- Home
- Entertainment
- Bhumika: `ఖుషి` సినిమాకి మేకప్ వేసుకోనివ్వలేదు.. పవన్ కళ్యాణ్ పై భూమిక క్రేజీ కామెంట్
Bhumika: `ఖుషి` సినిమాకి మేకప్ వేసుకోనివ్వలేదు.. పవన్ కళ్యాణ్ పై భూమిక క్రేజీ కామెంట్
భూమిక `ఖుషి` సినిమాలో జరిగిన సంఘటన పంచుకుంది. మేకప్ వేసుకోనివ్వలేదని వెల్లడించింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ విషయంలో గర్వంగా ఉందంటూ వ్యాఖ్యానించింది.

ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన పవన్, భూమికల `ఖుషి`
పవన్ కళ్యాణ్, భూమిక కలిసి నటించిన `ఖుషి` సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇది బాక్సాఫీసుని షేక్ చేసింది. ఎస్ జే సూర్య దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2001లో విడుదలై అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ కి తిరుగులేని ఇమేజ్ ని క్రియేట్ చేసింది. ఆయన్ని తిరుగులేని స్టార్‌ని చేసింది. అప్పట్లో యూత్‌లో విశేషమైన క్రేజ్‌కి కారణమైందీ మూవీ. అదే సమయంలో లవ్ స్టోరీస్ పరంగానూ ఒక ట్రెండ్ సెట్ చేసింది. ఇందులో పవన్, భూమిక మధ్య లవ్ ట్రాక్, కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది.
`ఖుషి`కి మేకప్ వేసుకోనివ్వలేదు
అయితే ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్ భూమిక లేటెస్ట్ గా స్పందించింది. ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఈ మూవీ కోసం తాను మేకప్ వాడలేదని తెలిపింది. అంతేకాదు ఓ సందర్భంలో కెమెరామెన్ మేకప్ తీసేయమని చెప్పాడట. మేకప్ వేసుకోనివ్వలేదట. నేను `ఖుషి` సినిమాకి మేకప్ వేసుకోలేదు. సినిమాలో 80 శాతం మేకప్ లేకుండానే కనిపిస్తాను. దియా సీన్‌లో కొంత మేకప్ టచ్ ఇచ్చాను. కానీ పీసీ శ్రీరామ్(కెమెరామెన్) సర్ ఫేస్ వాష్ చేసుకొని రమ్మని చెప్పాడు. దీంతో అది నన్ను కొంత అప్‌సెట్‌కి గురి చేసింది` అని తెలిపింది భూమిక.
పవన్ కళ్యాణ్ సర్‌ని చూస్తే గర్వంగా ఉంది
అంతేకాదు పవన్ కళ్యాణ్‌పై ప్రశంసలు కురిపించింది. ``ఖుషి` సినిమా నుంచి డిప్యూటీ సీఎంగా ఇదొక అద్భుతమైన జర్నీ, ఇది చాలా స్పెషల్ జర్నీ. ఒక సహనటిగా పవన్ కళ్యాణ్ సర్ విషయంలో చాలా గర్వంగా ఉంది` అని తెలిపింది భూమిక. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
యూఫోరియాతో అలరించబోతున్న భూమిక
భూమిక ప్రస్తుతం `యూఫోరియా` అనే చిత్రంలో కీలకపాత్రలో నటిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఫిబ్రవరి 6న విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా భూమిక ఈ విషయాలను పంచుకుంది. భూమిక తెలుగులో చాలా సెలక్టీవ్‌గా మూవీస్ చేస్తోంది. `ఒక్కడు`, `మిస్సమ్మ`, `సింహాద్రి`, `జై చిరంజీవ`, `మాయా బజార్`, `సత్యభామ`, `అమరావతి` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ఇటీవల `ఎంసీఏ` చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. `సవ్యసాచి`, `రూలర్`, `సీతా రామం` మూవీలో నటించి మెప్పించింది. అందులో భాగంగా ఇప్పుడు `యూఫోరియా`తో అలరించేందుకు వస్తుంది భూమిక.

