MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Entertainment
  • ప్రేమ కోసం ఎవరిముందైనా అడుక్కుంటా.. విజయ్ ఆంటోనీ సంచలన కామెంట్స్..

ప్రేమ కోసం ఎవరిముందైనా అడుక్కుంటా.. విజయ్ ఆంటోనీ సంచలన కామెంట్స్..

ఎవరైనా కష్టాల్లో ఉండి, నేను అడుక్కుంటే వాళ్ల ప్రాణం నిలబడుతుంది అంటే.. వాళ్ల కోసం తప్పకుండా భిక్షాటన చేస్తానని నటుడు విజయ్ ఆంటోనీ అన్నారు. ఇంకా విజయ్ ఏమన్నాడంటే?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Feb 22 2026, 09:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విజయ్ ఆంటోనీ కామెంట్స్ వైరల్..
Image Credit : Youtube Screenshot

విజయ్ ఆంటోనీ కామెంట్స్ వైరల్..

సౌత్ స్టార్ హీరో.. మ్యూజిక్ డైరెక్టర్  విజయ్ ఆంటోనీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా నా దగ్గరికొచ్చి, 'నేను కష్టాల్లో ఉన్నాను, మీరు నా కోసం భిక్షాటన చేస్తే నా ప్రాణం నిలబడుతుంది' అని అడిగితే.. వాళ్ల కోసం తప్పకుండా అడుక్కుంటానని ఆయన అన్నారు.  ఆయన ఆ కామెంట్స్ ఎందుకు చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయ్ ఆంటోనీ సినీ ప్రస్థానం
Image Credit : our own

విజయ్ ఆంటోనీ సినీ ప్రస్థానం

విజయ్ ఆంటోనీ.. కేవలం నటుడే కాదు, సంగీత దర్శకుడు, గాయకుడు, నిర్మాత కూడా. తనకంటూ ప్రత్యేకమైన శైలితో సంగీతం అందించి, నటనలోనూ అదే ప్రత్యేకతను చూపిస్తూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు.

Related Articles

Related image1
పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ షాక్... పవర్ స్టార్ సినిమాపై భారీ అప్ డేట్.. నిజమెంత?
Related image2
రష్మిక మందన్న పెళ్లిపై చీప్ కామెంట్స్.. స్టార్ నటుడిపై అభిమానుల ఫైర్
35
విజయ్ ఆంటోనీ కుటుంబం..
Image Credit : our own

విజయ్ ఆంటోనీ కుటుంబం..

కన్యాకుమారి జిల్లా నాగర్‌కోయిల్‌లో పుట్టిన విజయ్ ఆంటోనీ, ప్రముఖ నవలా రచయిత, కర్ణాటక సంగీత ప్రియులు మాయవరం శామ్యూల్ వేదనాయగం పిళ్లై కుటుంబానికి చెందినవారు. పుట్టింది కన్యాకుమారి అయినా, పెరిగిందంతా తిరుచ్చిలో. 

ఏడేళ్ల వయసులో తండ్రి చనిపోవడంతో కుటుంబం కష్టాల్లో పడింది. తండ్రి ప్రభుత్వ ఉద్యోగం తల్లికి రావడంతో, వాళ్లంతా తిరునల్వేలికి వెళ్లారు. అక్కడే స్కూల్ చదువు పూర్తిచేశారు. చదువుకునే రోజుల్లోనే స్నేహితుడి ద్వారా సౌండ్ ఇంజనీర్‌గా చేరారు. వచ్చిన తక్కువ జీతంతోనే ఇంట్లో మినీ స్టూడియో పెట్టుకుని సంగీతంలో పట్టు సాధించాడు. 

45
సంగీత దర్శకుడిగా ఎలా మారాడు?
Image Credit : our own

సంగీత దర్శకుడిగా ఎలా మారాడు?

సంగీతంపై ఉన్న ఇష్టంతో 2005లో 'సుక్రాన్' సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేశాడు. కానీ జీవా, సంధ్య నటించిన 'డిష్యుం' సినిమాలోని 'నెంజాంగూటిల్ నీయే నిక్కిరాయ్' పాటతో ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత 'కాదలిల్ విలుందేన్', 'ఉత్తమపుతిరన్', 'యమన్', 'బిచ్చగాడు' వంటి హిట్ సినిమాలకు సంగీతం అందించి స్టార్ అయ్యారు. సంగీత రంగంలో సక్సెస్ అయ్యాక, నటనపై ఆసక్తి చూపించాడు. 

2012లో 'నాన్' సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు విజయ్ ఆంటోనీ. దర్శకుడు శశి తీసిన 'బిచ్చగాడు' సినిమా ఆయనకు కొత్త ఇమేజ్ ఇచ్చింది. 'సలీం', 'ఇండియా పాకిస్థాన్', 'సైతాన్', 'యమన్', 'అన్నాదురై', 'కాళి', 'కిల్లర్' వంటి సినిమాలతో తమిళంలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు.

55
బిచ్చగాడు సినిమాతో స్టార్ హీరోగా..
Image Credit : our own

బిచ్చగాడు సినిమాతో స్టార్ హీరోగా..

'బిచ్చగాడు' సినిమాలో, అనారోగ్యంతో ఉన్న తల్లి కోసం హీరో ఓ స్వామీజీని ఆశ్రయిస్తాడు. 'నువ్వు 48 రోజులు (ఒక మండలం) భిక్షాటన చేసి, వచ్చిన డబ్బును గుడి హుండీలో వేస్తే నీ తల్లి బతుకుతుంది' అని స్వామీజీ చెప్తారు. హీరో అలాగే చేసి తల్లిని కాపాడుకుంటాడు. కొన్ని నెలల క్రితం విజయ్ ఆంటోనీ పెద్ద కూతురు అనారోగ్యంతో మరణించింది. ఈ విషాదం ఆయన్ను తీవ్రంగా కుంగదీసింది.

ఓ ఇంటర్వ్యూలో 'బిచ్చగాడు' సినిమా గురించి అడిగినప్పుడు.. 'ఎవరికోసమైనా నేను అడుక్కుంటా. అది మా అమ్మ, తమ్ముడు, చెల్లి.. ఎవరైనా కావచ్చు. మీరు నిజంగా కన్నీళ్లతో నా దగ్గరికొచ్చి, 'సార్ నేను కష్టాల్లో ఉన్నాను, మీరు నా కోసం భిక్షాటన చేస్తే నా ప్రాణం నిలబడుతుంది' అని చెప్తే.. వాళ్ల కోసం తప్పకుండా అడుక్కుంటాను' అని విజయ్ ఆంటోనీ అన్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తమిళ సినిమా
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Reshma Rathore: సినిమాలకు గుడ్‌ బై చెప్పి కోర్ట్ మెట్లు ఎక్కుతున్న టాలీవుడ్‌ హీరోయిన్‌.. డేరింగ్‌ స్టెప్‌
Recommended image2
Vijay Deverakonda: మందు, అమ్మాయి, బ్రేకప్‌ ఇప్పుడు పెళ్లి.. తన లైఫ్ సీక్రెట్స్ అన్నీ చెప్పేసిన రౌడీ బాయ్
Recommended image3
Raviteja Remuneration: ఇరుముడి మూవీకి రవితేజ పారితోషికం ఎంతో తెలుసా? చిరంజీవిని మించి.. టీమ్‌ ఫీజు వివరాలు
Related Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ అభిమానులకు భారీ షాక్... పవర్ స్టార్ సినిమాపై భారీ అప్ డేట్.. నిజమెంత?
Recommended image2
రష్మిక మందన్న పెళ్లిపై చీప్ కామెంట్స్.. స్టార్ నటుడిపై అభిమానుల ఫైర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved