హీరో విశాల్ రెడ్డి చెన్నైలో సైకిల్‌పై పోలింగ్ బూత్‌కు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజకీయం పై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. . అస్సాం, కేరళ స్థాయిలో తమిళనాడులోనూ ఓటింగ్ శాతం నమోదు కావాలని విశాల్ కోరుకున్నారు.
నటుడు విశాల్ రెడ్డి చెన్నైలోని ఓ పోలింగ్ కేంద్రానికి సైకిల్‌పై వచ్చి ఓటేశారు. మధ్యాహ్నం తన ఓటు హక్కును వినియోగించుకున్న ఆయన, ప్రజలందరూ పెద్ద సంఖ్యలో ఓటు వేయాలని కోరారు.
'రాజకీయం అంటే ప్రజాసేవ'
ఈ సందర్భంగా విశాల్ మాట్లాడుతూ.. రాజకీయం అనేది సినిమాలు లేదా వ్యాపారాల వంటిది కాదని, అదొక "ప్రజాసేవ" అని అన్నారు. సమాజానికి సేవ చేయాలనే నిజమైన తపన ఉన్నప్పుడే రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిప్రాయపడ్డారు. "రాజకీయాల్లోకి రావడం అనేది ఒక పిలుపు లాంటిది. ఇది ప్రజల సపోర్ట్ ఉంటేనే సాధ్యం అవుతుంది. వారి సపోర్ట్ కావాలంటే..మంచి చేయాలనే తపన ఉండాలని విశాల్ స్పష్టం చేశారు.
ఓటింగ్ శాతంపై ప్రశంసలు
రాజకీయ నాయకులు తమ విధులను సరిగ్గా నిర్వర్తించాలని విశాల్ ఆశాభావం వ్యక్తం చేశారు. వృద్ధులు, యువకులు పెద్ద ఎత్తున ఓటు వేయడానికి రావడం ప్రోత్సాహకరంగా ఉందని ఆయన అన్నారు. చివరికి ఓటింగ్ శాతం అస్సాం, కేరళ రాష్ట్రాల స్థాయికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. "వృద్ధులు, యువకులు బయటకు వచ్చి ఓటేయడం చూడటం అద్భుతంగా ఉంది. ఓటింగ్ శాతం పెరుగుతుండటం సంతోషంగా ఉంది. మే 4న అద్భుతమైన ఫలితాలు వస్తాయి," అని ఆయన అన్నారు.
ముగిసిన పోలింగ్
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, పశ్చిమ బెంగాల్ తొలి దశ ఎన్నికల పోలింగ్ గురువారం సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఎన్నికల సంఘం డేటా ప్రకారం, పశ్చిమ బెంగాల్‌లో తొలి దశలో 152 స్థానాలకు జరిగిన పోలింగ్‌లో 91.91 శాతం ఓటింగ్ నమోదైంది. తమిళనాడులో 84 శాతానికి పైగా పోలింగ్ జరిగింది.


