‘పుష్ప 2’ తీసుకెళ్లలేదని యువతి ఆత్మహత్య, బాయ్ ఫ్రెండ్ అరెస్ట్
పుష్ప 2 చిత్రం భారీ విజయాన్ని సాధించి, బాక్సాఫీస్ వద్ద రికార్డులను బద్దలు చేసింది. అయితే, ఈ సినిమాను చూడటానికి ప్రియుడు నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
భారీ అంచనాల మధ్య విడుదలైన పుష్ప చిత్రం సౌత్‌తోపాటు నార్తిండియన్ ప్రేక్షకులను ఫిదా చేస్తున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ (Allu Arjun) సీక్వెల్ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule) డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలోకి వచ్చి రికార్డు వసూళ్లతో ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచింది.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదలై న పుష్ప 2 ది రూల్ ఓపెనింగ్ డేనే జవాన్, ఆర్‌ఆర్‌ఆర్ రికార్డును బద్దలు కొట్టింది.
పుష్ప చిత్రం 15 రోజుల్లోనే రూ.1508 కోట్లు వసూళ్లు రాబట్టి అత్యధిక వేగంగా ఈ మార్క్ చేరుకున్న చిత్రంగా అరుదైన ఫీట్ నమోదు చేసింది. ఇప్పటివరకు ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ ఇండియన్ మూవీస్ అమీర్ ఖాన్ దంగల్ (రూ.2070. 30 కోట్లు), బాహుబలి.. ది కంక్లూజన్ (రూ.1786.06 కోట్లు) పేర్లతో ఉన్న రికార్డ్‌ను పుష్ప 2 ది రూల్ అధిగమించడం ఖాయమని తాజా కలెక్షన్లు చెప్పకనే చెబుతున్నాయి.
మరో ప్రక్క పుష్ప 2 సినిమాకి వెళదాం అంటే బాయ్ ఫ్రెండ్ వద్దనడంతో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. బనారస్ హిందూ యూనివర్శిటీ అనుబంధ కళాశాలలో చదువుతున్న 22 ఏండ్ల యువతి తన ప్రియుడితో కలిసి ట్రిప్ కోసం వారణాసి వెళ్లింది. ఇద్దరు కలిసి ఒక హోటల్‌లో దిగిన అనంతరం.. తనను పుష్ప 2 సినిమాకి తీసుకువెళ్లమని బాయ్ ఫ్రెండ్ కోరింది.
అయితే ప్రియురాలి కోరికను అతడు నిరాకరించడంతో మనస్తాపం చెందిన యువతి.. హోటల్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ఘటనపై పోలీసులు ప్రియుడిని అదుపులోకి తీసుకోని విచారణ చేపట్టారు.
మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం కన్నడ సోయగం రష్మిక మందన్నా మరోసారి శ్రీవల్లిగా ఇంప్రెస్ చేసింది. సీక్వెల్‌లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
read more: `పుష్ప 2` ప్రపంచమంతా బ్లాక్ బస్టర్, అక్కడ మాత్రం ఫ్లాప్ !