ఓటీటీలో సంచలనం సృష్టించిన థ్రిల్లర్ సినిమాలు, ఎక్కడ చూడొచ్చంటే?
ఓటీటీ వేదికగా థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కథ బలంగా ఉంటే చాలు స్టార్ హీరోలు, హంగులు లేకపోయినా ప్రేక్షకుల్ని థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ లోకి తీసుకెళ్లొచ్చని నిరూపిస్తున్నాయి.

ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్ సినిమాలకు డిమాండ్ భారీగా పెరిగిపోయింది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న కొన్ని థ్రిల్లర్ సినిమాలు మిస్టరీతో కూడిన యాక్షన్ డ్రామాగా రూపొందాయి. ఈసినిమాలు ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటంటే?
KNOW
దృశ్యం 2
తమింళంలో మోహాన్ లాల్, తెలుగులో వెంకటేష్ నటించిన ఈసినిమా హిందీలో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో తెరకెక్కించారు. ‘దృశ్యం 2’ హిందీ థ్రిల్లర్ ప్రపంచాన్ని కదిలించింది. ఒక హత్య కేసు ఏడేళ్ల తర్వాత తిరిగి తెరవడం ద్వారా కథ ప్రారంభమవుతుంది. కుటుంబాన్ని కాపాడేందుకు హీరో తీసుకునే నిర్ణయాలు సినిమాను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దాయి.
రన్‌వే 34
అజయ్ దేవగన్ నటించి, దర్శకత్వం వహించిన ‘రన్‌వే 34’ 2015లో జరిగిన జెట్ ఎయిర్‌వేస్ సంఘటన ఆధారంగా రూపొందించబడింది. థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈసినిమాలో అమితాబ్ బచ్చన్, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. విమాన నావిగేషన్ లో ఎదురైన సంఘటనలు, విచారణలు సినిమాను ఆసక్తికరంగా మార్చాయి.
రాజీ
అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా హరీందర్ సిక్కా రాసిన ‘కాలింగ్ సెహ్మత్’ నవల ఆధారంగా రూపొందింది. 1971 భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో తన తండ్రి నిస్సహాయంగా చేసిన పెళ్లి వల్ల ఒక యువతీ పాక్‌లో స్పైగా మారిన కథ. ఈ చిత్రంలో అలియా నటనకు జాతీయ అవార్డు లభించింది.
ఆంఖేన్
అమితాబ్ బచ్చన్, సుష్మితా సేన్, అర్జున్ రాంపాల్, అక్షయ్ కుమార్, పరేష్ రావల్ వంటి తారాగణం నటించిన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతో ఆకట్టుకుంది. ముగ్గురు వికలాంగులను బ్యాంక్ దోపిడీ కోసం ఉపయోగించుకోవడమే ఈ సినిమా కథ. ఆ మిషన్ ఎదురయ్యే సవాళ్లుఅందుకు తగ్గట్టుగా రాసుకున్న థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.
A Wednesday
నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందిన ఈసినిమాలో లో నసీరుద్దీన్ షా, అనుపమ్ ఖేర్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఓ సాధారణ వ్యక్తి పోలీస్ కమిషనర్‌ను బెదిరించి నలుగురు ఉగ్రవాదులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తాడు. ఆతరువాత జరిగిన సంఘటనలు ఊహించని మలుపుల తిరిగి, చివరికి ఎలా ముగుస్తుంది అనేది సినిమా. ఈ సినిమాలన్నీ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్నాయి.

