- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: తన ఆస్తి మొత్తం తులసికి రాసిస్తానన్న అంకిత.. అభి పేరుపైన ఆస్తి వచ్చేలా చేసిన లాస్య!
Intinti Gruhalakshmi: తన ఆస్తి మొత్తం తులసికి రాసిస్తానన్న అంకిత.. అభి పేరుపైన ఆస్తి వచ్చేలా చేసిన లాస్య!
బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalaxhmi ) సీరియల్ కుటుంబం మీద ఉన్న బాధ్యత అనే నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు జూన్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే తులసి (Tulasi) అభికు నిన్ను నమ్మి మీ అత్తగారు నీకు పెద్ద బాధ్యత అప్పగించారు. నువ్వు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అని చెబుతుంది. ఇక అభి (prem) నువ్వు నన్ను ఉద్దేశించి నాకు ఈ మాటలు చెబుతున్నావు కదా అని అభి తన తల్లిని అపార్థం చేసుకుంటాడు. అమ్మని కాబట్టి నీకు చెప్పడానికి వచ్చాను జాగ్రత్త పడు అని తులసి అంటుంది.
మరోవైపు లాస్య (Lasya), నందు (Nandu) లు వాళ్ల బిజినెస్ కి కావలసిన పెట్టుబడి కు స్కోప్ దొరికినందుకు ఆనంద పడుతూ మాస్ పాటకు స్టెప్పులు వేస్తూ ఉంటారు. ఈలోపు అక్కడకు భాగ్య వచ్చి మీ ప్లాన్ మొత్తం తులసి అభి కు సినిమా వేసి చూపిస్తుంది అని అంటుంది. దాంతో లాస్య దంపతులకు షాక్ అవుతారు.
ఆ క్రమంలో భాగ్య (Bhagya) తులసి విషయంలో లాస్య దంపతులకు నానా రకాల మాటలు నూరి పోస్తుంది. ఇక బావగారికి విడాకులిచ్చినా.. ఇంకా తనని తులసి (Tulasi) మా ప్రాపర్టీ అనుకుంటుందేమో అని భాగ్య అంటుంది. ఆ మాటంటే గొంతు పిసుకుతా అని లాస్య భాగ్య గొంతు పట్టుకోబోతుంది. ఇక నందు తులసి దగ్గరకు వెళ్లి నా గురించి లేనిపోని ప్రచారం ఎందుకు చేస్తున్నావని విరుచుకు పడతాడు.
ఇక నా పిల్లలని నా నుంచి వేరు చేద్దామనుకుంటున్నావా? అని నందు తులసి (Tulasi) పై విరుచుకు పడతాడు. ఈ క్రమంలో అనసూయ (Anasuya) దంపతులు తులసి కు చాలా సపోర్ట్ గా మాట్లాడుతారు. ఇక తులసి అభికి ఎవరు చెప్పాల్సింది వాళ్ళు చెప్పాలి.. ఇక నిర్ణయం అభి నే తీసుకుంటాడు అని అంటుంది.
ఆ తర్వాత దివ్య (Divya) అంకిత కు ఫోన్ చేసి అభి అన్నయ్య అమ్మానాన్నలకు గొడవ పెట్టాడు అని చెబుతుంది. అంతేకాకుండా మొన్న పార్టీలో కూడా అమ్మను వేరే రకంగా అవమానించారు అని అంటుంది. ఆ మాటకు అంకిత (Ankitha) తన తల్లి దగ్గరికి వెళ్లి నీ వల్ల కొన్ని బంధాలు ముక్కలు అవుతున్నాయి అంటూ నానా రకాలుగా విరుచుకుపడుతుంది.
అంతేకాకుండా ఆస్తి నా పేరు మీదకు రాగానే వెంటనే తులసి (Tulasi) ఆంటీ కి రాసిస్తాను అని అంకిత అంటుంది. ఇక లాస్య (Lasya) ఆస్థి అంకిత పేరు మీద కాకుండా అభి పేరుమీద రాయించాలని గాయత్రి తో అంటుంది. ఆ మాటకు గాయత్రి కూడా ఓకే చెబుతుంది. ఇక అభి లాస్య ను నా తల్లి లా నా వెనక నిలబడ్డావు అని అభినందిస్తాడు.