MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Krishna Mukunda Murari: సూపర్ ట్విస్ట్ ఇచ్చిన మురారి.. ఊహించని నిర్ణయం తీసుకున్న భవాని!

Krishna Mukunda Murari: సూపర్ ట్విస్ట్ ఇచ్చిన మురారి.. ఊహించని నిర్ణయం తీసుకున్న భవాని!

Krishna Mukunda Murari: స్టార్ మా లో ప్రసారం అవుతున్న కృష్ణ ముకుంద మురారి సీరియల్ మంచి కంటెంట్ తో టాప్ రేటింగ్ ని సంపాదించుకుంటుంది. ఆడపడుచు కోసం తన కాపురాన్నే రిస్క్ లో పెడుతున్న ఒక వదిన కథ ఈ సీరియల్. ఇక ఈరోజు ఏప్రిల్ 24 ఎపిసోడ్ లో ఏం జరిగిందో చూద్దాం. 

3 Min read
Author : Navya G
Published : Apr 24 2023, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఎపిసోడ్ ప్రారంభంలో కృష్ణ కాపురం ఏమైపోతుందో అని కంగారు పడతాడు గౌతమ్. నా గురించి మీరేమీ కంగారు పడక్కర్లేదు, మీ ఇద్దరికీ పెళ్లి అయితే నాకు అంతే చాలు అంటుంది కృష్ణ. అంతలోనే అక్కడికి ముకుంద వచ్చి ఇక్కడ పెళ్ళి అవుతున్నట్లు నీకెలా తెలుసు అని అడుగుతుంది. ఈ కృష్ణ తలుచుకుంటే దేన్నైనా సాధిస్తుంది అంటుంది కృష్ణ.పిలవని పేరంటానికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది ముకుంద. ఆడపడుచు పెళ్లికి నన్ను వేరొకరు పిలిచేదేంటి అని ముకుందని పక్కకు తప్పించుకొని మండపం దగ్గరికి వెళ్తారు కృష్ణ, గౌతమ్. 

28

వాళ్లని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అయితే మురారియే కృష్ణ కి అడ్రస్ చెప్పిన విషయం అక్కడ ఎవరికీ తెలియదు. కృష్ణ వాళ్ళని చూసి కోపంతో రగిలిపోతుంది భవాని. ఈ పెళ్లిలో అతను చావు చూడటం నాకిష్టం లేదు వెంటనే పంపించేయండి అంటుంది. ఈశ్వర్ వాళ్ళు కృష్ణని అడ్డుకుంటారు కానీ కృష్ణ వాళ్లతో వాదిస్తూ ఉంటుంది. నీ భార్యని నువ్వే ఇక్కడి నుంచి పంపించెయ్ అని మురారి కి చెప్తుంది  భవాని. ఎందుకో తెలుసుకోవచ్చా అంటాడు మురారి. ఆ ప్రశ్నకి భవానీతోపాటు ఈశ్వర్, ప్రసాద్ కూడా ఆశ్చర్యపోతారు.
 

38

కృష్ణ నా మాట వినదు అని తెలివిగా తప్పించుకుంటాడు. ఇక తప్పదు అని ఈశ్వర్, ప్రసాద్ ఇద్దరూ గౌతమ్ ని వెనక్కి నెట్టేస్తూ ఉంటారు. వాళ్ల నుంచి  విడిపించుకుని మీరు కొడితే పడడానికి నేను వాచ్మెన్ కొడుకుని కాదు డాక్టర్ని అంటూ నందినిని పిలుస్తాడు గౌతమ్. సిద్దు ని గుర్తుపట్టిన నందిని పెళ్లి పీటల మీద నుంచి లేచి వచ్చి గౌతమ్ ని హత్తుకుంటుంది. కోపంతో రగిలిపోతుంది భవాని. నందినిని కొట్టటానికి చెయ్యెత్తుతుంది. ఆ చేతిని పట్టుకొని ఆపుతాడు మురారి. నందిని పసిపాప లాంటిది తననేమీ అనొద్దు అంటాడు. అంటే ఈ కుట్రలో నీకు కూడా భాగం ఉందన్నమాట, నీ భార్యతో కలిసి నాకు ద్రోహంతలపెట్టావా అంటుంది భవాని. 

48

ఇంత మంది మధ్యలో నా పరువు తీస్తావా, వీడు ఎవడో తెలుసా, వీడి తల్లిదండ్రులు ఎవరో తెలుసా అంటూ కోపంగా మాట్లాడుతుంది భవాని. అతను వైద్య వృత్తిలో ఉన్నాడు అతని తల్లిదండ్రులు కష్టపడి ఇతన్ని ఈ స్థాయిలో ఉంచిన కష్టజీవులు అంటాడు మురారి. ఇంతలోనే పెళ్లి కొడుకు తల్లి వచ్చి పిల్ల పిచ్చిది అని తెలిసిన ఒప్పుకున్నాం కానీ ఎవడో వచ్చి తనని పట్టుకోవడం ఏంటి మా పరువు తీసేసారు అంటూ కేకలు వేస్తుంది. గౌతమ్ వాళ్ళ ప్రేమ కథంతా చెప్తాడు మురారి.

58

పర్వాలేదు మీరు మంచి పని చేశారు, ఇకనైనా మీ పెద్దమ్మని మారమనండి అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు పెళ్లి వాళ్ళు. జరిగిన అవమానానికి కోపంతో రగిలిపోయిన ఈశ్వర్, మురారి మీద కోపంతో కొట్టడానికి ముందుకు వస్తాడు. కృష్ణ అడ్డుకుంటుంది. ఇందులో ఆయన తప్పేమీ లేదు ఆఖరి నిమిషం వరకు పెద్దత్తయ్య తరపున నిలబడ్డారు కానీ ఆఖరి నిమిషంలో నందిని సూసైడ్ చేసుకోబోతుంటే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అంటూ జరిగిందంతా చెప్తుంది కృష్ణ. నందిని మనసులో ఏముందో తెలుసుకోవడం కోసం ఆమె రూమ్ కి వెళ్ళినప్పుడు ఆమె నిద్ర మాత్రలు వేసుకొని చనిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. సడన్గా అది చూసిన మురారి ఆ టాబ్లెట్స్ ని పిసిరేసి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. 

68

నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు దయచేసి ఈ పెళ్లి ఆపు నీకు దండం పెడతాను అని మురారిని బ్రతిమాలుకుంటుంది నందిని. ఇదే విషయాన్ని అక్కడ ఉన్న అందరికీ చెప్తుంది కృష్ణ. పెద్దతయ్య పంతం కన్నా ప్రేమకే ఆయుషు ఎక్కువ అందుకే వాళ్ళిద్దరూ కలిసి పోయారు. ఈ పెళ్లి మీ చేతులుమీదే జరిపించి పెద్దరికం నిలుపుకోండి అంటుంది కృష్ణ. నేను వాడికి ఎంత సాయం చేశాను, నా ఇంటి కుర్చీలో కూర్చోవడానికి కూడా అర్హత లేని వీడు నా కూతుర్ని ట్రాప్ చేస్తే వీడికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలా అంటూ కోప్పడుతుంది భవాని.

78

ఆవేశ పడొద్దు నందిని కోసమే ఈ పెళ్లి చేయాలనుకుంటున్నాము అంతేగాని నిన్ను ఎదిరించాలని కాదు ఈ ఒక్కసారి నా మాట విను అని బ్రతిమాలుతాడు మురారి. ఈరోజు నుంచి నందిని నాకు కూతురు కాదు, నాకు కొడుకు కూడా లేడు అంటూ మురారి మీద  కోపంతో అక్కడినుంచి వెళ్ళిపోతుంది భవాని. ఆమెతో పాటే అక్కడున్న వాళ్ళందరూ వెళ్లిపోతారు.

88

మురారి దంపతులు, గౌతమ్, నందిని మాత్రం మిగిలిపోతారు. తరువాయి భాగంలో ఒక బంధాన్ని శాశ్వతంగా కోల్పోతున్నందుకు వస్తున్నది ఈ కన్నీరు అంటుంది భవాని. ఒక అన్నగా గెలిచిన ఒక కొడుకుగా ఓడిపోయాను అంటాడు మురారి. నాకు ఇంత కడుపు కోత మిగిల్చిన ఈ కృష్ణ, మురారిలతో ఈ ఇంట్లో వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు అని శాసనం విధిస్తుంది భవాని.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishal : సైకిల్‌పై వచ్చి ఓటేసిన విశాల్.. రాజకీయం , ప్రజాసేవ పై హాట్ కామెంట్స్
Recommended image2
Allu Arjun Remuneration : రాకా కోసం అల్లు అర్జున్, దీపికా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Recommended image3
Bhanu Chander: సాయం కోసం ఏఎన్నార్, ఎన్టీఆర్ ఇంటికి వెళ్తే.. ఎలా స్పందిస్తారంటే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved