- Home
- Entertainment
- Devatha: దేవికి చిన్మయికి మధ్య పోటీ.. నేనున్నానంటూ రుక్మిణి వెనుకకి ధైర్యం చెప్పిన భాగ్యమ్మ!
Devatha: దేవికి చిన్మయికి మధ్య పోటీ.. నేనున్నానంటూ రుక్మిణి వెనుకకి ధైర్యం చెప్పిన భాగ్యమ్మ!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు ఆగస్ట్ 3వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... రుక్మిణి,మాధవ సార్ దగ్గర నుంచి దేవిని ఎలా కాపాడాలి? అసలు మాధవ్ సార్ ని ఎలా ఆపాలి? అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో నేనొక దాన్ని ఎలా పోరాడాలి?నాకు ఎవరైనా తోడుగా ఉంటే బాగుండు? అని ఆలోచిస్తుండగా, వాళ్ళ అమ్మ ఇంటికి వస్తాను అని అన్న మాటలు గుర్తు తెచ్చుకొని ,ఇలాంటి సమయంలో అమ్ముంటే నాకు తోడుగా ఉంటుంది అని అనుకుంటుంది రుక్మిణి.
కమలా, భాష రోడ్డు మీద డాక్టర్ చెప్పిన మందులు పట్టుకొని వస్తుండగా, అదే సమయంలో, అదే రోడ్డులో భాగ్యమ్మ కూడా తన వస్తువులన్నీ సర్దుకుంటూ రుక్మిణి వాళ్ళ ఇంటికి వెళ్లడానికని బయలుదేరుతాది. ఈ లోగా దారిలో వీళ్ళని చూసి అక్కడ ఉన్న చెట్ల దగ్గర దాక్కుంటాది. ఇక్కడ వాళ్ళు తనని చూస్తే ఎక్కడకు వెళ్తున్నావు? అని అడుగుతారు అని, ముసుగు వేసుకొని తెలివిగా పక్కనుంచి తప్పుకుపోతాది భాగ్యమ్మ.
తర్వాత సీన్లో దేవి, కరాటే సాధన చేస్తుండగా చిన్మయి అక్కడికి వచ్చి, నవ్వుకుంటూ నువ్వు వెళ్ళింది రెండు దినాలే,అప్పుడే నీకు బలం వచ్చేస్తాదా? అని చెప్పి మనిద్దరం అయితే తల పడదామా ఇద్దరిలో ఎవరికీ ఎక్కువ బలం ఉందో తెలుస్తది అని అంటాది చిన్మయి. అదే సమయంలో రుక్మిణి వాళ్ళ అత్తయ్య మావయ్య అందరూ వచ్చి చూస్తారు. ఆట ప్రారంభించక ముందు దేవి వాళ్ళ నాన్నమ్మ వాళ్ల ఇష్టమైన దేవుని తలుచుకోమని చెబుతుంది.
అప్పుడు చిన్మయి రుక్మిణిని తలుచుకుంటుంది దేవి మాత్రం ఆఫీసర్ సార్ ని తలచుకుంటుంది. ఆట ప్రారంభం అవుతుంది.పోటాపోటీగా ఇద్దరు ఆడుకున్న సమయంలో, దేవి చిన్మయిని ఓడించి గెలుస్తుంది. ఇంక ఆట ఇక్కడితో పూర్తి చేయండి అని చెప్పి రుక్మిణి చిన్నమాయిని బాధపడొద్దు అని చెప్పి, ఇద్దరినీ వంట గదిలోకి తీసుకెళ్లి వంట నేర్పుతాను అని అంటుంది.తర్వాత సీన్లో ఆదిత్య బయటకు వెళ్లడానికి తయారవుతాడు.
ఈ లోగ సత్య వచ్చి ఆదిత్యని ,ఇది ఆఫీస్ సమయం కదా ఎక్కడికి వెళ్తున్నావు? అని అడగగా, ఆఫీస్ కి తర్వాత వెళ్తాను ఒక ముఖ్యమైన పని ఉంది అని అంటాడు.అదే సమయంలో ఆదిత్య కి ఆఫీస్ పని మీద ఒక ఫోన్ వస్తుంది.సత్య ఆ ఫోన్ తీసుకొని "సార్ బయలుదేరారు, కొంచెం సేపట్లో అక్కడ ఉంటారు" అని చెబుతుంది. నేను ఆఫీస్కి ఇప్పుడు వెళ్ళను అని చెప్పాను కదా అని అదిత్య సత్యని అడుగుతాడు. నీ వ్యక్తిగత విషయం కోసం ఆఫీస్ పని వదులుకోకూడదు అని చెప్పి ఆదిత్యని ఆఫీస్ కి పంపిస్తాది సత్య.
ఈలోగ జానకి ,వాళ్ళ భర్తతో మాధవ్,కిందకి రావట్లేదు అని మాట్లాడుకుంటూ ఉండగా భాగ్యమ్మ అక్కడికి వస్తుంది. మొన్న మీ పొలంలో పనిచేస్తున్నప్పుడు ఎండ దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయాను. అప్పుడు రాధమ్మ అక్కడికి వచ్చి మా ఇంట్లో పని ఇస్తాను అన్నది.కనుకే పని కోసం ఇక్కడికి వచ్చాను అని అంటుంది భాగ్యమ్మ. రాధ చెప్పిన తర్వాత మేము ఎలా కాదనగలము? రాధ ఒక మాటంటే ఎంతో ఆలోచించుకొని చెబుతుంది లోపలికి వెళ్ళు. రాధ అక్కడే ఉన్నది అని జానకి అంటుంది.
భాగ్యమ్మ ,రుక్మిణి దగ్గరకు వెళ్లి "వీళ్ళు నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు,వాళ్ళ మాటల్లోనే నీ మీద ప్రేమ ఆప్యాయత తెలుస్తుంది.నువ్వు ఇన్నేళ్లు ఇక్కడ ఉండడానికి కారణం నాకు అర్థమవుతుంది" అని రాధతో అంటుంది. అ మాధవ్ సార్ నేను ఏదో అంటున్నారని అంటున్నావు కదా నేను ఇప్పుడు ఇక్కడే ఉంటాను కదా ఆయన పని చెప్తాను అని రుక్మిణికి ధైర్యం ఇస్తుంది భాగ్యమ్మ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగంలో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!!