ దెబ్బకి సమంత ఒక్క స్థానం పడిపోయి రెండో స్థానానికి పరిమితమయ్యింది.
రష్మికాని దెబ్బకొట్టిన దీపికా పదుకొనె
మార్చిలో మూడో స్థానంలో ఉన్న రష్మిక మందన్నా ఇప్పుడు పడిపోయింది. నాల్గో స్థానానికి పరిమితమయ్యింది. మూడో స్థానంలోకి దీపికా పడుకొనె వచ్చింది. ప్రస్తుతం ఆమె `రాకా`తోపాటు పలు బాలీవుడ్ చిత్రాలు చేస్తుంది. రష్మిక మందన్నా గత నెలలో పెళ్లి వార్తలతో వైరల్‌గా మారింది. అయినా ఆమె స్థానం పడిపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇలా ఇద్దరు టాలీవుడ్ భామలను బాలీవుడ్ భామలు ఊహించని విధంగా దెబ్బకొట్టారు.
స్ట్రాంగ్‌గా నిలబడ్డ హీరోయిన్లు
ఐదో స్థానంలో కాజల్ ఉంది. ఆమె మార్చిలో కూడా ఐదో స్థానంలో ఉంది. ఇప్పుడు కూడా అదే స్థానంలో నిలిచింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం, యాడ్స్, ఫోటో షూట్లతో నెటిజన్లకి దగ్గరగా ఉంటోంది కాజల్. దీంతో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఆరో స్థానంలో సాయిపల్లవి ఉంది. సాయిపల్లవి మార్చిలో ఆరో స్థానంలో ఉంది. ఇప్పుడు కూడా అదే స్థానంలో నిలవడం విశేషం.
ఏడో స్థానంలో నయనతార
ఏడో స్థానంలో నయనతార ఉంది. ఆమె కంటిన్యూగా ఏడో స్థానంలో ఉంటోంది. ఇప్పుడు కూడా అదే స్థానంలో నిలిచింది. తన సత్తా చాటిందని చెప్పొచ్చు. ఎంతటి పోటీ ఉన్న తాను మాత్రం తగ్గడం లేదు.
శ్రీలీల జోరు
తెలుగు అమ్మడు శ్రీలీల మాత్రం దుమ్మురేపుతోంది. మార్చిలో ఆమె 10వ స్థానంలో ఉండగా, ఇప్పుడు రెండు స్థానాలు పెరిగింది. ఎనిమిదో స్థానంలోకి వచ్చి చేరింది. తన ఇమేజ్‌ని పెంచుకుంది. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తొమ్మిదో స్థానంలో నిలవడం విశేషం.
పదో స్థానానికి పడిపోయిన త్రిష
ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే త్రిష డౌన్ అయ్యింది. గత రెండు మూడు నెలలుగా త్రిషకి సంబంధించిన చర్చ నడుస్తోంది. విజయ్‌తో ఎఫైర్ విషయంలో హాట్ టాపిక్ గా మారింది. కానీ ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన జాబితాలో మాత్రం ఆమె పదో స్థానానికి పడిపోవడం గమనార్హం.

