- Home
- Entertainment
- ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి.. బాలయ్య మూవీకి నేషనల్ అవార్డు దక్కడానికి అసలు కారణం ఇదే
ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి.. బాలయ్య మూవీకి నేషనల్ అవార్డు దక్కడానికి అసలు కారణం ఇదే
భగవంత్ కేసరి చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు దక్కింది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డు రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

71వ జాతీయ చలన చిత్ర అవార్డులు
భారత ప్రభుత్వం తాజాగా 71వ జాతీయ చలనచిత్ర అవార్డులని ప్రకటించింది. నేషనల్ ఫిలిం అవార్డ్స్ జ్యూరీ సభ్యులు 2023 సంవత్సరం చిత్రాలకు ఈ అవార్డులని ప్రకటించారు. తెలుగు సినిమాలో భగవంత్ కేసరి, హనుమాన్, బలగం చిత్రాలు సత్తా చాటాయి. నందమూరి బాలకృష్ణ, కాజల్, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన భగవంత్ కేసరి చిత్రం ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు సొంతం చేసుకుంది.
ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి
భగవంత్ కేసరి చిత్రానికి అవార్డు దక్కడానికి గల కారణాలు కూడా జ్యూరీ సభ్యులు వివరించారు. భయపడుతూ ఉండే టీనేజ్ అమ్మాయి ధైర్యవంతురాలిగా ఎలా ట్రాన్స్ ఫామ్ అయింది అనే చక్కటి కథాంశంతో ఈ చిత్రం రూపొందినట్లు జ్యూరీ సభ్యులు తెలిపారు. ఈ చిత్రంలో భావోద్వేగ సన్నివేశాలు చాలా బలంగా ఉన్నాయి అని అన్నారు. అదే విధంగా యాక్షన్ సన్నివేశాలు కూడా పవర్ ఫుల్ గా ఉన్నట్లు పేర్కొన్నారు.
డైరెక్టర్ అనిల్ రావిపూడిపై ప్రశంసలు
డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ చిత్రంలో శ్రీలీల పాత్రని తీర్చి దిద్దిన విధానానికి ప్రశంసలు దక్కాయి. ఎలాంటి పరిస్థితిల్లో అయిన మహిళ ధైర్యంగా నిలబడాలి అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఆమెని గైడ్ చేసే తండ్రి పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించారు. అదే విధంగా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ కి సంబంధించిన సన్నివేశాలకు కూడా ప్రశంసలు దక్కాయి.
బాలయ్య తెలంగాణ యాసలో..
తెలంగాణ యాసలో ఈ చిత్రంలో బాలయ్య డైలాగులు అదరగొట్టారు. తమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించారు. అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడి పాత్రలో నటించారు.
అనిల్ రావిపూడి రియాక్షన్
2023 అక్టోబర్ లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. భగవంత్ కేసరి చిత్రానికి జాతీయ అవార్డు దక్కడంపై డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పందించారు. నా కెరీర్ లో భగవంత్ కేసరి విభిన్న ప్రయత్నంగా నిలిచిపోతుంది. మేము ఆశించినట్లుగానే ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు జాతీయ అవార్డు రావడం మాకు బోనస్ అని అనిల్ రావిపూడి అన్నారు. జాతీయ అవార్డు రావడం సంతోషంగా ఉంది. బాలకృష్ణ సార్ తో కూడా మాట్లాడా. ఆయన కూడా సంతోషం వ్యక్తం చేశారు అని అనిల్ రావిపూడి తెలిపారు.