- Home
- Entertainment
- Devatha: మాధవ్ కు వాత పెట్టిన భాగ్యమ్మ.. దేవి, చిన్మయిల ప్రేమను చూసి సంబర పడుతున్న దేవుడమ్మ కుటుంబం!
Devatha: మాధవ్ కు వాత పెట్టిన భాగ్యమ్మ.. దేవి, చిన్మయిల ప్రేమను చూసి సంబర పడుతున్న దేవుడమ్మ కుటుంబం!
Devatha: బుల్లితెరపై ప్రసారమవుతున్న దేవత సీరియల్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. చెల్లి కోసం భర్తను త్యాగం చేసిన మహిళ కథతో ప్రేక్షకుల ముందు వచ్చింది. నిత్యం ట్విస్టులతో కొనసాగుతున్న ఈ సీరియల్ ఈ రోజు సెప్టెంబర్ 8వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం...

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే... చిన్మయి ముస్తాబు చూసి అందరూ మురిసిపోతారు కానీ చిన్మయి మాత్రం నాకు దేవి కావాలి,దేవి లేకుండా నేను ఒక్కదాన్నే పండగ జరుపుకోలేను నన్ను కూడా ఆఫీసర్ ఇంటికి తీసుకు వెళ్ళండి అని అంటుంది. అప్పుడు రుక్మిణి ఆదిత్య కి ఫోన్ చేసి, చిన్మయి అక్కడికి వస్తాదట అని అనగా ఆదిత్య సరే కారు పంపిస్తాను అని అంటాడు. అప్పుడు చిన్నయి,నేను వెళ్లి బట్టలు మార్చుకుంటాను అని అనగా, ఈ బట్టల్లో బాగున్నావు అని అంటుంది రుక్మిణి.ఈ బట్టలతో నేను ఆఫీసర్ సర్ ఇంటికి వెళ్ళను అని చిన్మయి సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోతుంది.
ఆ తర్వాత దేవి, ఆదిత్య కలిసి వినాయకుడు బొమ్మని తయారు చేస్తూ ఉంటారు. మరోవైపు సత్య,దేవుడమ్మ ఇంకో వినాయకుడి బొమ్మ తయారు చేస్తూ ఉంటారు. దేవి, ఆదిత్య వినాయకుడు బొమ్మ ముందుగా తయారుచేసి,చూశారా అవ్వ,నేను ఆఫీసర్ కలిసి ఏ పని చేసిన మాకు తిరుగు ఉండదు,మీరు ఓడిపోయారు అని అంటుంది. నా కొడుకు గెలిస్తే నేను గెలిచినట్టే కదా అని అయినా నేను మీకోసమే ఓడిపోయాను అని అంటుంది దేవుడమ్మ.
అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉంటారు. ఆ తర్వాత సీన్లో రుక్మిణి తయారయ్యి వస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ చూసి ఎంత అందంగా ఉందో అని అనుకుంటారు. అప్పుడు దీపం పెడుతున్నప్పుడు మాధవ్ అక్కడికి వచ్చి ఇంత అందాన్ని ఇన్ని రోజులు ఎలా వదులుకున్నాను అని రుక్మిణి వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు భాగ్యమ్మ ఈయన ఏంటి గుడ్లగూబలా రుక్కూ వైపు చూస్తున్నాడు అని చెప్పి కావాలని మాధవ్ దగ్గరికి వెళ్లి వేడినీళ్ళను మాధవ్ చేతికి అంటించేస్తుంది.
మాధవ్ అరుస్తాడు. క్షమించండి పటెలు చూసుకోలేదు కాల్తున్నట్టు ఉంది కదా అని అంటుంది భాగ్యమ్మ. ఆ తర్వాత దేవి ఏది అని అడగగా దేవుడమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లింది అని జానకమ్మ అంటుంది. పండగ రోజు ఎలా పంపిస్తారు అని మాధవ్ తిడగాడు నోరార అడిగాక ఎలా వద్దంటాను అని జానకమ్మ అంటుంది. చిన్నయి కనిపించడం లేదు అని అడగగా దేవి లేదని చెప్పి ఆఫీసర్ ఇంటికి వెళ్ళిపోయింది అని రుక్మిణి అంటుంది. పిల్లలు ఇద్దరు ఇక్కడ లేకుండా పండగ ఏం జరుగుతుంది అయినా ఆ ఆదిత్య కి పిల్లలు లేరా? లేకపోతే పిల్లల్ని వద్దనుకున్నాడా? ఏమైనా లోపం ఉన్నదా అని అంటాడు.
దానికి భాగ్యమ్మకి చాలా కోపం వస్తుంది. వేడి నూనె మాధవ్ మీద ఒంపాలనుకుంటుంది. ఇంతలో రుక్మిణి ఆపుతుంది. అప్పుడు జానకమ్మ, ఏం మాట్లాడుతున్నావ్ రా అసలు ఈ మధ్య నీకు నోటికి ఎంత వస్తే అంతా మాట్లాడుతున్నావు. పండగ రోజు ఆ మాటలు ఏంటి అని తిడుతుంది. ఆ తర్వాత సీన్లో దేవి తయారయి వస్తుంది.అందరూ దేవిని చూసి మురిసిపోతారు. నేను కుట్టిన లంగా ఎలా ఉంది అని దేవుడమ్మ అడగగా నువ్వు కుట్టావు కదా అవ్వ చాలా బాగుంది అని అంటుంది. సరే అయితే ఈరోజు నువ్వే కదా మా ఇంటి మహాలక్ష్మివి.
వెళ్లి వినాయకుడి పూజ చేయు అని దేవుడమ్మ అనగా చిన్న రుక్మిణి ఇస్తే మేమిద్దరం కలిసి పూజ చేస్తామని దేవి అంటుంది. పాప ఇంకా చిన్నది కదా వచ్చే సంవత్సరం ఇద్దరం కలిసి చేయండి అని దేవుడమ్మ చెప్పి దేవి చేత పూజ చేయిస్తుంది.ఇంతలో చిన్నయి అక్కడికి వస్తుంది. ఇద్దరు అక్క,దేవి, అనుకోని వెళ్లి హద్దుకుంటారు. అప్పుడు అందరూ వాళ్ళిద్దర్నీ చూసి మురిసిపోయి, అక్కా చెల్లెలు బంధం అంటే ఇలా ఉండాలి. ఇద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో ఇలాంటి ప్రేమలు ప్రతి చోట ఉండవు. వీళ్ళ అమ్మని ఎప్పుడూ చూడలేదు కానీ ఇంత అన్యోన్యంగా పెంచినందుకు చాలా గర్వంగా ఉన్నది అని అంటుంది దేవుడమ్మ. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తరువాయి భాగం లో ఏం జరిగిందో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే!